ముచ్చటగా మూడు రోజుల క్యాంప్
అయితే జట్లన్నీ నేరుగా ఎడారి దేశంలోనే ప్రాక్టీస్ క్యాంప్‌లు ఏర్పాటు చేసుకోగా.. చెన్నై మాత్రం సొంతగడ్డపై మూడు రోజుల క్యాంప్ నిర్వహించింది. ఈ శిబిరానికి భారత్‌కు చెందిన ఆటగాళ్లంతా హాజరయ్యారు. అయితే క్యాంప్ తొలి రోజే ఆ జట్టు దిగ్గజాలు మహేంద్ర సింగ్ ధోనీ, సురేశ్ రైనా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. దీంతో క్యాంప్‌లో కొంత నిశబ్ధం అలుముకున్నా.. తర్వాత సాధారణమైపోయింది. నెట్స్‌లో ఆటగాళ్లు తెగ కష్టపడ్డారు. తీవ్రంగా చెమటోడ్చారు. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ధోనీ, రైనా కూడా ముమ్మరంగా సాధన చేశారు.

సిక్సర్ కొట్టిన ధోనీ.. సీటి కొట్టిన రైనా..
ఈ ప్రాక్టీస్ క్యాంప్‌కు సంబంధించిన వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. 'కరోనా వైరస్ వల్ల అభిమానులు ఈ సారి సూపర్ క్యాంప్‌ను మిస్సయ్యారు. అయినప్పటికీ ఓ పెద్ద ఈలతో మేం శిబిరాన్ని ముగించాం' అని సీఎస్కే ట్వీట్ చేసింది. అయితే ఈ వీడియో చివర్లో ధోనీ తన ట్రేడ్ మార్క్ షాట్లతో భారీ సిక్సర్‌లు కొట్టగా.. అక్కడే ఉన్న రైనాతో విజిల్ కొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

దుబాయ్ పయనం..
కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాళ్లు గురువారమే యూఏఈ చేరుకోగా.. శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ బయలుదేరింది. చెన్నై ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది తదితరులు యూఏఈకి పయనమయ్యారు. ప్రాక్టీస్ క్యాంప్‌కు దూరంగా ఉన్న సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మాత్రం జట్టుతో దుబాయ్‌కు వెళ్లలేదు. వ్యక్తిగత కారణాల వల్ల అతను రెండు వారాలు ఆలస్యంగా జట్టుతో కలవనున్నాడు.

ఎక్కడపడితే అక్కడ తిరగవద్దు..
దుబాయ్ వెళ్తున్న క్రికెటర్లు కరోనా ప్రొటోకాల్స్ ఉల్లంఘించకుండా జాగ్రత్తగా ఉండాలని బీసీసీఐ హెచ్చరించింది. ఎన్నోఆటంకాలను అధిగమించిన తర్వాత సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు యూఏఈ వేదికగా ఐపీఎల్ జరగనుంది. అయితే ఇటీవల యూఏఈలో కరోనా విజృంభణ పెరిగింది. దీంతో అప్రమత్తమైన బోర్డు.. ప్లేయర్లు, ఫ్రాంచైజీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆటగాళ్ల భద్రతకు అవసరమైన అన్ని వసతులను యూఏఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని, కరోనా ముప్పు ఉండడంతో ఎక్కడపడితే అక్కడ తిరగవద్దంటూ అందరికీ హెచ్చరికలు పంపామని ఓ బోర్డు అధికారి తెలిపారు.
నువ్వు హెచ్చరించి పదేళ్లు అయింది కోహ్లీ భాయ్.. నన్నేం చేయలేకపోయావ్.. !


Click it and Unblock the Notifications
