IPL 2020: ప్లేఆఫ్స్‌కు హైదరాబాద్.. యువ ఆస్ట్రాలజర్‌కు ఫుల్ డిమాండ్!

హైదరాబాద్: మిథుల్ అనే ఓయువ ఆస్ట్రాలజర్ గురించి, ఐపీఎల్ 2020 సీజన్‌ను ఉద్దేశించి అతను చెప్పిన జోస్యం గురించి మనం చదువుకున్నాం. ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభమవ్వకముందు ట్విటర్ వేదికగా మెగా టోర్నీ గురించి అతను ఓ ఆరు పాయింట్లు చెప్పడం.. తీరా అందులో ఉన్నట్లే టోర్నీ జరగడంతో అవాక్కయ్యాం. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్ గెలుస్తుందని చెప్పడంతో మన తెలుగు అభిమానులు ఈ మిథుల్‌కు వీరాభిమానులు అయ్యారు. ఈ తరం కాలజ్ఞాణి అంటూ ఈ యువ ఆస్ట్రాలజర్‌ను కోనియాడారు.

నెట్టింట ఫుల్ క్రేజ్..
అయితే మిథుల్ చెప్పినట్లే సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్‌కు చేరడం.. అది పటిష్ట ముంబై ఇండియన్స్‌ను పది వికెట్లతో ఓడించి మరి టోర్నీలో ముందడుగు వేయడం.. టైటిల్‌కు మరో రెండు అడుగుల దూరంలో నిలవడంతో అతనికి ఫుల్ డిమాండ్ వచ్చింది. ఇంకేముంది భవిష్యత్తు తెలుసుకోవడానికి నెటిజన్లు ఈ యువ జ్యోతిష్యుడు ముందు క్యూ కట్టారు. తమ చేతి ఫోటోలను అతనికి పంపించి మరీ.. తమ భవిష్యత్తు చెప్పమని కోరుతున్నారు. అయితే మిథుల్ మాత్రం.. తాను జ్యోతిష్యున్ని కాదని నెత్తి బాదుకుంటున్నాడు.

నేను జోస్యం చెప్పను..
మిథుల్ ట్విట్టర్ బయోలో.. ‘మోడ్రన్ డే ఆస్ట్రాలజర్, నేను అంచనా వేయను.. స్క్రిప్ట్స్ రాస్తాను' అని ఉంది. ఇక ట్విటర్ ప్రకారం అతనిది అహ్మదాబాద్ సిటీ అని తెలుస్తోంది. కానీ అతను కొన్ని ట్వీట్లు తెలుగులో ఉండటం.. తెలుగు పదాలు వాడటం గమనార్హం. అయితే జోస్యం చెప్పను అంటూనే అతను చెప్పినవన్నీ నిజం కావడం..అతనికి క్రేజ్‌ను తీసుకొచ్చింది. పైగా తాను విరాట్ కోహ్లీ అభిమాని అని కూడా చెప్పుకున్నాడు.

ఇంతకీ మిథుల్ ఏం చెప్పాడంటే..
ఐపీఎల్ 2020 సీజన్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రదర్శన యావరేజ్‌గా ఉంటుందన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చేరదన్నాడు. రాజస్థాన్ రాయల్స్ అట్టడుగు స్థానంలో నిలుస్తుందన్నాడు. కింగ్స్ పంజాబ్ కూడా ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై కాదన్నాడు. కానీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ ఫ్లే ఆఫ్స్ చేరుతాయని, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్ టైటిల్ గెలుస్తుందని జోస్యం చెప్పాడు. టోర్నీ ప్రారంభానికి నాలుగు నెలల ముందు జూలై 27న ఈ ట్వీట్ చేయగా ఇందులో చెప్పినట్లే ఇప్పటి వరకూ జరగాయి.

సెంటిమెంట్ రిపీట్..
ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ 2016 ఫైనల్లో బెంగళూరును ఓడించి టైటిల్ గెలిచింది. అయితే ఆ సీజన్ పరిస్థితులు ఇప్పుడు పునరావృతం కావడం.. అప్పటిలానే హైదరాబాద్ కారణంగా కోల్‌కతా ఇంటి బాట పట్టడం.. హైదరాబాద్ అభిమానుల్లో ఆశలు రెకెత్తిస్తోంది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా పదే పదే ఈ విషయాన్ని గుర్తు చేయడం..దానికి తోడు ఈ మిథుల్ జోస్యం నిజమవ్వడంతో ఈ సీజన్ మనదే అని ప్రతీ హైదరాబాద్ అభిమాని గల్ల ఎగిరిసి చెప్పేలా చేస్తుంది. మరీ నిజంగానే ఆరెంజ్ ఆర్మీ కప్ కొడితే.. ఈ మిథుల్‌కు వీరతాడు వేద్దాం.
ఈ సీజన్‌లోనే మాకు ఇదో చెత్త ప్రదర్శన.. గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా: రోహిత్ శర్మ
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications