చెత్త రికార్డుతో కౌల్ కాక దిండాను మించిపోయాడు.. నెట్టింట పేలుతున్న జోక్స్, మీమ్స్!

షార్జా: ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ సిద్దార్థ్ కౌల్ తేలిపోయాడు. రెండు వికెట్లు తీసినప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకొని ఐపీఎల్ 2020లో ఎక్కువ రన్స్ ఇచ్చిన బౌలర్‌గా చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఖలీల్ అహ్మద్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన కౌల్.. ప్రత్యర్థిని కట్డడి చేయడంలో దారుణంగా విఫలమయ్యాడు.
అతను వేసిన ఆఖరి ఓవర్‌లో తొలి బంతికి పోలార్డ్ సింగిల్ తీయగా.. రెండో బంతికి హార్దిక్ పాండ్యా బౌల్డ్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కృనాల్ పాండ్యా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. చివరి నాలుగు బంతులను వరుసగా 6,4,4,6 తో బౌండరీ తరలించడంతో ఈ ఓవర్లో 21 రన్స్ వచ్చాయి. దీంతో మొత్తం 64 పరుగులు సమర్పించుకున్న కౌల్.. ముంబై ఇండియన్స్ 208 పరుగుల భారీ స్కోర్‌కు కారణమయ్యాడు.
చెత్త బౌలర్ల టాపర్..
ఈ సీజన్లో అత్యధిక పరుగులు ఇచ్చుకున్న బౌలర్ ఆర్‌సీబీ పేసర్ డేల్ స్టెయిన్ (57) కాగా.. కౌల్(64) తన తొలి మ్యాచ్‌లోనే అతన్ని దాటేశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు ఇచ్చుకున్న బౌలర్ల జాబితాలో ఆరోస్థానానికి చేరుకున్నాడు. అందరూ ట్రోల్ చేసే అశోక్ దిండా (63 రన్స్)ను సైతం కౌల్ వెనక్కు నెట్టాడు. ఇక భారీగా పరుగులు సమర్పించుకున్న సిద్ధార్థ్ కౌల్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు మండిపడుతున్నారు. అతని బౌలింగ్‌పై నెట్టింట ఫన్నీ మీమ్స్, జోక్స్ ట్రెండ్ చేస్తున్నారు.
కౌల్ కాక హాఫ్ సెంచరీ చేశావుగా..
‘కౌల్ కాక.. ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ తరఫున నువ్వే హాఫ్ సెంచరీ చేశావుగా'అని ఒకరంటే.. దిండా అకాడమీకి పోటీగా కౌల్ అన్నా మరో అకాడమీ తెరిచాడంటూ ఇంకొకరు సెటైర్ వేస్తున్నారు. ‘బోయపాటి సినిమాలు ఎక్కవుగా చూస్తావా? అన్నా వాళ్లు అలా కోడుతున్నా మళ్లీ అవే బంతులు వేస్తున్నావు'అనే ఫన్నీ కామెంట్స్‌ను ట్రెండ్ చేస్తున్నారు. సిద్దార్థ్ కౌల్‌ను కృనాల్ ఉతికారేశాడనే మీమ్స్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కౌల్‌పై జరుగుతున్న భీకరమైన ట్రోలింగ్, ఫన్నీమీమ్స్ నవ్వులు పూయిస్తున్నాయి.
సిక్సర్ల మోత..
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ సిక్సర్ల మోత మోగించడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు 209 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది. క్వింటన్ డికాక్(67) హాఫ్ సెంచరీకి తోడు.. ఇషాన్ కిషన్(31), హార్దిక్ పాండ్యా(28), కీరన్ పోలార్డ్(25 నాటౌట్), కృనాల్(4 బంతుల్లో 20) మెరుపులు మెరిపించడంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 208 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో సందీప్ శర్మ, కౌల్ రెండేసి వికెట్లు తీయగా.. రషీద్ ఒక వికెట్ పడగొట్టాడు. రోహిత్ శర్మ(6) విఫలమైనా ఇతర బ్యాట్స్‌మెన్ ధాటిగా ఆడుతూ తలో చేయివేసారు.
వార్నర్ పోరాడినా..
209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ముంబై కట్టుదిట్టమైన బౌలింగ్‌కు చేతులెత్తేసింది. డేవిడ్ వార్నర్(44 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 60) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడకపోవడంతో హైదరాబాద్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. 20 ఓవర్లలో 7 వికెట్లకు 174 రన్స్‌కే పరిమితమైంది.
SRH vs MI: వాటే క్యాచ్ మనీష్ పాండే.. అచ్చం చేప పిల్లలానే డైవ్! (వీడియో)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications