
హైదరాబాద్ @5
2010 నుంచి 15 వరకు ముంబై ఆరు సార్లు వరుసగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. అందులో రెండు సార్లు విజేతగా అవతరించింది. ఆ తర్వాత మరో రెండు టైటిళ్లు గెలిచింది. ఇక 2008-15 మధ్య చెన్నై వరుసగా ఎనిమిది సార్లు ప్లేఆఫ్స్‌కు చేరుకోగా రెండుసార్లు టైటిల్ ముద్దాడింది. నిషేధం తర్వాత మరో ట్రోఫీ అందుకుంది.
2016-20 మధ్య వరుసగా ప్లేఆఫ్స్ చేరుకుంది. 2016లో టైటిల్ గెలిచింది. ఫైనల్లో బెంగళూరును ఓడించింది. 2017లో మూడో స్థానంలో నిలిచిన హైదరాబాద్.. 2018లో ఫైనల్ చేరి తృటిలో టైటిల్ చేజార్చుకుంది. కేన్ విలియమ్సన్ (735 పరుగులు), రషీద్ ఖాన్ (21 వికెట్లు), సిద్ధార్థ్ కౌల్ (21 వికెట్లు) చెలరేగారు. ఇక 2019లో నాలుగో స్థానంలో నిలవడం గమనార్హం. నిషేధం తర్వాత వచ్చిన వార్నర్ (692 పరుగులు) విధ్వంసకరంగా ఆడాడు.

కోహ్లీ రికార్డు బ్రేక్..
డేవిడ్ వార్నర్ తాను ఆడిన ఆరు వరుస ఐపీఎల్‌లలో (2014నుంచి) కనీసం 500కు పైగా పరుగులు సాధించాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీని (5 సార్లు) అతను అధిగమించాడు. 2018లో వార్నర్ ఐపీఎల్ ఆడలేదు. ఐపీఎల్ చరిత్రలో హైదరాబాద్ 10 వికెట్ల తేడాతో నెగ్గడం ఇది రెండోసారి. 2016లో గుజరాత్ లయన్స్‌పై తొలిసారి ఈ ఘనత సాధించిన హైదరాబాద్ ఆ ఏడాది ఐపీఎల్ చాంపియన్‌గా నిలువడం విశేషం.

పడుతూ లేస్తూ సాగిన ఆట..
తాజా సీజన్లో హైదరాబాద్ ఆట పడుతూ లేస్తూ సాగింది. మొదటి 2 మ్యాచుల్లో వరుసగా ఓడినా తర్వాతి 2 గెలిచి 4 పాయింట్లు అందుకొంది. ఐదో మ్యాచులో ముంబై చేతిలో ఓడినా ఆరో మ్యాచులో పంజాబ్‌పై గెలిచి 6 పాయింట్లు సాధించింది. ఆ తర్వాత డేవిడ్ సేనను వరుస ఓటములు పలకరించాయి. రాజస్థాన్, చెన్నై, కోల్‌కతా చేతుల్లో ఓటమి పాలైంది. కోల్‌కతాపై సూపర్ ఓవర్లో పరాజయం పొందడం విశేషం.
రాజస్థాన్‌పై గెలిచి 8 పాయింట్లతో నిలిచినా పంజాబ్‌తో కీలక మ్యాచులో ఓడిపోవడంతో పరిస్థితి కఠినంగా మార్చింది. అయితే పాయింట్స్ టేబుల్లో టాప్4లో ఉన్న ఢిల్లీ, బెంగళూరు, ముంబైపై ఆఖర్లో వరుసగా విజయాలు సాధించి 14 పాయింట్లు, మెరుగైన రన్‌రేట్‌తో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది.
IPL 2020: సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయ రహస్యం ఇదే.. కేన్ మామ కీలక పాత్ర!


Click it and Unblock the Notifications
