Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2020: సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయ రహస్యం ఇదే.. కేన్ మామ కీలక పాత్ర!

https://telugu.mykhel.com/cricket/ipl-2020-fans-demand-separate-cbi-enquiry-on-rohit-sharma-injury-031367.html

హైదరాబాద్: ఐపీఎల్ 2020 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరింది. ముంబై ఇండియన్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్లతో గెలిచిన హైదరాబాద్.. సగర్వంగా టోర్నీలో ముందడుగు వేసింది. అయితే సీజన్ ప్రారంభంలో ఆరెంజ్ ఆర్మీ ఆట.. పడుతూ లేస్తూ సాగింది. కోల్‌కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చేతుల్లో గెలుపు ఖాయం అనుకున్న స్థితిలో అనూహ్యంగా ఓటమిపాలైంది.

కానీ చివరి మూడు మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబైలపై ఘన విజయాలు సాధించి ప్లేఆఫ్స్‌లోకి దూసుకొచ్చింది. అయితే ఈ మూడు జట్లు ప్లేఆఫ్‌లోనే ఉండటం వార్నర్ సేనకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఒకానొక దశలో టోర్నీ రేసు నుంచి తప్పుకునేలా కనిపించిన హైదరాబాద్.. ఇంతలా పుంజుకుందంటే దానికి డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్స‌న్‌లే కారణం. టీమ్‌మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయాలు కూడా కలిసొచ్చాయి.

కెప్టెన్సీలో కేన్ మామ హెల్ప్..

కెప్టెన్సీలో కేన్ మామ హెల్ప్..

అయితే హైదరాబాద్ విజయాల్లో కేన్ విలియమ్సన్ పాత్ర మరువలేనిది. అతని ప్రశాంతతకు వార్నర్ దూకుడు తోడవ్వడంతో జట్టు విజయాల బాట పట్టింది. ముఖ్యంగా గత మూడు మ్యాచ్‌ల్లో ఇది స్పష్టంగా కనిపించింది. మైదానంలో ఫీల్డింగ్ సెట్ చేయడం, కీలక సమయాల్లో ఏ బౌలర్‌ను ఉపయోగించాలనే విషయంలో ఎంతో అనుభవమున్న కేన్.. వార్నర్‌కు సాయం అందిస్తున్నాడు. ముఖ్యంగా వార్నర్ లాంగాన్‌లో ఫీల్డింగ్ చేస్తుంటే సర్కిల్ లోపల ఉన్న కేన్.. బౌలర్లతో మాట్లాడటం, ఫీల్డింగ్ సెట్ చేయడం వంటివి చేశాడు. దీంతో వార్నర్‌పై ఒత్తిడి తగ్గి స్వేచ్చగా ఆడేలా చేసింది. అది అతని బ్యాటింగ్‌కు కూడా మేలు చేసింది.

సాహోరే సాహా..

సాహోరే సాహా..

ఫామ్‌లో ఉన్న బెయిర్ స్టోను పక్కనపెట్టి టీమ్‌మేనజ్‌మెంట్ తీసుకున్న సాహోసపేత నిర్ణయం కూడా హైదరాబాద్‌కు కలిసి వచ్చింది. అతనికి బదులుగా ఓపెనింగ్ చేసిన సాహా అదరగొట్టడం జట్టును విజయాల బాటపట్టించింది. అంతేగాకుండా కేన్ విలియమ్సన్, జాసన్ హోల్డర్‌లను జట్టులోకి తీసుకోవడంతో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు బలోపేతమయ్యాయి. కేన్ విలియమ్సన్‌‌కు పెద్దగా అవకాశాలు రాకున్నా.. హోల్డర్ మాత్రం బంతితో చెలరేగుతున్నాడు. కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అటు బ్యాటింగ్‌లోనూ అండగా ఉంటున్నాడు.

‘సన్‌'దీప్ శర్మ..

‘సన్‌'దీప్ శర్మ..

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సందీప్ శర్మ వెలుగునిస్తున్నాడు. అద్భుత బౌలింగ్‌తో గాయంతో దూరమైన భువనేశ్వర్ కుమార్ లోటును తీరుస్తున్నాడు. స్లో పేస్‌తోనే పవర్ ప్లేలో వికెట్లు తీస్తూ జట్టుకు మంచి శుభారంభాలందిస్తున్నాడు. గత మూడు మ్యాచ్‌ల్లో సందీప్ కీలక వికెట్లు తీశాడు. అతనికి అండగా యార్కర్ల నటరాజన్ పర్వాలేదనిపిస్తుండటంతో హైదరాబాద్‌కు తిరుగులేకుండాపోయింది. ఇక నదీమ్ రాక కూడా జట్టుకు కలిసి వచ్చింది. రషీద్‌ఖాన్‌కు తోడుగా అతను అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ముంబైతో పొదుపుగా బౌలింగ్ చేసి ఆ జట్టు పతనాన్ని శాసించాడు.

ఫ్లే ఆఫ్స్‌కు పరుగో పరుగు..

ఫ్లే ఆఫ్స్‌కు పరుగో పరుగు..

మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. పొలార్డ్‌ (25 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా... సూర్యకుమార్‌ యాదవ్‌ (29 బంతుల్లో 36; 5 ఫోర్లు), ఇషాన్‌ కిషన్‌ (30 బంతుల్లో 33; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. సందీప్‌ శర్మకు 3 వికెట్లు దక్కగా, 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' షాబాజ్‌ నదీమ్‌ (2/19) పొదుపుగా బౌలింగ్‌ చేశాడు.

అనంతరం హైదరాబాద్‌ 17.1 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 151 పరుగులు సాధించింది. కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ (58 బంతుల్లో 85 నాటౌట్‌; 10 ఫోర్లు, 1 సిక్స్‌), వృద్ధిమాన్‌ సాహా (45 బంతుల్లో 58 నాటౌట్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ బ్యాటింగ్‌ ప్రదర్శన కనబర్చి జట్టును గెలిపించారు. శుక్రవారం జరిగే ఎలిమినేటర్‌లో బెంగళూరుతో సన్‌రైజర్స్‌ తలపడుతుంది.

రోహిత్ శర్మ గాయంపై మళ్లీ దుమారం.. సీబీఐ దర్యాప్తు చేయాలంటున్న ఫ్యాన్స్!

Story first published: Wednesday, November 4, 2020, 12:26 [IST]
Other articles published on Nov 4, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+