For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH vs CSK: చెన్నై నిలుస్తుందా? సన్‌రైజర్స్‌పై ప్రతీకారం తీర్చుకుంటుందా?

IPL 2020, SRH vs CSK: Who will win Sunrisers Hyderabad vs Chennai Super Kings
IPL 2020, SRH vs CSK Preview: Must-Win Clash, Nail Biting Finish In Last Match | Oneindia Telugu

దుబాయ్‌‌: ఐపీఎల్‌‌-2020 సీజన్‌లో సగం మ్యాచ్‌‌లు పూర్తి అయ్యాయి. కానీ టైటిల్‌‌ ఫేవరెట్‌‌ చెన్నై సూపర్‌‌కింగ్స్‌‌ పరిస్థితి మాత్రం రోజురోజుకు దిగజారుతోంది. ఆడిన 7 మ్యాచ్‌‌ల్లో రెండింటిలో గెలిచి పాయింట్స్ టేబుల్‌‌లో ఆఖరి నుంచి రెండో స్థానం‌లో నిలిచిన ధోనీసేన ఇప్పుడు చావోరేవో పరిస్థితిలో పడింది. ప్లే ఆఫ్‌‌ ఆశలు సజీవంగా ఉండాలంటే ప్రతి మ్యాచ్‌‌ గెలవాల్సిన స్థితిని తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగే ప్రతీకార పోరులో సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌తో అమీతుమీ తేల్చుకోనుంది.

గత రెండు మ్యాచ్‌ల్లో(ఆర్‌సీబీ, కేకేఆర్) ఓటమి ముంగిట చేతులెత్తేసిన చెన్నై గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతుండగా.. రాజస్థాన్ రాయల్స్ చేతిలో అనూహ్య పరాజయంతో ఖంగుతిన్నది. దాంతో ఆ జట్టుకు కూడా గెలుపు అనివార్యమైంది. ఈ సీజన్‌‌లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ అద్భుత విజయాన్నందుకుంది. యువ ఆటగాళ్ల ప్రతిభతో గెలుపొందింది. ఆ ఓటమికి చెన్నై ప్రతీకారం తీసుకుంటుందో లేదో చూడాలి!

ఎన్నడూ లేని విధంగా...

ఎన్నడూ లేని విధంగా...

ఛేజ్‌‌ మాస్టర్‌‌ ధోనీ.. టీమ్‌‌ బ్యాటింగ్‌‌ సమస్యలతో ఎప్పుడూ లేనంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఓపెనర్లు వాట్సన్‌‌, డుప్లెసిస్‌‌ శుభారంభాలు ఇస్తున్నా.. మిడిలార్డర్‌‌ వైఫల్యం చెన్నైకి ప్రతికూలంగా మారింది. ఇన్నాళ్లూ కేదార్‌‌ జాదవ్‌‌పై నమ్మకం పెట్టినా... అతను రాణించలేకపోయాడు. లాస్ట్‌‌ మ్యాచ్‌‌లో జాదవ్‌‌ను డ్రాప్‌‌ చేసి జగదీశన్‌‌కు చాన్స్‌‌ ఇచ్చారు. రాయుడు, జగదీశన్‌‌ ఉన్నంతసేపు పటిష్టంగా కనిపించిన చెన్నై ఈ ఇద్దరి ఔట్‌‌తో ఓటమిపాలైంది. సామ్‌‌ కరన్, జడేజా, బ్రావో వైఫల్యం టీమ్‌‌ను వెంటాడుతున్నది. ఒత్తిడిలో ధోనీ కూడా తన ఫినిషింగ్‌‌ స్కిల్స్‌‌ను మర్చిపోతున్నాడు. బౌలింగ్‌‌లో దీపక్‌‌ చహర్‌‌, జడేజా ఆకట్టుకుంటున్నారు. బ్రావో రావడం కాస్త రిలీఫ్‌‌ ఇచ్చినా, కరన్‌‌, శార్దూల్‌‌ ఠాకూర్‌‌, కర్ణ్​ శర్మ గాడిలో పడాల్సి ఉంది. జట్టులో మార్పులు ఉండకపోవచ్చు.

హైదరాబాద్‌కు విజయం కావాలి..

హైదరాబాద్‌కు విజయం కావాలి..

చెన్నై కంటే కొద్దిగా మెరుగైన స్థితిలో ఉన్న హైదరాబాద్‌‌కు కూడా ఈ మ్యాచ్‌‌లో గెలవడం అత్యవసరం. రాజస్తాన్‌‌ చేతిలో చేజేతులా ఓడటంతో ఇప్పుడు ఒత్తిడిలో పడిన ఆరెంజ్‌‌ ఆర్మీ.. ఈ మ్యాచ్‌‌పై దృష్టిపెట్టింది. బ్యాటింగ్‌‌లో ఎస్‌‌ఆర్‌‌హెచ్‌‌కు సమస్యల్లేవు. బెయిర్‌‌స్టో, డేవిడ్ వార్నర్‌‌, మనీశ్‌ పాండే‌, కేన్ విలియమ్సన్‌‌ మంచి ఫామ్‌‌లో ఉన్నారు. అయితే పేసర్‌‌ భువనేశ్వర్‌‌ లేకపోవడంతో బౌలింగ్‌‌లోనే హైదరాబాద్‌‌ సమస్యలు ఎదుర్కొంటున్నది. మరీ ముఖ్యంగా డెత్‌‌ ఓవర్లలో రన్స్‌‌ కట్టడి చేసే సరైన బౌలర్‌‌ లేడు. రషీద్‌‌ ఖాన్‌‌ మెరుస్తున్నా.. యార్కర్‌‌ స్పెషలిస్ట్‌‌ నటరాజన్‌‌ మరింత కుదురుకోవాల్సి ఉంది. విజయ్ శంకర్‌, ఖలీల్‌ను వద్దనుకుంటే అబ్దుల్ సమద్, బాసిల్ థంపి జట్టులోకి రావచ్చు.

తుది జట్లు(అంచనా)

తుది జట్లు(అంచనా)

సన్‌రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్(కెప్టెన్), జానీ బెయిర్ స్టో, మనీష్ పాండే, విలియమ్సన్, ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మ, విజయ్ శంకర్/అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, టీ నటరాజన్, ఖలీల్ అహ్మద్/బసిల్ థంపీ

చెన్నై సూపర్ కింగ్స్: షేన్ వాట్సన్, ఫాఫ్ డూప్లెసిస్, అంబటి రాయుడు, జగదీషన్, ఎంఎస్ ధోనీ(కెప్టెన్, కీపర్), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, సామ్ కరన్, శార్దుల్ ఠాకుర్, దీపక్ చాహర్, కరన్ శర్మ

 ముఖాముఖి

ముఖాముఖి

ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 13 మ్యాచ్ లు జరగ్గా చెన్నై 9-4తో లీడ్ లో ఉంది. అయితే ఈ సీజన్‌లో జరిగిన మ్యాచ్‌లో మాత్రం హైదరాబాద్ 7 వికెట్లతో పై చేయిసాధించింది. గత సీజన్‌లో మాత్రం చెరొక విజయాన్నందుకున్నాయి.

పిచ్ రిపోర్ట్

పిచ్ రిపోర్ట్

పిచ్ బ్యాటింగ్, బౌలింగ్‌కు ఫేవర్‌గా ఉంటుంది. క్రీజులో ఓపికగా ఆడితే పరుగులు తీయవచ్చు. ఇక్కడ రెండు మ్యాచ్‌లు టై అయి సూపర్ ఓవర్‌కు కూడా దారితీసాయి. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన 12 మ్యాచ్‌ల్లో 10 సార్లు తొలుత బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. కింగ్స్ పంజాబ్‌తోనే చెన్నై, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాజస్థాన్ రాయల్స్ మాత్రం చేజింగ్ ‌లో విజయాలనందుకున్నాయి. ఇప్పటి వరకు చెన్నై ఈ మైదానంలో నాలుగు మ్యాచ్‌లు ఆడి ఒకటే గెలిచింది. హైదరాబాద్ మాత్రం మూడు గెలిచి ఒకటి మాత్రమే ఓడింది. టాస్ గెలిచే జట్టు బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఉంది. రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా.. స్టార్ స్పోర్ట్స్ చానెల్స్‌, డిస్నీ హాట్‌స్టార్‌‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

IPL 2020: కుర్రాళ్లోయ్ కుర్రాళ్లు.. గెలిపించే సత్తా ఉన్నోళ్లు!

Story first published: Tuesday, October 13, 2020, 15:08 [IST]
Other articles published on Oct 13, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+