శ్రేయస్ అయ్యర్ నొప్పితో బాధపడుతున్నాడు.. ఇప్పుడేం చెప్పలేం: శిఖర్ ధావన్

దుబాయ్: ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ ఢిల్లీ క్యాపిటల్స్ సారథి శ్రేయస్ అయ్యర్ నొప్పితో బాధపడుతున్నాడని ఆ జట్టు తాత్కలిక కెప్టెన్ శిఖర్ ధావన్ తెలిపాడు. రాజస్థాన్ రాయల్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఢిల్లీ 13 పరుగులతో అద్భుత విజయాన్నందుకుంది. ఈ గెలుపుతో పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానాన్ని అందుకుంది. ఇక రాజస్థాన్ ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో బంతిని ఆపే క్రమంలో ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు. బంతి భుజానికి ఒత్తుకుపోవడంతో నొప్పితో విలవిలలాడాడు. ఫిజియో సూచనల మేరకు మైదానం వీడాడు. దాంతో శిఖర్ ధావన్ తాత్కలిక సారథిగా జట్టును ముందుండి నడిపించాడు.

పరీక్షల తర్వాతే..
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శిఖర్ ధావన్.. అయ్యర్ గాయం తీవ్రతపై ఇప్పుడేం చెప్పలేం అన్నాడు. తదుపరి పరీక్షల తర్వాతనే అతని పరిస్థితి తెలుస్తుందని, ప్రస్తుతానికైతే అతని భుజం కదులుతుందన్నాడు. ఇక రాజస్థాన్‌పై గెలవడం చాలా సంతోషాన్నిచ్చిందని చెప్పుకొచ్చాడు.‘శ్రేయస్ అయ్యర్ నొప్పితో బాధపడుతున్నాడు. అతని గాయం తీవ్రత గురించి రేపు (గురువారం) తెలుస్తుంది. ప్రస్తుతానికి అయ్యర్ భుజం అయితే కదులుతుంది. ఇక ఈ మ్యాచ్ గెలవడం చాలా సంతోషంగా ఉంది. సమష్టి ప్రదర్శనతో సరైన సమయంలో కమ్ బ్యాక్ చేశాం. ఈ మ్యాచ్‌ను పూర్తిగా ఆస్వాదించాం.

వారి బ్యాటింగ్‌లో డెప్త్ లేదు..
మాకు గెలిచే అవకాశం ఉందనే నమ్మకంతోనే ఉన్నాం. రాజస్థాన్ బ్యాటింగ్‌లో డెప్త్ లేదని తెలుసు. వారి టాపార్డర్‌ను ఔట్ చేస్తే అవకాశాలు ఉంటాయని ముందే భావించాం. మా జట్టులో అనుభవపూర్వకమైన బౌలర్లు ఉన్నారు. దానికి తోడు ఈ రోజు అన్రిచ్ రూపంలో (అతని 156 కిలోమీటర్ల ఫాస్టెస్ట్ బాల్‌ను ప్రస్తావిస్తూ) ఓ గన్ బౌలర్ లభించాడు. తుషార్ చాలా తెలివిగా బౌలింగ్ చేశాడు. భారీ షాట్లు ఆడకుండా నెమ్మదైన బంతులు వేసాడు.'అని ధావన్ చెప్పుకొచ్చాడు.

ఢిల్లీని వీడని గాయాల బెడద..
ఓవైపు వరుస విజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్ దూసుకెళ్తున్నా మరో వైపు ఆ జట్టును గాయల బెడద వీడటం లేదు. ఇప్పటికే అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ గాయాలతోనే టోర్నీ నుంచి తప్పుకున్నారు. ప్రారంభ మ్యాచ్‌లోనే గాయపడ్డ అశ్విన్.. కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. రిషభ్ పంత్ కూడా గాయపడి బెంచ్‌కే పరిమితమయ్యాడు. మరో రెండు మ్యాచ్‌ల వరకు అతను జట్టులోకి వచ్చే అవకాశం లేదు. తాజాగా అయ్యర్ కూడా గాయపడటం ఆ జట్టును కలవరపెడుతుంది. ప్రస్తుతానికైతే ఢిల్లీకి ప్లే ఆఫ్ బెర్త్ ఖాయమైనా.. భవిష్యత్తులో ఇబ్బందులు తప్పేలా లేవు.

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అన్రిచ్ నోర్జ్..
తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 161 పరుగులు చేసింది. శిఖర్ ధావన్(33 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57), శ్రేయస్ అయ్యర్(43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీలతో రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు తీయగా.. జయదేవ్ ఉనద్కత్ రెండు వికెట్లు పడగొట్టాడు. కార్తీక్ త్యాగి, శ్రేయస్ గోపాల్ తలో వికెట్ తీశారు.
అనంతరం రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 148 పరుగులు మాత్రమే చేసింది. బెన్ స్టోక్స్(35 బంతుల్లో 6 ఫోర్లతో 41), రాబిన్ ఊతప్ప(27 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 32) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఢిల్లీ బౌలర్లలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నోర్జ్, తుషార్ రెండేసి వికెట్లు తీయగా.. రబడా, అశ్విన్, అక్సర్ పటేల్ తలో వికెట్ తీశారు.
DC vs RR: రాణించిన అయ్యర్, ధావన్... రాజస్థాన్ మందు సాధారణ లక్ష్యం!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications