IPL 2020: మ్యాచ్‌లన్నీ ఒకే మైదానంలోనా? షెడ్యూల్ ప్రకటనకు ఆలస్యం ఎందుకు?

హైదరాబాద్: కరోనాతో ఆగిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 సీజన్ దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు నిర్వహించేందుకు బీసీసీఐ సిద్దమవుతోంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ నిర్వహణకు అత్యంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోబోతోంది. ఇప్పటికే సమగ్ర విధివిధానాల(ఎస్‌ఓపీ) డ్రాఫ్ట్‌ను ఆయా ఫ్రాంచైజీలకు అందజేసింది.
దీనిలో 16 పేజీల్లో క్రికెటర్లు, సహాయక సిబ్బంది ఆరోగ్య, భద్రతకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి. కచ్చితంగా వీటన్నింటినీ అందరూ పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా స్టేడియం పరిసరాల్లో మూడు జోన్లను ఏర్పాటు చేసి నిర్బంధంగా అమలుపరచబోతున్నారు. దాదాపుగా ఈ జాబితాలో ఉన్న అంశాలే ఖరారు కానుండగా చివరి నిమిషంలో పరిస్థితులను బట్టి పలు మార్పులు జరిగే అవకాశం కూడా లేకపోలేదు.

షెడ్యూల్ ఆలస్యం అందుకే..
అయితే 53 రోజుల పాటు ఎప్పటిలానే ఐపీఎల్ నిర్వహిస్తామని ప్రకటించిన బీసీసీఐ.. షెడ్యూల్ మాత్రం ప్రకటించలేదు. ప్రభుత్వం నుంచి సూచనాప్రయంగా అనుమతులు అందినా లిఖిత పూర్వక హామీకి కొంత ఆలస్యమైంది. అది కూడా లభించిందని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ సోమవారం తెలిపారు. కేంద్ర హోమ్, విదేశాంగ శాఖల నుంచి ఇందుకు అవసరమైన డాక్యుమెంట్లు వచ్చాయని చెప్పారు.
యూఏఈ గవర్నమెంట్ నుంచి కూడా రాతపూర్వక పర్మిషన్స్ కోసం వేచి చూస్తున్నామన్నారు. ఇక దుబాయ్ ప్రభుత్వం కూడా మెగా టోర్నీ ఆతిథ్యానికి ఆసక్తికనబర్చడంతో ఒకటి రెండు రోజుల్లో గ్రీన్ సిగ్నల్ రానుంది. అవి రాగానే షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.

వేదికల విషయంలో మల్లగుల్లాలు..
అయితే కరోనా తీవ్రత కారణంగానే ఈ సీజన్‌ను దుబాయ్‌కు తరలిస్తున్న బీసీసీఐ.. మ్యాచ్‌ల నిర్వహణ విషయంలో అనేక మల్లగుల్లాలు పడుతుంది. యూఏఈలో మొత్తం 5 క్రికెట్ స్టేడియాలు అందుబాటులో ఉండగా.. బీసీసీఐ మూడు స్టేడియాలవైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఒకే మైదానంలో పూర్తి స్థాయి టోర్నీ నిర్వహిస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
అబుదాబి, దుబాయ్, షార్జాల్లో క్రికెట్ స్టేడియాలు ఉండగా.. దుబాయ్, షార్జా సమీపంగా ఉన్నాయి. అబుదాబి మాత్రం కొంచెం దూరంలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఒకే మైదానంలో నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తుంది. తద్వార బయోబబుల్ వాతావరణాన్ని మరింత కట్టుదిట్టంగా ఉంచవచ్చని భావిస్తోంది.

ఇంగ్లండ్ ఫార్మూలాతో..
ఇటీవల ఇంగ్లండ్ వెస్టిండీస్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌ను మాంచెస్టర్, సౌతాంప్టన్ వేదికలుగా నిర్వహించింది. ప్రస్తుతం పాకిస్థాన్‌తో జరుగుతున్న సిరీస్‌ను కూడా అదే రెండు వేదికల్లో నిర్వహిస్తుంది. ఇక ఐర్లాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను సౌతాంప్టన్ వేదికగా నిర్వహించింది. ఈ ఫార్మూలానే బీసీసీఐ ఐపీఎల్‌లో ఉపయోగించాలనుకుంటుంది.
వీలైతే ఒకే మైదానంలో లేకుంటే.. మూడు స్టేడియాల్లో నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అదే జరిగితే హోటళ్లు సమీపంగా ఉన్న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, షార్జా క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియాలను ఎంచుకోనుంది.

ముచ్చటైన మూడు స్టేడియాలు..
దుబాయ్ స్పోర్ట్స్ క్రికెట్ స్టేడియంగా పిలవబడే దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం మల్టీ పర్పస్‌గా వాడుకోవచ్చు. దుబాయ్‌లో 25వేల కెపాసిటీతో ఉన్న ఈ స్టేడియంలో అన్ని రకాల వసతులున్నాయి. 17 వేల కెపాసిటీతో షార్జా క్రికెట్ స్టేడియం, 20వేల కెపాసిటీతో షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియం అని వసతులతో అందుబాటులో ఉంది. ఐసీసీ అకాడమీ గ్రౌండ్, టొలెరెన్స్ ఓవల్ మైదానాలు కూడా ఉన్నప్పటికీ అక్కడ అంతర్జాతీయ మ్యాచ్‌లు అంతగా జరగలేదు.
రామ మందిర భూమి పూజపై షమీ వైఫ్ విషెస్.. రేప్ చేసి చంపేస్తామని ఆకతాయిల బెదిరింపులు!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications