న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రామ మందిర భూమి పూజపై షమీ వైఫ్ విషెస్.. రేప్ చేసి చంపేస్తామని ఆకతాయిల బెదిరింపులు!

Hasin Jahan says feeling insecure every moment after receiving threats for her post on Ram Mandir

కోల్‌కతా: టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్‌ షమీ సతీమణి, మోడల్ హసీన్ జహాన్ మరోసారి సోషల్ మీడియా వేదికగా తీవ్ర ట్రోలింగ్‌కు గురైంది. షమీపై సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన హసీన్ జహాన్.. తనదైన సోషల్ మీడియా పోస్ట్‌లతో తరుచూ అభిమానుల ఆగ్రహానికి గురవుతుంటుంది. తాజాగా అయోధ్య రామమందిర భూమి పూజపై హిందువులకు శుభాకాంక్షలు తెలిపిన ఆమెపై కొందరు బెదిరింపులకు దిగారు. అసభ్య పదజాలంతో దూషించారు. రేప్ చేసి చంపేస్తామని హెచ్చరించారు.

దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణ భూమి పూజ సందర్భంగా శుభాభినందనలు తెలిపినందుకు కొంతమంది తనను చంపేస్తామని బెదిరిస్తున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో తనకు, తన కూతురికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేసింది.

హిందూ సోదరులకు..

హిందూ సోదరులకు..

ఆగష్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామ మందిర నిర్మాణ భూమి పూజ శాస్త్రోక్తంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హసీన్‌ జహాన్‌ సంతోషం వ్యక్తం చేస్తూ.. ‘రామ మందిర పూజ సందర్భంగా హిందువులందరికీ శుభాకాంక్షలు'అంటూ ట్వీట్ చేశారు. దీంతో ముస్లిం వర్గానికి చెందిన కొంతమంది ఆమెపై విరుచుకుపడ్డారు. అత్యాచారం చేసి, చంపేస్తామంటూ అసభ్యకర రీతిలో కామెంట్లు చేస్తూ బెదిరింపులకు దిగారు. ముస్లింవై ఇలా ట్వీట్ చేయడం సమంజసం కాదన్నారు.

 కోల్‌కతా సైబర్ క్రైం పోలీసులకు..

కోల్‌కతా సైబర్ క్రైం పోలీసులకు..

ఈ ట్రోలింగ్ నేపథ్యంలో హసీన్‌ జహాన్‌ కోల్‌కతా సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించింది. అసభ్య పదజాలంతో ట్రోలింగ్ పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘అయోధ్యలో భూమి పూజ సందర్భంగా ఆగష్టు 5, 2020న హిందూ సోదర, సోదరీమణులను ఉద్దేశించి శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టు పెట్టగానే కొంతమంది నన్ను అసభ్యపదజాలంతో దూషించారు. మరికొంత మంది రేప్‌ చేసి చంపేస్తామని తరచూ బెదిరింపులకు పాల్పడుతున్నారు.

కూతురితో ఒంటరిగా ఉంటున్నా..

కూతురితో ఒంటరిగా ఉంటున్నా..

ఇది చాలా దురదృష్టకరం. ప్రస్తుత పరిస్థితుల్లో నా రక్షణ, నా కూతురి భవిష్యత్ గందరగోళంలో పడిపోయింది. నేను నిస్సహాయురాలినై పోయాను. అభద్రతాభావం వెంటాడుతోంది. ఇది ఇలాగే కొనసాగితే మానసికంగా కుంగుబాటుకు లోనయ్యే పరిస్థితులు తలెత్తుతాయి. దినదినగండంగా బతుకుతున్నాను. కూతురితో కలిసి ఒంటరిగా జీవిస్తున్నా. మానవతా దృక్పథంతో సత్వరమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నా''అని విజ్ఞప్తి చేశారు. ఇక ఈ కేసులో ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.

షమీపై సంచలన ఆరోపణలు..

షమీపై సంచలన ఆరోపణలు..

ఇక మహ్మద్ షమీ తనను హింసిస్తున్నాడని, అతనికి అనేక మంది అమ్మాయిలతో లైంగిక సంబంధాలు ఉన్నాయని, చంపేందుకు ప్రయత్నించాడని, మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు కూడా పాల్పడ్డాడంటూ హసీన్‌ గతంలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వరకట్నం వేధింపుల కేసు కూడా పెట్టారు. దీంతో ఐపీసీ 498ఏ, 354ఏ సెక్షన్ల కింద షమీపై కోల్‌కతా పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం వీరిద్దరు విడివిడిగా ఉంటున్నారు. హసీన్‌ జహాన్‌ మోడల్‌గా కెరీర్‌ కొనసాగిస్తున్నారు.

లేజీ గర్ల్స్‌నే డబ్బు ఆకట్టుకుంటుంది.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసుపై మనోజ్ తివారీ ట్వీట్

Story first published: Tuesday, August 11, 2020, 14:12 [IST]
Other articles published on Aug 11, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X