పులికాస్త పిల్లి అయింది.. బట్లర్, శాంసన్, పంత్‌పై నెట్టింట పేలుతున్న జోక్స్, మీమ్స్!

షార్జా: ఐపీఎల్ 2020 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతుంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో సమయానుకూలంగా రాణించి.. రాజస్థాన్ రాయల్స్‌కు చెక్ పెట్టింది. దీంతో హ్యాట్రిక్ విజయాన్నందుకున్న ఢిల్లీ మళ్లీ టేబుల్ టాపర్‌గా నిలిచింది. మరోవైపు మ్యాచ్‌ల సంఖ్య పెరుగుతున్నా.. రాజస్థాన్ పెర్ఫామెన్స్‌లో మాత్రం మార్పు రావడం లేదు. లీగ్ ఆరంభంలో మెరుపులు మెరిపించిన వీరులందరూ పెవిలియన్‌కు క్యూ కట్టడంతో వరుసగా నాలుగో ఓటమి తప్పలేదు. దీంతో రాజస్థాన్ ఆటగాళ్లపై నెట్టింట కళ్లు జోకులు, మీమ్స్ పేలుతున్నాయి. ముందు చెలరేగడం ఆ తర్వాత చల్లబడటం రాజస్థాన్ ఆటగాళ్లకు అలువాటేనని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
పులి కాస్త పిల్లి అయింది..
తొలి రెండు మ్యాచ్‌ల్లో బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలతో భారీ ఇన్నింగ్స్‌లు ఆడిన సంజూ శాంసన్ తర్వాతి నాలుగు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. రాజస్థాన్ కూడా ఈ నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు సంజూ శాంసన్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు. శాంసన్‌కు ఇది కొత్త కాదని, ప్రతీ సీజన్‌లో మనోడు ఇలానే చేస్తుంటాడని, అతనిపై అంచనాలు పెట్టుకోవడం దండుగా అని కామెంట్ చేస్తున్నారు. అలాగే పులి కాస్త పిల్లి అయిందని, ఆరంభంలో అదరగొట్టడం ఆ తర్వాత చల్లబడటం శాంసన్‌కు అలవాటేననే మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.
బట్లర్ vs అశ్విన్...
గత సీజన్‌లో జోస్ బట్లర్‌ను అశ్విన్ మన్కడింగ్ చేయడంతో తీవ్ర దుమారం రేగింది. క్రీడా స్పూర్తికి విరుద్దం అంటూ అశ్విన్ తీరును చాలా మంది తప్పుబట్టారు. అతను కూడా గట్టిగానే కౌంటరిచ్చాడు. నిబంధనల్లో ఉన్నదే తాను చేసానన్నాడు. ఇప్పటికీ ఆ చర్చ నడుస్తూనే ఉంది. అయితే తాజా మ్యాచ్‌లో అశ్విన్ బౌలింగ్‌లోనే బట్లర్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో నెటిజన్లు వీరి మధ్య పోరుపై జోకులు పేల్చుతున్నారు. ‘నేను క్రీజును వీడను.. నువ్వు ఔట్ చేయలేవు'అని బట్లర్ అశ్విన్‌తో అన్నాడని.. ‘నోరు మూసుకోబే 'అని అశ్విన్ బట్లర్‌ను ఔట్ చేసి చెప్పాడనే ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఈ సారి కూడా బట్లర్‌ను అశ్విన్ ఔట్ చేశాడని, కానీ ఈ సారి సరైన పద్దతిలో అని కామెంట్ చేస్తున్నారు. బట్లర్‌కు చెవులు పిండి మరీ బుద్ది చెప్పాడని ట్రోల్ చేస్తున్నారు.
పంత్ నిద్రపోతున్నావా?
ఇక ఢిల్లీ ఇన్నింగ్స్‌లో నిర్లక్ష్యంగా రనౌట్ అయిన రిషభ్ పంత్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవెనింగ్ వాక్ వెళ్లవా? లేక నిద్ర పోతున్నావా? అని మండిపడుతున్నారు. అయోమయానికి కేరాఫ్ అడ్రస్ పంత్ అని, ఓ చెత్త క్రికెటర్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక బంతిని చూసుకోకుండా పరుగుకు వెళ్లి పంత్(5) రనౌటైన విషయం తెలిసిందే. ఈ ఔట్ మరీ దారుణంగా ఉండటంతో నెటిజన్లు తమ ఆగ్రహాన్ని ఆపుకోలేకపోతున్నారు.
రాజస్థాన్ రాత మారలేదు..
మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులు చేసింది. షిమ్రాన్ హెట్‌మైర్ (24 బంతుల్లో 45; 1 ఫోర్, 5 సిక్సర్లు), స్టొయినిస్ (30 బంతుల్లో 39; 4 సిక్సర్లు) మెరిపించారు. ఆర్చర్ 3 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ 19.4 ఓవర్లలో 138 పరుగులే చేసి ఆలౌటైంది. రాహుల్ తేవటియా (29 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), యశస్వి జైస్వాల్ (36 బంతుల్లో 34; 1 ఫోర్, 2 సిక్స్‌లు) మెరుగనిపించారు. ఢిల్లీ బౌలర్ రబడ 3 వికెట్లు తీశాడు. కీలకమైన 2 వికెట్లు తీసిన అశ్విన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది.
అదే మా ఓటమికి కారణం.. తదుపరి మ్యాచ్‌కు బెన్ స్టోక్స్ డౌటే: స్మిత్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications