చెత్త కామెంటేటర్ అని పిలవండి సర్..
ఇలా బిట్స్ అండ్ పీసెస్ కామెంటేటర్ అనకంటే చెత్త వ్యాఖ్యాత అనడం ఉత్తమమని ఆ అభిమానికి సూచించాడు. ‘లేదు సార్.. బిట్స్ అండ్ పీసెస్ కామెంటేటర్ కాదు. నేను పూర్తిస్థాయి కామెంటేటర్‌ను. బిట్స్ అండ్ పీసెస్ అంటే కొంచెం కొంచెంగా ఉంటుంది. ఒకవేళ నా కామెంట్రీ నచ్చకపోతే చెత్త కామెంటేటర్ అనండి. అంతేగానీ బిట్స్ అండ్ పీసెస్ అంటే నాకు సరితూగదు'అని చిలిపిగా సమాధానమిచ్చాడు.

జడేజాను బిట్స్ అండ్ పీసెస్ ఆటగాడంటూ..
గతేడాది జరిగిన వన్డే వరల్ఢ్‌కప్‌లో రవీంద్ర జడేజాను బిట్స్ అండ్ పీసెస్ ఆటగాడని మంజ్రేకర్ తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాడు. జడేజా కూడా ‘ఇక నీ నోటీ విరేచనాలను ఆపు'అని గట్టిగానే బదులిచ్చాడు. అయితే తన వ్యాఖ్యలను అందరూ అపార్దం చేసుకున్నారని ఐపీఎల్ ప్రారంభానికి ముందు మంజ్రేకర్ వివరణ ఇచ్చుకున్నాడు. ఇంగ్లీష్ భాష సమస్య వల్లనే ఇది జరిగిందన్నాడు. జడేజాను తక్కువ చేసి మాట్లాడనని అందరూ అపార్ధం చేసుకున్నారని, కానీ తన ఉద్దేశం అదికాదన్నాడు. ఆ సందర్భంలో నాన్ స్పెషలిస్ట్ అని వ్యాఖ్యానిస్తే ఈ గొడవే ఉండేది కాదని చెప్పుకొచ్చాడు.

భోగ్లేపై కామెంట్స్ ..
ఇక సంజయ్ మంజ్రేకర్‌కు ఐపీఎల్ 2020 సీజన్ కామెంట్రీ ప్యానెల్‌లో చోటు దక్కని విషయం తెలిసిందే. రవీంద్ర జడేజా, సహచర కామెంటేటర్ హర్షా భోగ్లే పట్ల మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దీన్ని సీరియస్‌గా తీసుకున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అతనిపై వేటు వేసింది. ఈ విషయంలో క్షమాపణలు కోరుతూ మంజ్రేకర్ బీసీసీఐకి అనేక మెయిల్స్, లేఖలు రాసినా భారత క్రికెట్ బోర్డు కరుణించలేదు. బుద్దిగా బోర్డు నిబందనల మేరకు నడుచుకుంటానని విన్నవించినా పట్టించుకోలేదు. దీంతో ఈ సీజన్ కామెంట్రీ బాక్స్‌కు మంజ్రేకర్ దూరమయ్యాడు.

ధోనీ అంటే నాకు భయమా..?
ఇక ఐపీఎల్ 2020 సీజన్ సందర్భంగా కామెంటేటర్లంతా ధోనీ అంటే భయపడుతున్నారని, అతని పేరును ప్రస్తావించడానికి జంకుతున్నారని ఓ అభిమాని ట్వీట్ చేశాడు. సంజయ్ మంజ్రేకర్ కూడా ధోనీ తప్పు చేస్తే టీమ్ మీద వేసి మాట్లాడుతున్నాడని విమర్శించాడు. దీనిపై కూడా మంజ్రేకర్ స్పందించాడు. ‘ధోనీ విమర్శించడానికి తనకేం భయమని, ఒకసారి తన ట్విటర్ స్నేహితులను అడగాలన్నాడు. ‘సర్ నేను చెన్నై ఘోర తప్పిదం చేసిందన్నాను. అలా అంటే ధోనీ అన్నట్లు కాదా? ఇక అయ్యర్ గురించి చేసిన ట్వీట్‌లో నేను అతని బ్యాటింగ్ గురించి ప్రస్తావించాను. అప్పుడు డీసీ అని ఎలా అనగలను? ధోనీని విమర్శించడానికి నాకు భయమా? ఒక సారి నా ట్విటర్ దోస్తులను అడుగు వారే సమాధానం చెబుతారు'అని మంజ్రేకర్ బదులిచ్చాడు.


Click it and Unblock the Notifications

దీపక్ అన్నా.. మేం గెలిస్తే నీకుంటది: రాహుల్ చాహర్