అందుకే నా కండలు చూపించా: సంజూ శాంసన్

అబుదాబి: ఐపీఎల్ 2020 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ మరో అద్భుత విజయాన్నందుకుంది. ముంబై ఇండియన్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సూపర్ బ్యాటింగ్‌తో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. బెన్ స్టోక్స్ (107 నాటౌట్; 60 బంతుల్లో 14 ఫోర్లు, 3సిక్స్‌లు) సూపర్ సెంచరీతో ఆకట్టుకోగా.. యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్ (54 నాటౌట్; 31 బంతుల్లో 4ఫోర్లు,3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఈ సీజన్ ప్రారంభంలో రెండు హాఫ్ సెంచరీలు చేసిన సంజూ.. ఆ తర్వాత 9 మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు.

కండలు చూపిస్తూ సంబరాలు..
పదే పదే నిర్లక్ష్యపు షాట్లతో వికెట్ పారెసుకొని తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాడు. అయితే ముంబైతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం తన శైలికి భిన్నంగా కొంచెం ఓపిక కనబర్చిన సంజూ.. మంచి బంతులను బౌండరీకి తరలిస్తూ టచ్‌లోకి వచ్చాడు. హాఫ్ సెంచరీ తర్వాత తన బైసెప్స్(కండలు) చూపిస్తూ సెలెబ్రేషన్ చేసుకున్నాడు. అయితే ఎన్నడూ లేని విధంగా సంజూ ఎందుకు ఇలా చేశాడా? అని ఫ్యాన్స్ సందేహించారు. మ్యాచ్ అనంతరం ఈ విషయంపై మాట్లాడుతూ.. ఈ సెలెబ్రేషన్ వెనుకున్న కారణాన్ని ఈ కేరళ ఆటగాడు చెప్పుకొచ్చాడు.

నేను బలవంతుడిని..
రాజస్థాన్ బ్యాటింగ్ సత్తా ఇదని తెలియజేయడంతో పాటు తన బలం గురించి చెప్పానన్నాడు. వరుసగా విఫలమైనా తనపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నాడు. ‘నా పేరును గుర్తు చేయడంతో పాటు నా సత్తా ఏంటో తెలియజేయడమే ఈ బైసెప్స్ సెలెబ్రేషన్స్ ముఖ్య ఉద్దేశం. ఈ ప్రపంచంలోనే సామ్సన్ అనేవాడు బలమైన వ్యక్తని నేను అనుకుంటా. ఆ విషయాన్ని నేను ఎప్పటికీ గుర్తుచేసుకుంటా. నేను చాలా బలవంతుడిని. భారీ సిక్సర్ల కొట్టగలను. నాపై నాకు నమ్మకం ఎక్కువ. 14 మ్యాచ్‌లు ఆడుతున్నప్పుడు ఒడిదొడుకులు సహజమే.

నా గేమ్ ప్లాన్ మార్చా..
నా గేమ్ ప్రణాళికపై నేను కొంచెం శ్రద్దపెట్టాను. పెద్ద మైదానాలు, ప్రతికూల వికెట్‌లపై భారీ షాట్లు ఆడేందుకు టైమ్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. నాలోని ఆ మార్పే నేటి ఈ సూపర్ ఇన్నింగ్స్‌కు కారణం. స్టోక్స్ కలిసి బ్యాటింగ్ చేయడం అద్భుతం. గత మూడు మ్యాచ్‌లుగా మేం మిడిల్ ఓవర్లలో కొంత టైమ్ స్పెండ్ చేశాం. కానీ ఈ మ్యాచ్ మాత్రం దిబెస్ట్. పూర్తిగా ఆస్వాదించా.

స్కోర్ బోర్డు చూడలేదు..
నిజానికి ఈ మ్యాచ్‌లో నేను మా స్కోర్ బోర్డును చూడలేదు. కావాల్సిన రన్‌రేట్ గురించి పట్టించుకోలేదు. కేవలం బంతికి మాత్రమే రియాక్ట్ అయ్యా. నా గేమ్ ప్లాన్ కూడా చాలా సింపుల్. బంతి చూడటం.. అది భారీ షాట్ ఆడగలిగేది అయితే కొట్టడం. లేకుంటే క్విక్ సింగిల్, డబుల్ తీసి స్ట్రైక్ రొటేట్ చేయడం. ఇలానే ఆడుతూ నా బ్యాటింగ్‌ను ఆస్వాదించా. ఐపీఎల్‌లో నేను చాలా ఫన్నీ గేమ్స్ చూశా'అని శాంసన్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
IPL 2020: ఆ జట్టుదే టైటిల్.. జోఫ్రా ఆర్చర్ జోస్యం!