Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బౌలింగ్ వేసేది కౌల్ అనుకున్నావా? ఆర్చర్ బౌలింగ్‌లో అదేం ఎక్స్‌ప్రెషన్‌.. కృనాల్‌‌పై పేలుతున్న జోకులు

IPL 2020, RR vs MI: Krunal Pandya’s facial expression turns into a meme-fest on social media

హైదరాబాద్: ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాపై నెట్టింట కుళ్లు జోకులు పేలుతున్నాయి. అతని పేరిట ఫన్నీ మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో కృనాల్ వరుస బౌండరీలతో చివరి నాలుగు బంతుల్లో 20 పరుగులు పిండుకున్నాడు. సిద్దార్థ్ కౌల్ బౌలింగ్‌ను చీల్చిచెండాడు. అతని ధాటైన ఇన్నింగ్స్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. దాంతో మంగళవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ అందుకున్న ఈ ముంబై ఆల్‌రౌండర్.. దారుణంగా విఫలమయ్యాడు. 17 బంతుల్లో ఒక సిక్స్‌తో 12 పరుగులే చేశాడు. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ పేసర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో తెగ ఇబ్బంది పడ్డాడు. చివరకు అతని బౌలింగ్‌లోనే క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

వింతైన ఎక్స్‌ప్రెషన్..

అయితే ఆర్చర్ బౌలింగ్‌ను ఎదుర్కోలేక కృనాల్ ఓ వింతైన ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఫొటోనే పట్టుకున్న నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఓ ఆటఆడుకుంటున్నారు. ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. తమ ఎడిటింగ్ నైపుణ్యానికి పదును పెట్టి కుళ్లు జోకులు పేల్చుతున్నారు. టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి ఏడాది క్రితం మద్యం సేవించి ఇలాంటి ఎక్స్‌ప్రెషన్‌తో వార్తల్లో నిలిచాడు. దాంతో.. ఇప్పుడు కృనాల్‌‌ని అతడితో పోలుస్తూ అభిమానులు సెటైర్లు పేలుస్తున్నారు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కి చెందిన ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ కూడా గత ఏడాది ఫాస్ట్ బౌలర్లని ఎదుర్కొనే సమయంలో ఇలాంటి ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. దాన్ని కూడా గుర్తు చేస్తూ కృనాల్ ‌పై జోకులు పేల్చుతున్నారు.

కౌల్ అనుకున్నావా?

ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ సిద్దార్థ్ కౌల్ అనుకుంటున్నావా? దంచి కొట్టడానికి.. ఆర్చర్ దిమ్మతిరిగిందనుకుంటా?. అంటూ వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. అంతేకాకుండా బోరింగ్ క్లాస్‌లో స్టూడెంట్ పరిస్థితి ఇదని ఒకరంటే.. పిల్లలు కనడానికి పెళ్లి తప్పనసరని హార్దిక్ పాండ్యాతో అంటే ఇలానే ఎక్స్‌ప్రెషన్ ఇస్తాడని ఇంకొకరు కామెంట్ చేస్తున్నారు. కృనాల్ ఎక్స్‌ప్రెషన్ కూడా ఓ ఎమోజీగా పనికి వస్తుందని ఇంకొందరు ట్వీట్ చేశారు. తన నెమ్మదైన బ్యాటింగ్‌తో ధోనీ అకాడమీలో చేరాడని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి నెటిజన్లు కృనాల్ ఎక్స్‌ప్రెషన్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు.

చెలరేగిన సూరీడు..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' సూర్య కుమార్‌ యాదవ్‌ (47 బంతుల్లో 79 నాటౌట్‌; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీతో చెలరేగగా... రోహిత్‌ శర్మ (23 బంతుల్లో 35; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), హార్దిక్‌ పాండ్యా (19 బంతుల్లో 30 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. అనంతరం రాజస్తాన్‌ 18.1 ఓవర్లలో 136 పరుగులకే ఆలౌటైంది. జాస్‌ బట్లర్‌ (44 బంతుల్లో 70; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఒక్కడే మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. బుమ్రా (4/20) పదునైన బౌలింగ్‌లో దెబ్బ తీయగా... ప్యాటిన్సన్, బౌల్ట్‌లకు చెరో 2 వికెట్లు దక్కాయి.

ఆ విషయంలో ధోనీ స్మార్ట్.. కోహ్లీకి ఆ ఆలోచనే లేదు: ప్రజ్ఞాన్ ఓజా

Story first published: Wednesday, October 7, 2020, 18:44 [IST]
Other articles published on Oct 7, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+