
అయిదు మ్యాచుల్లో ఆండ్రీ రస్సెల్ స్కోరు ఎంతంటే?
అలాంటి కరేబియన్ కింగ్.. ఈ ఐపీఎల్ సీజన్‌లో పెద్దగా రాణించట్లేదు. బౌలింగ్‌లో పర్వాలేదనిపించుకుంటున్నప్పటికీ.. బ్యాటింగ్‌లో తేలిపోతున్నాడు. తన సామర్థ్యానికి తగినట్టుగా ఆడట్లేదు. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా అయిదు మ్యాచ్‌లను ఆడిన ఆండ్రీ రస్సెల్.. 50 పరుగులు మాత్రమే చేశాడు. అతని అత్యధిక స్కోరు 24. బ్యాటింగ్ సగటు 12.50 మాత్రమే. బౌలింగ్‌లో రాణిస్తున్నాడు. క్రమం తప్పకుండా వికెట్లను పడగొడుతున్నాడు. ఈ అయిదు మ్యాచుల్లో అయిదు వికెట్లను తీసుకున్నాడు. 29 పరుగులు ఇచ్చిన రెండు వికెట్లను తీసుకోవడం ఈ సీజన్‌లో ఇప్పటిదాకా అతని బెస్ట్ బౌలింగ్ ఫిగర్.

ఫామ్ కోల్పోవడం పట్ల..
బౌలింగ్ సంగతిని పక్కన పెడితే.. బ్యాటింగ్‌లో ఆండ్రీ రస్సెల్ వీర విహారం చేయడాన్ని ప్రతి అభిమానీ ప్రేమిస్తాడు. తాను అభిమానించే టీమ్ ఓడిపోతుందని తెలిసినప్పటికీ.. రస్సెల్ బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేస్తాడు. ఈ సారి రస్సెల్ బ్యాటింగ్‌లో విఫలం అవుతుండటం క్రికెట్ ప్రేమికులను ఆందోళనకు గురి చేస్తోంది. అతను బ్యాటింగ్ ఫామ్ కోల్పోవడం పట్ల కోల్‌కత నైట్ రైడర్స్ టీమ్ మేనేజ్‌మెంట్ సైతం కంగారు పడుతోంది. కోల్‌కత నైట్ రైడర్స్ విజయాలను సాధిస్తున్నప్పటికీ.. బ్యాటింగ్ విభాగంలో యువ క్రికెటర్లు తప్ప సీనియర్లు పరుగులు తీయడానికి కష్టపడుతున్నారు.

భార్యకు మెసేజ్..
కోల్‌కత నైట్ రైడర్స్ భారీ స్కోరును చేస్తోందంటే.. దానికి కారణం యువ క్రికెటర్లే. ఓపెనర్ శుభ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా వంటి యంగ్‌స్టర్స్ మెరుపులు మెరిపిస్తున్నారు. అదే సమయంలో దినేష్ కార్తీక్, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ వంటి సీనియర్లు తమ స్థాయికి తగ్గట్లుగా ఆడట్లేదు. ఇవాన్ మోర్గాన్ అడపాదడపా భారీ ఇన్నింగ్స్‌ను నమోదు చేస్తున్నప్పటికీ.. అతని బ్యాటింగ్‌లో స్థిరత్వం కొరవడింది. కుదురుగా ఆడలేకపోతున్నాడు. కోల్‌కత నైట్ రైడర్స్ అభిమానులను ఇది కలవరపాటుకు గురి చేస్తోంది. ప్రత్యేకించి ఆండ్రీ రస్సెల్.. ఇప్పటికీ తన బ్యాట్‌ను ఝుళిపించకపోవడం పట్ల అభిమానులు కంగారు పడుతున్నారు.

ఆంటీ.. ప్లీజ్ అంటూ..
అందుకే- ఓ అభిమాని ఓ అడుగు ముందుకేశాడు. ఏకంగా అతని భార్యకు ఓ మెసేజ్ పంపించాడు. `ఆంటీ.. ప్లీజ్. మీరు వెంటనే దుబాయ్ వెళ్లండి. ఆండ్రీ రస్సెల్ ఫామ్‌లో లేడు.. అంటూ అతని భార్య జస్సిమ్ లోరాకు సోషల్ మీడియా ద్వారా ఓ సందేశాన్ని ఇచ్చాడు. దీనికి ఆమె రిప్లయ్ ఇచ్చారు. తన భర్త ఫామ్‌లోకి వస్తాడనే ధీమాను ఆమె వ్యక్తం చేశారు. ఇంకా చాలా మ్యాచ్‌లను ఆడాల్సి ఉందనీ, మున్ముందు.. రస్సెల్ విజృంభణ చూస్తారని అన్నారు. ప్రస్తుతం తన భర్త ఫామ్‌ను అందిపుచ్చుకునే పనిలో ఉన్నాడని, తాను దుబాయ్ వెళ్లాల్సిన అవసరం ఉండబోదని చెప్పారు.

కుటుంబ సభ్యులు లేకపోవడం వల్లేనా?
సాధారణంగా- ఐపీఎల్ టీమ్‌ల వెంట వాళ్ల భార్య, పిల్లలు వస్తుంటారు. ఈ సారి దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బయో సెక్యూర్ బబుల్‌ను విధానంలో ఐపీఎల్ టోర్నమెంట్ కొనసాగుతోంది. ప్రేక్షకులకు కూడా అనమతి లేదంటే కరోనా వైరస్ నియంత్రణ కోసం టీమ్ మేనేజ్‌మెంట్లు, భారతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డు ఎన్ని జాగ్రత్తలను తీసుకుంటోందో అర్థం చేసుకోవచ్చు. తమ వెంట కుటుంబ సభ్యులు లేకపోవడం వల్ల సీనియర్లు ఫామ్ కోల్పోయారనే అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమౌతోంది.


Click it and Unblock the Notifications












