IPL 2020: వచ్చే సీజన్‌లో కప్ కొట్టాలనే, అత్యధికంగా 12 మంది విడుదల చేసిన ఆర్సీబీ

హైదరాబాద్: హైదరాబాద్: వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ఫ్రాంచైజీలు వ్యూహాత్మంగా అడుగులు వేస్తున్నాయి. డిసెంబర్ 19వ తేదీన కోల్‌కతాలో ఆటగాళ్ల వేలం జరగనుండటంతో ఫ్రాంచైజీలు పెద్ద సంఖ్యలో ఆటగాళ్లను వదిలేసుకున్నాయి. ఆటగాళ్ల బదిలీలు, విడుదలకు శుక్రవారంతో గడువు ముగిసింది.
దీంతో జట్టుకు భారంగా మారిన ఆటగాళ్లను ఆయా ఫ్రాంఛైజీలు వేలానికి విడుదల చేశాయి. మొత్తంగా 8 జట్లు 71 మంది ప్లేయర్లను వేలానికి విడుదల చేశాయి. ఇందులో 34 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. అన్ని ఫ్రాంఛైజీలు కలిపి మొత్తంగా 127 మంది ఆటగాళ్లను కొనసాగించాయి.
తమ ప్రధాన ప్లేయర్లను అట్టిపెట్టుకోగా.. వేలంలో సొమ్ము కోసం స్టార్లను సైతం కొన్ని జట్లు వదులుకున్నాయి. కోహ్లీ సారథ్యంలోని బెంగళూరు రాయల్ చాలెంజర్స్ (ఆర్సీబీ) అత్యధికంగా 12 మందిని విడుదల చేయగా.. అత్యల్పంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐదుగురిని విడుదల చేసింది.
ఆటగాళ్లను వేలానికి విడుదల చేసిన తర్వాత చెన్నై జట్టులో అత్యధికంగా 20 మంది ఆటగాళ్లున్నారు. మొత్తం 26 మందిలో ఆ జట్టు ఆరుగురిని విడుదల చేసింది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ లంక పేసర్ లసిత్ మలింగ సహా 18 మందిని అట్టి పెట్టుకోవడం విశేషం.

వేలానికి విడుదల చేసిన ఆటగాళ్లు
మార్కస్ స్టొయినిస్, షిమ్రన్ హెట్‌మెయిర్, అక్షదీప్ నాథ్, నేథన్ కౌల్టర్‌నైల్, కొలిన్ డి గ్రాండ్‌హోమ్, ప్రయాస్ బర్మన్, టిమ్ సౌథీ, కుల్వంత్ కేజ్రోలియా, హిమ్మత్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్, మలింగ్ కుమార్, డేల్ స్టెయిన్

విడుదల చేయడానికి కారణం
ఐపీఎల్‌లో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోతున్న టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏకంగా 12 మంది ఆటగాళ్లను వేలానికి విడుదల చేసింది. అందులో దక్షిణాఫ్రికా మాజీ పేస్ దిగ్గజం డేల్ స్టెయిన్ కూడా ఉన్నాడు. షిమ్రోమ్ హెట్ మెయిర్ చాలా హైప్‌తో ఆర్సీబీ జట్టులోకి వచ్చాడు. అయితే, ఇప్పటివరకు అతడు ఒక మ్యాచ్-విన్నింగ్ ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు. జట్టుకు సైతం ఎలాంటి న్యాయం చేయలేకపోయాడు.
IPL 2020: వ్యూహాత్మక అడుగు, 9 మందిని విడుదల చేసిన ఢిల్లీ క్యాపిటల్స్

అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు
విరాట్ కోహ్లీ, మొయిన్ అలీ, యుజువేంద్ర చాహల్, ఏబీ డివిలియర్స్, పార్థివ్ పటేల్, మహ్మద్ సిరాజ్, పవన్ నేగి, ఉమేశ్ యాదవ్, గురుకీరత్ మన్, దేవత్ పడిక్కల్, శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైని

ఆర్సీబీ వద్ద మిగిలిన నగదు
ఐపీఎల్ 2019 వేలం తర్వాత రాయల్స్ ఛాలెజర్స్ వారి పర్సులో రూ .1.8 కోట్లు మిగిలి ఉన్నాయి. 12 మంది ఆటగాళ్లను విడుదల చేయడం ద్వారా ఆర్సీబీ రూ. 23 కోట్లకు పైగా సంపాదించింది. మరోవైపు బిసిసిఐ నుండి అదనంగా 3 కోట్ల రూపాయలు రానున్నాయి. దీంతో వచ్చే సీజన్‌లో జరిగే ఐపిఎల్ 2020 వేలంలో రూ. 27.9 కోట్లు ఖర్చు చేయవచ్చు.
IPL 2020: సన్‌రైజర్స్ విడుదల చేసిన ఆటగాళ్లు వీరే!, పర్స్‌లో మిగిలిన నగదు ఇదే
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications