IPL 2020: సన్‌రైజర్స్ విడుదల చేసిన ఆటగాళ్లు వీరే!, పర్స్‌లో మిగిలిన నగదు ఇదే

హైదరాబాద్: వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ఫ్రాంచైజీలు వ్యూహాత్మంగా అడుగులు వేస్తున్నాయి. డిసెంబర్ 19వ తేదీన కోల్‌కతాలో ఆటగాళ్ల వేలం జరగనుండటంతో ఫ్రాంచైజీలు పెద్ద సంఖ్యలో ఆటగాళ్లను వదిలేసుకున్నాయి. ఆటగాళ్ల బదిలీలు, విడుదలకు శుక్రవారంతో గడువు ముగిసింది.
దీంతో జట్టుకు భారంగా మారిన ఆటగాళ్లను ఆయా ఫ్రాంఛైజీలు వేలానికి విడుదల చేశాయి. మొత్తంగా 8 జట్లు 71 మంది ప్లేయర్లను వేలానికి విడుదల చేశాయి. ఇందులో 34 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. అన్ని ఫ్రాంఛైజీలు కలిపి మొత్తంగా 127 మంది ఆటగాళ్లను కొనసాగించాయి.
తమ ప్రధాన ప్లేయర్లను అట్టిపెట్టుకోగా.. వేలంలో సొమ్ము కోసం స్టార్లను సైతం కొన్ని జట్లు వదులుకున్నాయి. కోహ్లీ సారథ్యంలోని బెంగళూరు రాయల్ చాలెంజర్స్ (ఆర్సీబీ) అత్యధికంగా 12 మందిని విడుదల చేయగా.. అత్యల్పంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐదుగురిని విడుదల చేసింది.
ఆటగాళ్లను వేలానికి విడుదల చేసిన తర్వాత చెన్నై జట్టులో అత్యధికంగా 20 మంది ఆటగాళ్లున్నారు. మొత్తం 26 మందిలో ఆ జట్టు ఆరుగురిని విడుదల చేసింది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ లంక పేసర్ లసిత్ మలింగ సహా 18 మందిని అట్టి పెట్టుకోవడం విశేషం.

వేలానికి విడుదల చేసిన ఆటగాళ్లు
మార్టిన్ గప్టిల్, దీపక్ హుడా, యూసఫ్ పఠాన్, రికీ భూయ్, షకీబ్ అల్ హసన్

విడదల చేయడానికి కారణం
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు దాదాపు ప్రధాన ప్లేయర్లందరినీ కొనసాగించింది. మార్టిన్ గప్టిల్, యూసఫ్ పఠాన్‌ను వేలానికి విడుదల చేయగా.. ఐసీసీ నిషేధం కారణంగా బంగ్లా ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌కు ఉద్వాసన పలికింది.

అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు
కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్, మనీశ్ పాండే, విజయ్ శంకర్, రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, అభిషేక్ శర్మ, జానీ బెయిర్‌స్టో, వృద్ధిమాన్ సాహా, శ్రీవత్స్ గోస్వామి, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్, షాబాజ్ నదీమ్, బిల్లీ స్టాన్‌లేక్, బాసిల్ థంపి, టీ నటరాజన్

మిగిలిన నగదు
డిసెంబర్ 19న జరిగే ఐపీఎల్ వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ పర్సులో రూ .17 కోట్లు ఉన్నాయి, ఇద్దరు విదేశీ ఆటగాళ్లతో సహా ఏడు స్లాట్లు మిగిలి ఉన్నాయి.
ఐపీఎల్ 2019 వేలానికి గాను సన్‌రైజర్స్ హైదరాబాద్ వద్ద రూ .5.30 కోట్లు మిగిలి ఉండగా, ఈ ఐదుగురు ఆటగాళ్లలో అదనంగా రూ .8.7 కోట్లు సేకరించింది. ప్లస్ ఈ ఏడాది వేలానికి అదనంగా 3 కోట్ల రూపాయలను బిసిసిఐ అనుమతించింది. కాబట్టి వారి మొత్తం పర్స్ రూ .17 కోట్లు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications