న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2020: వ్యూహాత్మక అడుగు, 9 మందిని విడుదల చేసిన ఢిల్లీ క్యాపిటల్స్

IPL 2020 Auction : Delhi Capitals Release 9 Players Ahead Of Auction ! || Oneindia Telugu
IPL 2020: Delhi Capitals release 9 players: List of released, retained players, purse for IPL auction

హైదరాబాద్: హైదరాబాద్: వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ఫ్రాంచైజీలు వ్యూహాత్మంగా అడుగులు వేస్తున్నాయి. డిసెంబర్ 19వ తేదీన కోల్‌కతాలో ఆటగాళ్ల వేలం జరగనుండటంతో ఫ్రాంచైజీలు పెద్ద సంఖ్యలో ఆటగాళ్లను వదిలేసుకున్నాయి. ఆటగాళ్ల బదిలీలు, విడుదలకు శుక్రవారంతో గడువు ముగిసింది.

దీంతో జట్టుకు భారంగా మారిన ఆటగాళ్లను ఆయా ఫ్రాంఛైజీలు వేలానికి విడుదల చేశాయి. మొత్తంగా 8 జట్లు 71 మంది ప్లేయర్లను వేలానికి విడుదల చేశాయి. ఇందులో 34 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. అన్ని ఫ్రాంఛైజీలు కలిపి మొత్తంగా 127 మంది ఆటగాళ్లను కొనసాగించాయి.

IPL 2020: సన్‌రైజర్స్ విడుదల చేసిన ఆటగాళ్లు వీరే!, పర్స్‌లో మిగిలిన నగదు ఇదేIPL 2020: సన్‌రైజర్స్ విడుదల చేసిన ఆటగాళ్లు వీరే!, పర్స్‌లో మిగిలిన నగదు ఇదే

తమ ప్రధాన ప్లేయర్లను అట్టిపెట్టుకోగా.. వేలంలో సొమ్ము కోసం స్టార్లను సైతం కొన్ని జట్లు వదులుకున్నాయి. కోహ్లీ సారథ్యంలోని బెంగళూరు రాయల్ చాలెంజర్స్ (ఆర్సీబీ) అత్యధికంగా 12 మందిని విడుదల చేయగా.. అత్యల్పంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐదుగురిని విడుదల చేసింది.

ఆటగాళ్లను వేలానికి విడుదల చేసిన తర్వాత చెన్నై జట్టులో అత్యధికంగా 20 మంది ఆటగాళ్లున్నారు. మొత్తం 26 మందిలో ఆ జట్టు ఆరుగురిని విడుదల చేసింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్ లంక పేసర్ లసిత్ మలింగ సహా 18 మందిని అట్టి పెట్టుకోవడం విశేషం.

వేలానికి విడుదల చేసిన ఆటగాళ్లు

వేలానికి విడుదల చేసిన ఆటగాళ్లు

క్రిస్‌ మోరిస్‌, కొలిన్‌ ఇంగ్రామ్‌, బి అయ్యప్ప, హనుమ విహారి, జలజ్‌ సక్సేన, మన్‌జ్యోత్‌ కల్రా, నాథుసింగ్‌, అంకుష్‌ బేయాన్స్‌, కొలిన్‌ మన్రో

విడుదల చేయడానికి కారణం

విడుదల చేయడానికి కారణం

ఐపీఎల్ 2019లో క్రిస్ మోరిస్‌ గాయాల బారిన పడ్డాడు. హనుమా విహారీ గత సీజన్లో పెద్దగా రాణించిన దాఖలా లేదు. రాజస్థాన్‌కు సారథ్యం వహించిన అజింక్య రహానె, కింగ్స్‌ ఎలెవన్‌ కెప్టెన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ సొంతం చేసుకుంది. పలు కారణాల వల్ల కోలిన్ ఇంగ్రామ్, కోలిన్ మున్రో, జలాజ్ సక్సేనా, మంజోత్ కల్రా వంటి వారందరిని విడుదల చేసింది.

అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు

అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు

శ్రేయస్‌ అయ్యర్‌, పృథ్వీషా, శిఖర్ ధావన్‌, రిషభ్‌ పంత్‌, ఇషాంత్‌ శర్మ, అమిత్‌ మిశ్రా, అవేశ్‌ ఖాన్‌, సందీప్‌ లమిచానె, రబాడ, కీమో పాల్‌, అక్షర్‌ పటేల్‌, హర్షల్‌ పటేల్‌, రవిచ్రందన్‌ అశ్విన్‌ (బదిలీ), అజింక్య రహానె (బదిలీ)

మిగిలిన నగదు

మిగిలిన నగదు

ఐపీఎల్ 2019 వేలానికి ముందు ఢిల్లీ పర్సులో మిగిలి ఉన్న నగదు రూ. 5.3 కోట్లు. తొమ్మిది మంది ఆటగాళ్లను విడుదల చేయడం ద్వారా ఢిల్లీ అత్యధికంగా రూ .19 కోట్లు మిగిలాయి. మరోవైపుబిసిసిఐ వైపు నుండి అదనంగా 3 కోట్ల రూపాయలు వచ్చాయి. దీంతో ఐపీఎల్ 2020 వేలంలో రూ. 27.85 కోట్లు ఖర్చు చేయవచ్చు.

Story first published: Saturday, November 16, 2019, 8:42 [IST]
Other articles published on Nov 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X