ఈ విజయం చాలా స్పెషల్.. టైటిల్ గెలిచే కాన్ఫిడెన్స్ వచ్చింది: రోహిత్ శర్మ

అబుదాబి: ఐపీఎల్ పదమూడో సీజన్‌లో ముంబై ఇండియన్స్ పంజా విసురుతోంది. ఆల్‌రౌండ్ షోతోఅదరగొడుతుంది. ప్రత్యర్థితో పని లేకుండా తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. శుక్రవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో 8 వికెట్లతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసింది. అయితే ఈ విజయం తమకు చాలా ప్రత్యేకమని, తమ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందని ముంబై సారథి రోహిత్ శర్మ తెలిపాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ఇది పూర్తిగా సమష్టి విజయమన్నాడు. ఫస్టాఫ్‌లో పెద్దగా చేజింగ్ చేయలేదని చెప్పుకొచ్చాడు.

ట్రెండ్ మారింది..
‘ఈ ఛేజింగ్, విజయం మాకు చాలా ప్రత్యేకం. మా ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగిపోయింది. ఎందుకంటే ఫస్టాఫ్‌లో మేం ఎక్కువగా చేజింగ్ చేయలేదు. ఇక నుంచి నా అంచనా ప్రకారం సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లే విజయాన్నందుకుంటాయి. ట్రెండ్ మారింది. అయితే ఇది నా వ్యక్తిగత అభిప్రాయమే. నాలుగు మ్యాచ్‌లకు నాలుగు గెలవడమనేది ఎప్పుడూ చాలెంజింగే. మ్యాచ్‌ల్లో పై చేయి సాధించడం నాకు చాలా ఇష్టం.

క్వింటన్ బ్యాటింగ్ ఆస్వాదించాను..
కోల్‌కతా టీమ్‌ను బాగా అర్థం చేసుకున్నాం. తొలి బంతి నుంచి వారిపై ఆధిపత్యం చెలాయించాం. పిచ్ పరిస్థితులకు తగ్గట్లు బౌలర్లను ఉపయోగించాం. పిచ్ కొంచెం నెమ్మదిగా ఉండటంతో రస్సెల్‌కు కృనాల్, రాహుల్‌తో బౌలింగ్ చేయించాను. ఆ తరువాత బుమ్రాను తీసుకొచ్చి ఫలితం రాబట్టాను. క్వింటన్‌తో బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదించాను. అతను చాలా ముక్కుసూటి. ఎక్కువ సార్లు నేనే వెనుకడుగు వేస్తుంటా. క్వింటన్‌కు స్వేచ్చగా ఆడమని చెబుతుంటా. జట్టు గురించి ఆలోచిస్తూ చింతించవద్దని సూచిస్తుంటా.'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

డించక్ డికాక్..
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 148 పరుగులు చేసింది. ప్యాట్ కమిన్స్(36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 నాటౌట్), ఇయాన్ మోర్గాన్(29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39 నాటౌట్) రాణించారు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, నాథన్ కౌల్టర్ నీల్, బుమ్రా తలో వికెట్ తీయగా.. రాహుల్ చాహర్ రెండు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం క్వింటన్ డికాక్(44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 78 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలగడంతో ముంబై ఇండియన్స్ 16.5 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 149 పరుగులు చేసి ఘన విజయాన్నందుకుంది. డికాక్‌కు తోడుగా రోహిత్ శర్మ(36 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 35), హార్దిక్ పాండ్యా(11 బంతుల్లో 21 నాటౌట్) రాణించారు. ఈ విజయంతో ముంబై పాయింట్ల పట్టికలో టాప్‌లోకి దూసుకెళ్లగా కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగిన కోల్‌కతా మాత్రం తమ ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
నాశనం చేయడానికి ఒక్క నిమిషాం చాలు.. కేకేఆర్ కెప్టెన్సీ మార్పుపై గంభీర్ అసహనం!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications