నాశనం చేయడానికి ఒక్క నిమిషాం చాలు.. కేకేఆర్ కెప్టెన్సీ మార్పుపై గంభీర్ అసహనం!

న్యూఢిల్లీ: కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి దినేశ్ కార్తీక్ తప్పుకున్న విషయం తెలిసిందే. జట్టు క్షేమం కోరి, బ్యాటింగ్‌పై మరింత ఫోకస్ పెట్టేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నాడని కేకేఆర్ మేనేజ్‌మెంట్ శుక్రవారం ప్రకటించింది. తన నిస్వార్థ వ్యక్తిత్వాన్ని ప్రశంసించింది. ఇక తమ నూతన సారథిగా ఇంగ్లండ్ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ నియమించింది. అయితే కార్తీకే స్వయంగా తప్పుకున్నాడని చెబుతున్నా.. తప్పుకునేలా చేశారని అతని అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. అయితే మిడ్ సీజన్‌లో కెప్టెన్సీ మార్చడం సరైంది కాదని భారత మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
ఒక్క నిమిషం చాలు..
కేకేఆర్ మాజీ కెప్టెన్, రెండు సార్లు టైటిల్ అందించిన గౌతమ్ గంభీర్ అయితే ఈ నిర్ణయంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. పరోక్ష వ్యాఖ్యలతో టీమ్‌మేనేజ్‌మెంట్ నిర్ణయంపై మండిపడ్డాడు. నేరుగా ప్రస్తావించుకుండా క్రిప్టిక్ ట్వీట్‌తో తన అసహనాన్ని వెల్లడించాడు. ‘వారసత్వాన్ని నిర్మించడానికి కొన్నేళ్లు పడుతుంది. కానీ నాశనం చేయడానికి ఒక నిమిషం చాలు'అని ట్వీట్ చేశాడు.
ఈ నిర్ణయం జట్టుకే నష్టం..
ఇక భారత మాజీ ఓపెనర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సైతం కేకేఆర్ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. ఇది జట్టుకు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్నాడు. ఇప్పటికే నిలకడలేమితో మోర్గాన్ తడబడుతున్నాడని,కెప్టెన్సీతో అతనిపై మరింత ఒత్తిడి నెలకొంటుందని తెలిపాడు. ‘ఈ రాత్రే వరకు ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ ఉంది. కెప్టెన్సీ మార్పే వారి నిర్ణయం అయితే ఆ జట్టుకు కష్టాలు తప్పవు. ఐపీఎల్ 2020లో మోర్గాన్ బ్యాటింగ్ ఫామ్ అంత గొప్పగా ఏం లేదు. సతమతమవుతున్న మరో ఓవర్‌సీస్ కెప్టెన్‌తో పోరాడినట్లు ఉంటుంది'అని ఆకాష్ చోప్రా ట్వీట్ చేశాడు.
సీజన్ మధ్యలో మంచిది కాదు..
ఏ జట్టు అయినా మిడ్ సీజన్‌లో కెప్టెన్సీన మారిస్తే జట్టులో ఆటగాళ్లందరిపై ప్రభావం పడుతుందని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. కోల్‌కతా ఆ తప్పు దారి పట్టదనుకుంటున్నా'అని తెలిపాడు. ‘మిడ్ సీజన్ కెప్టెన్సీ మార్పు మంచిది కాదు. జట్టులోని ఆటగాళ్లకు అసౌకర్యంగా ఉంటుంది. కేకేఆర్ తప్పుదారి పట్టదని ఆశిస్తున్నా. ప్లే ఆఫ్స్‌కు చేరువలో ఉన్నారు. #DineshKarthik #Eoinmorgan'అని పఠాన్ ట్వీట్ చేశాడు.

కొనియాడుతున్న అభిమానులు..
ఇక దినేశ్ కార్తీక్ స్వయంగా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడంపై అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. నిస్వార్థంగా జట్టు మేలు కోసం ఇలాంటి నిర్ణయం తీసుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలని కొనియాడుతున్నారు. అయితే దినేశ్ కార్తీక్‌కే ఈ సీజన్ మొత్తం కెప్టెన్‌గా ఉంచాల్సిందని మరికొందరూ అభిప్రాయపడుతున్నారు. ఇయాన్ మోర్గాన్ విఫలమైతే మరెవరిని కెప్టెన్‌గా చేస్తారని నిలదీస్తున్నారు. ఏది ఏమైనా దినేశ్ కార్తీక్ సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
రైట్-లెఫ్ట్ కాంబినేషనా? మరీ నువ్వెందుకు ఫస్ట్ డౌన్‌లో వచ్చావ్? కోహ్లీపై సెహ్వాగ్ ఫైర్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications