MI vs KXIP: రోహిత్ శర్మ అసభ్య పదజాలం.. మ్యానెర్స్ లేదంటు మండిపడుతున్న ఫ్యాన్స్ (వీడియో)

హైదరాబాద్: టోర్నీ ఆద్యంతం దక్కాల్సిన వినోదం ఒక్క మ్యాచ్‌లోనే అందింది. ఉత్కంఠకే ఊపిరాడని మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అద్భుతం చేసింది. సూపర్ ఓవర్‌కే సూపర్ నిర్వహించిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై పంజాబ్ పంజా విసిరింది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో 6వ స్థానానికి చేరుకున్న పంజాబ్.. ప్లే ఆఫ్ రేసులో ఉన్నామని ప్రత్యర్థులకు చెప్పకనే చెప్పింది. క్రికెట్ చరిత్రలోనే కని విని ఎరుగని రీతిలో సాగిన ఈ మ్యాచ్ అభిమానులకు కావాల్సిన మజానిచ్చింది. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ నోట అసభ్య పదజాలం రావడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
సారథిగా మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న రోహిత్ శర్మ.. మైదానంలో అసభ్య పదజాలాన్ని ఉపయోగించడం అతని అభిమానులకే మింగుడపడం లేదు. దాంతో రోహిత్ తీరును నెటిజన్లు తప్పుబడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
విషయం ఏంటంటే..?
177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కింగ్స్ పంజాబ్ ఇన్నింగ్స్‌ను కెప్టెన్ కేఎల్ రాహుల్ (51 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 77) అద్భుత హాఫ్ సెంచరీతో ముందుకు నడిపించాడు. ఓవైపు వికెట్లు పోతున్నా మరోవైపు ధాటిగా ఆడుతూ జట్టు విజయం దిశగా తీసుకెళ్లాడు. ఓపెనర్‌గా వచ్చిన ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్ ముంబై బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచాడు. దాంతో అతని వికెట్ కోసం శతవిధాల ప్రయత్నించిన రోహిత్.. ఆఖరికి బుమ్రాను రంగంలోకి దింపి వికెట్ సాధించాడు. 18వ ఓవర్‌లో బుమ్రా వేసిన సూపర్ యార్కర్‌కు రాహుల్ క్లీన్ బౌల్ట్ అయ్యాడు. దాంతో ఓవర్‌గా రియాక్ట్ అయిన రోహిత్ రాయలేని అసభ్యపదజాలాన్ని వాడాడు. అతని లిప్ రీడింగ్‌ను చూస్తేనే ఆ పదం ఏంటో అర్థమవుతుంది.
బెన్ స్టోక్స్ అన్నాడబ్బా..
ఈ వీడియోను ఓ అభిమాని.. రోహిత్ శర్మను విరాట్ కోహ్లీ ఎలా పాడు చేసాడో చూడండనే క్యాప్షన్‌తో పంచుకున్నాడు. దాంతో నెటిజన్లు తమకు తోచిన కామెంట్లు చేస్తున్నారు. రోహిత్‌కు కనీసం మ్యానర్స్ లేదని, అసలు ఈ తరం క్రికెటర్లే అలా తయారయ్యాని ఒకరంటే.. ఏది ఏమైనా సచిన్,ద్రవిడ్, లక్ష్మన్ లెజెండ్స్ అని ఇంకొకరు కామెంట్ చేస్తున్నారు. మరికొందరేమో రోహిత్.. బెన్ స్టోక్స్ అన్నాడని, దానికే ఇంత చేస్తే ఎలా అని వాదిస్తున్నారు. ఇంకొందరేమో క్రికెట్‌లో ఇది సహజమేనని, అదరి వారి ఫ్రస్టేషన్‌కు నిదర్శనమని కామెంట్ చేస్తున్నారు.
5 పరుగులు చేయలేకపోయిన రోహిత్..
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్(43 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53)హాఫ్ సెంచరీకి తోడు చివర్లో కీరన్ పొలార్డ్(12 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లతో 34 నాటౌట్), కౌల్టర్ నీల్ (12 బంతుల్లో 4 ఫోర్లతో 24 నాటౌట్) మెరుపులు మెరిపించారు. అనంతరం కింగ్స్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులే చేసింది. దాంతో మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్‌కు దారి తీసింది. అనంతరం అది కూడా టై కావడంతో మ్యాచ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించింది.
తొలి సూపర్ ఓవర్‌లో పంజాబ్ 5 పరుగులు చేయగా.. ముంబై ఇండియన్స్ కూడా 5 పరుగులే చేసింది. సెకండ్ సూపర్ ఓవర్‌లో ముంబై 11 రన్స్ చేయగా.. గేల్,మయాంక్ సూపర్ బ్యాటింగ్‌తో 4 బంతుల్లోనే పంజాబ్ విజయాన్నందుకుంది. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో 3 డబుల్ సెంచరీలు చేసిన హిట్ మ్యాన్ ఈ మ్యాచ్ సూపర్ ఓవర్‌లో 5 పరుగులు చేయకపోవడం పలు విమర్శలకు తావిస్తుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
MI vs KXIP: థ్రిల్లింగ్ మ్యాచ్‌లో మెరిసిన ఈ బ్యూటీ ఎవరు?