Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సౌరవ్ గంగూలీ సలహాను లెక్కచేయని రోహిత్‌ శర్మ.. మొండితనంతో బీసీసీఐకి సవాల్!

IPL 2020: Rohit Sharma ignores Sourav Gangulys advice againstrushing back

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ సూచనలను బేఖాతరు చేశాడు. ఫిట్‌నెస్‌ లేదంటారా... అయితే మ్యాచ్ ఆడి చూపిస్తా అనే మొండితనాన్ని హిట్ మ్యాన్ చూపిస్తున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయరా? అని తన అభిమానులు బీసీసీఐని నిలదిసేలా వ్యవహరిస్తున్నాడు. ఆ క్రమంలోనే అతను సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మంగళవారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు.

అయితే ఈ మ్యాచ్‌కు ముందే గంగూలీ.. ఈ ఒక్క లీగ్‌ కోసం భవిష్యత్తును పాడుచేసుకోవద్దని రోహిత్‌కు సూచించాడు. రోహిత్‌లాంటి పరిణతి చెందిన ఆటగాడికి ఇవన్నీ ఒకరు చెప్పాల్సిన అవసరం కూడా లేదన్నాడు. కానీ హిట్‌మ్యాన్ ఏకంగా మ్యాచే ఆడి అందర్ని ఆశ్చర్యపరిచాడు.

నాకు ఫిట్‌నెస్‌ లేదంటారా...

నాకు ఫిట్‌నెస్‌ లేదంటారా...

నాకు ఫిట్‌నెస్‌ లేదంటారా.. రోహిత్‌ శర్మ వ్యవహార శైలి ఇలానే ఉంది. ఐపీఎల్‌ ఆడేందుకు తొందరపడవద్దని, సుదీర్ఘ భవిష్యత్తు ఉందంటూ స్వయంగా దాదా సలహా ఇచ్చిన రోజే రోహిత్‌ మైదానంలోకి దిగి ఒక రకంగా బోర్డును అపహాస్యం చేశాడు. గాయంతో ముంబై ఇండియన్స్‌ ఆడిన గత నాలుగు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న రోహిత్‌ మంగళవారం ఏమాత్రం ప్రాధాన్యత లేని మ్యాచ్‌లో ఆడి అందర్నీ షాక్ గురి చేశాడు.

మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ...తాను పూర్తి ఫిట్‌గా ఉన్నానని వెల్లడించాడు. ఆస్ట్రేలియా పర్యటనకు జట్టును ప్రకటించిన అక్టోబర్‌ 26 నుంచి రోహిత్‌ గాయంపై దుమారం రేగుతూనే ఉంది. ఇప్పటి వరకు కూడా రోహిత్‌ గాయం విషయంపై బోర్డు ఒక స్పష్టమైన వివరణ ఇవ్వకపోవడం మరింత గందరగోళానికి గురి చేస్తోంది.

బీసీసీఐ vs ముంబై ఇండియన్స్..

బీసీసీఐ vs ముంబై ఇండియన్స్..

రోహిత్‌ను ఎంపిక చేయని రోజు నుంచి ముంబై ఇండియన్స్, రోహిత్‌ శర్మ ఏదో రూపంలో బోర్డుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. టీమ్‌ సెలక్షన్‌ ముగిసిన తర్వాత నెట్స్‌లో బ్యాటింగ్‌ చేస్తున్న వీడియో, కోచ్‌ రవిశాస్త్రి...రోహిత్‌ ఫిట్‌గా లేడని చెప్పిన రోజున మరో వీడియో, ఇప్పుడు గంగూలీ వ్యాఖ్య తర్వాత నేరుగా మ్యాచ్‌ బరిలోకి దిగి బోర్డుకు సవాల్ విసురుతున్నారు.

ఇప్పటికే లీగ్‌లో అగ్రస్థానం ఖరారైన తర్వాత... బౌల్ట్, బుమ్రాలకు విశ్రాంతినిచ్చిన మ్యాచ్‌లో రోహిత్‌ అవసరం ఏముంది? ప్లే ఆఫ్స్‌కు ముందు మ్యాచ్‌ ప్రాక్టీస్‌ అనే వాదన అర్థం లేనిది. రోహిత్‌ స్థాయి ఆటగాడు కొంత విరామం వచ్చినా, నేరుగా మ్యాచ్‌లో సత్తా చాటగలడు. మొత్తంగా తనను ఎంపిక చేయని బీసీసీఐకి తనవైపు నుంచి సందేశం వినిపించేందుకే రోహిత్‌ ఆడాడా అనే సందేహం కలుగుతోంది.

ఫిట్ అయితే ఆ ఊత్సాం ఏది..

ఫిట్ అయితే ఆ ఊత్సాం ఏది..

హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ ( 7 బంతుల్లో 4)దారుణంగా విఫలమయ్యాడు. మూడో ఓవర్‌లోనే పేలవ షాట్‌తో వికెట్ చేజార్చుకున్నాడు. వికెట్ల మధ్య పరుగెత్తడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. వాస్తవానికి అతను డబుల్ వచ్చే దగ్గర సింగిల్ తీసి.. అనవసర షాట్‌కు ప్రయత్నించి వికెట్ ఇచ్చుకున్నాడు. అతను ఔటైనప్పుడు కూడా కామెంటేటర్ల నోట కూడా ఇదే మాట వచ్చింది. ఇక ఫీల్డింగ్‌లోనూ అతను ఏమంత ఉత్సాహంగా కనిపించలేదు. మరీ ముఖ్యంగా.. తన పక్క నుంచి వెళ్తున్న బంతి కోసం డైవ్ చేసే సాహసం చేయలేదు. దాంతో.. అతను గాయం నుంచి ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదని స్పష్టంగా అనిపించింది. కొంత మంది అభిమానులు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.

పాపం సందీప్ శర్మ.. బుమ్రా కన్నా ఎక్కువ వికెట్లు.. కానీ గుర్తింపు దక్కలేదు!

Story first published: Wednesday, November 4, 2020, 14:32 [IST]
Other articles published on Nov 4, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+