Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాపం సందీప్ శర్మ.. బుమ్రా కన్నా ఎక్కువ వికెట్లు.. కానీ గుర్తింపు దక్కలేదు!

 Bumrah VS Sandeep sharma records: Is Sandeep the most underrated bowler in IPL?

హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ సందీప్ శర్మ‌కు రావాల్సిన పేరు రాలేదా? భారత క్రికెట్‌లో ఈ పేసర్ తక్కువ అంచనా వేయబడ్డడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఆరెంజ్ ఆర్మీ ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్ గాయంతో దూరమవడంతో అవకాశం అదుకున్న సందీప్.. తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు.

పవర్‌ప్లేలోనే వికెట్లు తీస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మంగళవారం పటిష్ట ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా సందీప్ చెలరేగాడు. రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్, ఇషాన్ కిషాన్‌లను ఔట్ చేసి ముంబై పతనాన్ని శాసించాడు. ఇందులో వరుస సిక్సర్లతో దూకుడు కనబర్చిన డికాక్‌ను క్లీన్ బౌల్డ్ చేయడం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.

ఇద్దరి ప్రయాణం ఒకేసారి..

ఇద్దరి ప్రయాణం ఒకేసారి..

ఈ సూపర్ పెర్ఫామెన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన సందీప్ శర్మ.. టీమిండియా యార్కర్ల స్పెషలిస్ట్ జస్‌ప్రీత్ బుమ్రా కంటే ఎక్కువ వికెట్లు తీయడం, ఐపీఎల్ కెరీర్ గణంకాలు కూడా ఇద్దరివి దగ్గరిగా ఉండటం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. అసలు ఇన్నాళ్లు సందీప్‌ను ఎందుకు గుర్తించలేదా? అనే సందేహం కలుగుతుంది. ఇక బుమ్రా, సందీప్ ఒకే ఏడాది 2013లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేయగా.. ఇప్పటి వరకు ఇద్దరూ 90 మ్యాచ్‌లు ఆడారు. సందీప్ 24.02 సగటు, 7.75 ఎకానమీతో 108 వికెట్లు తీయగా.. బుమ్రా కూడా 24.22 సగటు 7.46 ఎకానమీతో 105 వికెట్లు మాత్రం తీసాడు. ఇక సందీప్ స్ట్రైక్ రేట్ 18.6 ఉండగా.. బుమ్రాది 19.4 ఉంది.

గుర్తింపు మాత్రం రాలేదు..

గుర్తింపు మాత్రం రాలేదు..

గణంకాల ప్రకారం సమంగా ఉన్నా.. బుమ్రాకు వచ్చిన పేరులో సగం కూడా సందీప్‌కు రాలేదు. పైగా బుమ్రా అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదిగితే సందీప్ మాత్రం ఐపీఎల్‌కే పరిమితమయ్యాడు. అయితే సందీప్‌కు పేరు రాకపోవడానికి ముఖ్య కారణం అతని బౌలింగ్‌లో పేస్ లేకపోవడమేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్లో బౌలింగ్‌తో నెట్టుకొచ్చే సందీప్.. అందరి దృష్టిని ఆకర్షించలేకపోయాడని చెబుతున్నారు.

పవర్‌ప్లే vs డెత్ ఓవర్స్..

పవర్‌ప్లే vs డెత్ ఓవర్స్..

ఇక సందీప్ పవర్ ప్లేలో వికెట్లు తీస్తే జస్‌ప్రీత్ బుమ్రా డెత్ ఓవర్లలో వికెట్లు తీసాడని అదే అతనికి వరల్డ్ క్లాస్ బౌలర్‌గా గుర్తింపు తెచ్చిపెట్టిందంటున్నారు. ఇక ఈ సీజన్‌లో బుమ్రా 13 మ్యాచ్‌ల్లో 23 వికెట్లు తీస్తే.. 11 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన సందీప్ 13 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ ఇద్దరికి.. విరాట్ కోహ్లీపై మంచి రికార్డు ఉండటం విశేషం. బుమ్రా తన తొలి.. 100వ వికెట్‌గా విరాట్‌ను ఔట్ చేస్తే.. సందీప్ 7 సార్లు పెవిలియన్ చేర్చాడు.

IPL 2020: సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయ రహస్యం ఇదే.. కేన్ మామ కీలక పాత్ర!

Story first published: Wednesday, November 4, 2020, 19:11 [IST]
Other articles published on Nov 4, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+