For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2020: ప్రారంభ మ్యాచ్ ముంబై ఇండియన్స్ vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు!

IPL 2020: Reports says RCB likely to face MI in the opening game

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(2020) సీజన్ తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ ఆనవాయితీ ప్రకారమైతే డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్.. రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఫస్ట్ మ్యాచ్ నిర్వహించాల్సింది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కరోనా బారిన పడటంతో ఆ జట్టు లీగ్ ప్రారంభమయ్యే సెప్టెంబర్ 19 వరకు సంసిద్దమయ్యే అవకాశాలు లేవు.

అందరి కంటే ముందే ఆగస్టు 21న చెన్నై సూపర్‌ కింగ్స్‌ దుబాయ్‌కు వెళ్లింది. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఆరు రోజుల క్వారెంటైన్‌‌ను పూర్తి చేసుకుంది. కానీ ఆ జట్టులో 11 మంది సహాయక సిబ్బంది, ఇద్దరు ఆటగాళ్లకు కరోనా సోకడంతో యావత్ క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ దెబ్బ ఆ జట్టు తొలి మ్యాచ్‌పై పడింది.

చెన్నై ఉక్కిరిబిక్కిరి..

చెన్నై ఉక్కిరిబిక్కిరి..

వైరస్ సోకని ఆటగాళ్లు 6 రోజులు క్వారంటైన్‌ పాటిస్తే.. కరోనా బాధిత ఆటగాళ్లు రెండు వారాల పాటు స్వీయ నిర్భంధంలో ఉండాలి. దీంతో ఆ జట్టుకు ప్రాక్టీస్ చేసే అవకాశం లేదు. దీనికితోడు సీపీఎల్ ఆడుతున్న ఆటగాళ్లు 17-18 తేదీలలో దుబాయ్‌ వచ్చి.. 6 రోజుల క్వారంటైన్‌ పూర్తి చేయాలి. దీంతో వారు లీగ్ మొదటివారం మ్యాచులకు దూరంకానున్నారు. మరోవైపు చెన్నై స్టార్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా ఐపీఎల్‌ 2020 నుంచి తప్పుకున్నాడు. రైనా నిష్క్రమణ, ఆటగాళ్లకు కరోనా సోకడం, విదేశీ ఆటగాళ్ల క్వారంటైన్‌ సమయంతో చెన్నై ప్రాంచైజీ ఉక్కిరిబిక్కిరి అవుతుంది.

కోహ్లీ VS రోహిత్..

కోహ్లీ VS రోహిత్..

ఈ నేపథ్యంలోనే తొలి మ్యాచ్ విరాట్ కోహ్లీ నేతృత్వంలోని ఆర్సీబీ, లీగ్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వంలోనే ముంబై ఇండియన్స్ మధ్య ఫస్ట్ మ్యాచ్ ఆడించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. ‘చెన్నై స్థానంలో తొలి మ్యాచ్ ఆడే అవకాశం ఆర్సీబీకే ఉంది. ఎందుకంటే స్టార్ ఆటగాళ్లతో లీగ్ ప్రారంభించడం అవసరం. ధోనీ మిస్ అయితే.. కోహ్లీ ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ ఫస్ట్ మ్యాచ్ ఆడినా.. ఆడకపోయినా.. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఓ ప్రత్యామ్నాయంతో సిద్దంగా ఉండాలి'అని ఓ అధికారి టైమ్స్ ఇండియాకు తెలిపారు.

బీసీసీఐపై ప్రాంచైజీల గుర్రు..

బీసీసీఐపై ప్రాంచైజీల గుర్రు..

ఇక బీసీసీఐ వ్యవహరిస్తున్న తీరు పట్ల ఫ్రాంచైజీలు ఆగ్రహంగా ఉన్నాయి. ముఖ్యంగా బోర్డుతో ఉన్న కమ్యూనికేషన్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. తమకు కల్పించాల్సిన సౌకర్యాల విషయంలో ఇబ్బందులున్నాయి, ట్రాకింగ్ పరికరాలు ఇంకా ఇవ్వలేదని ఓ ఫ్రాంచైజీ అధికారితో మీడియాతో అన్నారు. ‘దుబాయ్‌కు వచ్చినప్పటి నుంచి ఐపీఎల్‌కు సంబంధించిన ఒక్క విషయాన్ని కూడా బీసీసీఐ నుంచి వినలేదు. ట్రైనింగ్ సెషన్ ఏర్పాట్లలో సమస్యలున్నాయి. జట్టు సభ్యులు, ఆటగాళ్లకు బ్లూటూత్ ట్రాకింగ్ పరికరాలు ఇవ్వలేదు. బీసీసీఐతో సరైన కమ్యూనికేషన్ లేదు'అని సదరు ఫ్రాంచైజీ అధికారి ఆవేదన వ్యక్తం చేశాడు.

వీరి వ్యాఖ్యలు చూస్తే బీసీసీఐ, ఫ్రాంచైజీల మధ్య సరైన సమన్వయం లేదనిపిస్తోంది. ఇక బీసీసీఐ షెడ్యూల్ ప్రకటిస్తే ఫ్రాంచైజీలకు ఓ క్లారిటీ రానుంది. ఇక సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు ఐపీఎల్ 2020 సీజన్ నిర్వహిస్తామన్న బీసీసీఐ... ఇంతవరకు షెడ్యూల్ ప్రకటించలేదు.

రైనాకు విజయ గర్వం తలకెక్కింది.. అతని నిష్క్రమణతో మాకు వచ్చే నష్టమేం లేదు: శ్రీనివాసన్

Story first published: Monday, August 31, 2020, 16:17 [IST]
Other articles published on Aug 31, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+