
ఆర్‌సీబీపై సెంచరీ తర్వాత..
రెండు చేతులతో చెవులను మూసుకొని, ఆ తర్వాత కళ్లను కూడా మూసుకొని సెలెబ్రేట్ చేసుకుంటాడు. ఈ ట్రేడ్ మార్క్ సెలెబ్రేషన్స్ ఎక్కువగా ఫుట్‌బాల్ ప్లేయర్లు అనుసరిస్తుంటారు. అయితే కేఎల్ రాహుల్ కూడా ఫ్రారంభం నుంచి కాకుండా గత ఏడాదిన్నరగా ఈ స్టైల్‌ను ఫాలో అవుతున్నాడు. ఐపీఎల్ 2020 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రాహుల్(132 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగాడు. శతకం పూర్తయిన తర్వాత కూడా తన ట్రేడ్ మార్క్ సెలెబ్రేషన్ చేసుకున్నాడు. దీంతో అభిమానులు, కామెంటేటర్లు ఈ సెలెబ్రేషన్‌కు అర్థం ఏంటనీ తెలుసుకోవడానికి ప్రయత్నించారు. భారత్ తరఫున సెంచరీ చేసినప్పుడు కూడా ఈ సెలెబ్రేషన్స్ చర్చనీయాంశమయ్యాయి. మీడియా కూడా ఈ విషయాన్ని రాహుల్ ముందు ప్రస్తావించింది. కానీ అతను మాత్రం కారణం వెల్లడించలేదు.

నేను ఎవ్వరి మాట వినను..
భారత మాజీ క్రికెటర్, తెలుగు కామెంటేర్ వేణుగోపాల్ రావు కూడా దీన్ని అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. సోషల్ మీడియా వేదికగా అభిమానులను ప్రశ్నించాడు. కానీ ఫలితం రాలేదు. అయితే తన సహచర కామెంటేటర్, మాజీ ఐపీఎల్ ప్లేయర్ కల్యాణ్ కృష్ణ ఈ ట్రేడ్ మార్క్ స్టైల్ వేనుకున్న కారణం తెలుసుకున్నాడు. కర్ణాటక కామెంటేటర్ విజయ్ భరద్వాజ్ ద్వారా ఈ విషయం తెలుసుకున్నానని కల్యాణ్ తెలిపాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్ సందర్భంగా కల్యాణ్ ఈ విషయాన్ని తెలియజేశాడు. ‘నేను ఎవరి మాట వినను.. ఏం చేయాలనుకుంటానో అది చేసి చూపిస్తాను'అనేదే కేఎల్ రాహుల్ ట్రేడ్ మార్క్ స్టైల్ అర్ధమని చెప్పుకొచ్చాడు.

కాఫీ విత్ కరణ్ షో ఎఫెక్ట్..
భరద్వాజ్.. రాహుల్ కు చాలా క్లోజ్ అని, అండర్19 క్రికెట్ ఆడుతున్నప్పటి నుంచి వారిద్దరికి పరిచయం ఉందని కల్యాణ్ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా కాఫీ విత్ కరణ్ షో తర్వాతి నుంచే ఈ సెలెబ్రేషన్ మొదలు పెట్టాడని, దాని ఎఫెక్టే ఈ సెలెబ్రేషన్ కు కారణమన్నాడు. అప్పట్లో జరిగిన ట్రోలింగ్, వచ్చిన విమర్శలకు సమాధానంగానే ఇలా చేస్తున్నాడని భరద్వాజ్ తనతో చెప్పాడని కల్యాణ్ చెప్పుకొచ్చాడు.
మహిళలను కించపరిచే వ్యాఖ్యలు..
ఇక ‘కాఫీ విత్ కరణ్' షోలో హార్ధిక్ పాండ్యా లవ్‌స్టోరీ గురించి కరణ్ జోహార్ అడగ్గా.. తాను ఎంత మందితో శృంగారంలో పాల్గొన్నది, పార్టీల్లో అమ్మాయిల్ని తాను చూసే విధానంపై అభ్యంతరకరంగా మాట్లాడాడు. రాహుల్ కూడా తన జేబులో కండోమ్ ప్యాకెట్ గురించి వివరిస్తూ తన తండ్రి ‘ఫర్వాలేదు రక్షణ కవచం వాడుతున్నావు' అంటూ ప్రశంసించాడని వివాదాస్పదరీతిలో చెప్పుకొచ్చాడు. మహిళలను కించపరిచే విధంగా ఉన్న ఈ వ్యాఖ్యల పట్ల అప్పట్లో తీవ్ర దూమారం రేగింది. కుర్రాళ్లకు ఆదర్శంగా ఉండాల్సిన క్రికెటర్లు ఇలా వ్యవహరించడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి.
నిన్నటి మ్యాచ్‌లో ఇది గమనించారా? అతను కొట్టిన సిక్స్‌కు చాహల్ భయంతో పరుగెత్తాడు(వీడియో)


Click it and Unblock the Notifications
