RCB vs DC: కోహ్లీ vs అయ్యర్.. సమ ఉజ్జీల పోరు గెలిచేదెవరు?

దుబాయ్: ఐపీఎల్ 2020 సీజన్‌లో రెండు బలమైన జట్లు అమీతుమీకి సిద్దమయ్యాయి. దుబాయ్ వేదికగా సోమవారం జరిగే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. సీజన్‌లో ఇప్పటిదాకా నాలుగు మ్యాచ్‌లాడిన ఇరు జట్ల తలా మూడు విజయాలతో టేబుల్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్నాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ ఢిల్లీని ముందుండి నడిపిస్తే.. రాజస్థాన్‌తో జరిగిన పోరులో విరాట్ అదే పనిచేశాడు.
ఇరు జట్లలో భారీ హిట్టర్లు ఉండడంతో అభిమానులకు కావాల్సిన మజా లభించనుంది. బలబలాల పరంగా పేపర్‌పై ఇరు జట్లు సమతూకంగా ఉన్నప్పటికీ బౌలింగ్ దృష్ట్యా ఢిల్లీ క్యాపిటల్స్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది. ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటి వరకు 23 సార్లు తలపడగా 14-8తో బెంగళూరు లీడ్‌లో ఉంది. ఒక్క మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఇదే ఆధిపత్యాన్ని కొనసాగించాలని విరాట్ సేన భావిస్తుండగా.. జైత్రయాత్రను కొనసాగించాలని ఢిల్లీ ఉవ్విళ్లూరుతుంది. మరీ గెలుపు ఏ జట్టును వరిస్తుందో..? చూడాలి!

పటిష్టంగా ఢిల్లీ..
లీగ్ మొదలైనప్పటి నుంచి శ్రేయస్ అయ్యర్ ఫామ్‌లోనే ఉన్నాడు. పైగా కేకేఆర్‌తో జరిగిన గత మ్యాచ్‌లో అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. పృథ్వీ షా, రిషభ్ పంత్ ఫామ్‌లోనే ఉన్నారు. శిఖర్ ధావన్ మెరుపులు మెరిపిస్తున్నా.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది. హెట్‌మెయిర్,స్టోయినిస్ మరింత రాణించాల్సి ఉంది. ఇవి తప్ప ఢిల్లీకి బ్యాటింగ్‌లో పెద్దగా సమస్యల్లేవు. బౌలింగ్‌లో కగిసో రబడా ప్రధాన ఆయుధం కాగా..నోర్జ్ సత్తా చాటుతుండడం ఢిల్లీకి ప్లస్ అవుతుంది. కేకేఆర్‌పై అదరగొట్టిన హర్షల్ పటేల్‌కు మరో చాన్స్ దొరకవచ్చు. గాయం నుంచి కోలుకొని అశ్విన్ తుది జట్టులోకి రావడం ఆ జట్టు బలాన్ని మరింత పెంచింది. మరోవైపు అమిత్ మిశ్రా కీలకం కానున్నాడు. ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగవచ్చు.

కోహ్లీతో కొండంత బలం..
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ విరాట్ కోహ్లీ అజేయ హాఫ్ సెంచరీతో రాణించి టచ్‌లో వచ్చాడు. ఇది ఆర్‌సీబీకి కొండంత బలాన్ని ఇచ్చింది. ఇక యువ ఓపెనర్ దేవదూత్ పడిక్కల్ ఇప్పటికే మూడు హాఫ్ సెంచరీలు సాధించి దూకుడు మీదున్నాడు. ఫించ్, డిలిలియర్స్ సత్తా చూపెడుతుండగా.. మిడిలార్డర్‌లో మాత్రం కొన్ని సమస్యలున్నాయి. టాపార్డర్‌లో ఏ ఇద్దరు చెలరేగిన ఆర్‌సీబీకి తిరుగుండదు. బౌలింగ్‌లో యుజ్వేంద్ర చాహల్ టాప్ ఫామ్‌లో ఉండగా.. ఉడానా, సైనీ వాషింగ్టన్ సుందర్, జంపా తదితరులతో లైనప్ బలంగా కనిపిస్తోంది. కానీ డెత్ ఓవర్లలోనే బౌలర్లు తేలిపోవడం జట్టు కలవరపెడుతుంది. అద్భుతంగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీస్తున్న ఉడానా.. డెత్ ఓవర్లలో ప్రత్యర్థిని కట్టడి చేయలేకపోతున్నాడు. సైనీ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. గాయం నుంచి క్రిస్ మోర్రిస్ కోలుకోవడంతో తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అతను జట్టులోకి వస్తే జంపా బెంచ్‌కే పరిమితమవుతాడు.

తుది జట్లు:
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: దేవదత్ పడిక్కల్, ఆరోన్ ఫించ్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), ఏబీ డివిలియర్స్ (కీపర్), గుర్‌క్రీత్ సింగ్, శివం దూబే, ఇసురు ఉడానా, వాషింగ్టన్ సుందర్, క్రిస్ మోర్రిస్, నవ్‌దీప్ సైనీ, యుజ్వేంద్ర చాహల్
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీషా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, షిమ్రాన్ హెట్‌మైర్, మార్కస్ స్టోయినిస్, హర్షల్ పటేల్, అశ్విన్, కగిసో రబడా, అమిత్ మిశ్రా, అన్రిచ్ నోర్జ్

పిచ్ రిపోర్ట్:
ఇప్పటి వరకు ఈ మైదానంలో జరిగిన మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. బ్యాటింగ్‌కు ఫేవర్‌గా మారింది. రెండు మ్యాచ్‌లు టై అయి సూపర్ ఓవర్‌కు కూడా దారితీసాయి. ఈ రోజు కూడా అదే పరిస్థితి ఉండనుంది. స్పిన్నర్లు కీలక పాత్ర పోషించనున్నారు. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవచ్చు. రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా.. స్టార్ స్పోర్ట్స్ చానెల్స్, డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
ముందే చెప్పి చెలరేగిన షేన్ వాట్సన్.. అద్భుత రికార్డు నమోదు!