ముందే చెప్పి చెలరేగిన షేన్ వాట్సన్.. అద్భుత రికార్డు నమోదు!

దుబాయ్: ఐపీఎల్ 2020లో చెన్నై సూపర్‌కింగ్స్ తమ 'హ్యాట్రిక్' పరాజయాలకు ఫుల్‌స్టాప్ పెట్టింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతూ.. ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో కింగ్స్ పంజాబ్‌ను చిత్తు చేసింది. ఓపెనర్లు షేన్ వాట్సన్(53బంతుల్లో 11 ఫోర్లు 3 సిక్స్‌లతో 83 నాటౌట్), ఫాఫ్ డూప్లెసిస్(53 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 87 నాటౌట్) రికార్డు భాగస్వామ్యంతో దంచికొట్టారు. అయితే ఈ మ్యాచ్‌కు ముందే షేన్ వాట్సన్ తన భారీ ఇన్నింగ్స్‌పై అభిమానులకు సంకేతాలు ఇచ్చాడు. ముందుంది ముసళ్ల పండుగా అనే ఉద్దేశంతో 'రానున్న మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్‌కు ఫర్ఫెక్ట్ మ్యాచ్ కాబోతుంది.'అని ట్వీట్ చేశాడు. అన్నట్లుగానే వాట్సన్ చెలరేగడం.. చెన్నై సూపర్ కింగ్స్ భారీ విజయాన్నందుకోవడంతో ఈ ట్వీట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
బ్యాట్‌తో విమర్శలకు సమాధానం..
గత నాలుగు మ్యాచ్‌ల్లో వాట్సన్ 4, 33, 14, 1 పరుగులతో దారుణంగా విఫలమయ్యాడు. దాంతో అతన్ని పక్కనపెట్టాలనే డిమాండ్ వ్యక్తమైంది. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషకులు వాట్సన్ ఆటతీరును తప్పుబట్టారు. జట్టుకు కుదిబండగా మారాడన్నారు. టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అయితే వాట్సన్‌ను తప్పిస్తేనే సీఎస్‌కే గాడిలో పడుతుందని విమర్శించాడు. కానీ ధోనీ మాత్రం తన మార్క్ కెప్టెన్సీతో వాట్సన్‌పై నమ్మకం ఉంచాడు. దాంతో ఈ ఆసీస్ మాజీ క్రికెటర్ పంజాబ్‌పై చెలరేగి ఫామ్‌లో వచ్చాయి. విమర్శకులకు తన బ్యాట్‌తో సమాధానం ఇచ్చాడు.

రికార్డు భాగస్వామ్యం..
ఈ మ్యాచ్‌లో వాట్సన్-డుప్లెసిస్ జోడి తొలి వికెట్‌కు అజేయంగా 181 రన్స్ జోడించారు. ఐపీఎల్ చరిత్రలోనే ఇది రెండో హయ్యెస్ట్ రన్ చేజ్ కాగా.. 2017లో కోల్‌కతా ఓపెనర్లు క్రిస్ లిన్, గౌతమ్ గంభీర్.. గుజరాత్ లయన్స్‌పై అజేయంగా 184 పరుగులు జోడించారు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఇదే అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యం కావడం విశేషం. 2013లో పంజాబ్‌ను పది వికెట్ల తేడాతో ఓడించిన ధోనీ సేన మళ్లీ ఇన్నాళ్లకు ఆ ఫీట్ రిపీట్ చేసింది. ఇక ఐపీఎల్ చరిత్రలో 12 సార్లు 10 వికెట్ల తేడాతో విజయాలు నమోదయ్యాయి.

వాట్సన్‌కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్..
తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 178 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్(52 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 63), నికోలస్ పూరన్(17 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లతో 33) రాణించారు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 17.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 181 పరుగులు చేసి 16 బంతులు ఉండగానే సునాయస విజయాన్నందుకుంది. విజయంలో కీలక పాత్ర పోషించిన షేన్ వాట్సన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది.
KXIP vs CSK: కింగ్స్ పంజాబ్ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలివే!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications