ఆ ఒక్క తప్పిదమే మా కొంప ముంచింది: విరాట్ కోహ్లీ

దుబాయ్: వచ్చిన అవకాశాలను చేజార్చుకోవడంతోనే ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో తమ దారుణ ఓటమికి కారణమని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 59 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన కోహ్లీ.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో దారుణంగా విఫలమయ్యామని ఒప్పుకున్నాడు. తమకంటే మెరుగైన ప్రదర్శన చేసిన ఢిల్లీ అద్భుత విజయాన్నందుకుందని కొనియాడాడు. ఢిల్లీని కట్టడి చేయడానికి ఆరంభంలో తడబడినా.. మధ్యలో పుంజుకున్నామని, కానీ ఆఖర్లో మార్కస్ స్టోయినిస్ మ్యాచ్‌ను లాగేసుకున్నాడని చెప్పుకొచ్చాడు. అతని క్యాచ్ చేజార్చడం మా విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు.

చివర్లోనే ఆగమైంది..
‘మేం ఆడాల్సిన తీరు ఇది కాదు. ఢిల్లీ శుభారంభం అందుకున్నా.. తర్వాతి 8 ఓవర్లు మేం బాగానే బౌలింగ్ చేశాం. కానీ చివర్లో మళ్లీ ఢిల్లీ చెలరేగింది. మంచి అవకాశాలను మేం చేజార్చుకున్నాం. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాం. మా ప్రణాళికలను కూడా సరిగ్గా అమలు పరచలేకపోయాం. వాస్తవానికి ఈ మ్యాచ్‌కు క్రిస్ అందుబాటులోకి వచ్చాడు. కానీ మ్యాచ్ ఆడలేకపోయాడు. తదుపరి మ్యాచ్‌కు ఇంకా నాలుగు రోజుల సమయం ఉంది కాబట్టి ఆలోపు పూర్తిగా సిద్దమవుతాడు.

మేం మూడు గెలిచాం..
ఇక మంచి విషయం ఏంటంటే ఐదింటిలో మేం మూడు గెలిచాం. మేం మంచి క్రికెట్ ఆడుతున్నామని తెలుసు. కాకపోతే కీలక సమయాల్లో ప్రొఫెషనలీజం కనబర్చాలి. భారీ లక్ష్యాన్ని అధిగమించాలంటే మంచి భాగస్వామ్యం అవసరం. చేతిలో 8 వికెట్లు ఉండి.. చివరి 10 ఓవర్లలో 100కు పైగా పరుగులు చేయాలన్నా డ్యూ పరిస్థితులతో సులువుగా చేయవచ్చు. ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతంగా ఆడింది. వారి బ్యాటింగ్ చాలా నిర్భయంగా ఉంది. వారికి మంచి పేసర్లతో పాటు స్పిన్నర్లున్నారు. వారిని ఓడించలేమని నేనటం లేదు కానీ.. కొంచెం కష్టమని చెబుతున్నా. ఈ రాత్రి మాది కాదంతే'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

చాహల్ క్యాచ్ డ్రాప్..
నవదీప్ సైనీ వేసిన ఇన్నింగ్స్ 15 ఓవర్ చివరి బంతికి స్టోయినిస్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అతను భారీ షాట్ ఆడగా.. బంతి గాల్లోకి లేచింది. పరిగెత్తుకుంటూ వెళ్లిన చాహల్ సునాయస క్యాచ్‌ను వదిలేశాడు. అప్పటికీ స్టోయినిస్ 14 బంతుల్లో 31 రన్స్ చేశాడు. అనంతరం చెలరేగిన అతను 26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 నాటౌట్‌తో భారీ స్కోర్ అందించాడు.

చేతులెత్తేసిన ఆర్‌సీబీ..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 196 పరుగులు చేసింది. మార్కస్ స్టొయినిస్ (26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 నాటౌట్) చెలరేగగా... పృథ్వీషా (23 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు 42) రాణించాడు. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడిన హైదరాబాద్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులే చేసి ఓడింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (39 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 43) తప్ప ఎవరూ కనీసం 20 పరుగులైనా చేయలేకపోయారు. కగిసో రబడ (4/24) బెంగళూరు పతనాన్ని శాసించాడు. మరో పేసర్ నోర్జ్‌కు రెండు వికెట్లు దక్కాయి. పొదుపుగా బౌలింగ్ చేసిన స్పిన్నర్ అక్షర్ పటేల్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
మా విజయ రహస్యం అదే: శ్రేయస్ అయ్యర్