ఐసీసీ నిబంధనను అతిక్రమించిన విరాట్ కోహ్లీ

దుబాయ్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ అలవాటులో ఓ పొరపాటు చేశాడు. కరోనా ప్రొటోకాల్స్‌ను మరిచి బంతికి ఉమ్మిని పూసి ఐసీసీ నిబంధనను అతిక్రమించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 59 పరుగులతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో పృథ్వీ షా ఆడిన మెరుపు షాట్‌ను షార్ట్ కవర్‌లో ఫీల్డింగ్ చేసిన కోహ్లీ అడ్డుకున్నాడు.
ఈక్రమంలో బంతికి అనుకోకుండా ఉమ్మిని పూసి వెంటనే చేయి వెనక్కి తీసుకున్నాడు. అయితే తప్పు తెలుసుకున్న విరాట్ పొరపాటు అయిందన్నట్టుగా నవ్వుతూ చేతిని పైకెత్తి సంజ్ఞ చేశాడు. ఈ సంఘటనపై సచిన్ టెండూల్కర్ కూడా ట్విటర్ వేదికగా స్పందించాడు. 'గెలిచే కసిలో అప్పుడప్పుడూ ఇలాంటివి జరుగుతుంటాయి' మరేం పర్లేదన్నట్లు సచిన్ ట్వీట్ చేశాడు
గతవారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో కూడా రాజస్థాన్ బ్యాట్స్‌మన్ రాబిన్ ఊతప్ప ఫీల్డింగ్ చేస్తూ బాల్‌కు సలైవా పూశాడు. కరోనా ముప్పు దృష్ట్యా సలైవా వాడకాన్ని ఐసీసీ జూన్‌లో తాత్కలికంగా నిషేధించిన విషయం తెలిసిందే. రెండు సార్లు తప్పు చేస్తే హెచ్చరించాలని, అయినా రిపీట్ చేస్తే 5 పరుగుల పెనాల్టీ ఇవ్వాలనే నిబంధనను తీసుకొచ్చింది. కానీ కొందరు ఆటగాళ్లు మాత్రం పాత అలవాటును మర్చిపోలేకపోతున్నారు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 196 పరుగులు చేసింది. మార్కస్ స్టొయినిస్ (26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 నాటౌట్) చెలరేగగా... పృథ్వీషా (23 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు 42) రాణించాడు. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడిన హైదరాబాద్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు 2 వికెట్లు దక్కాయి.
తర్వాత బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులే చేసి ఓడింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (39 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 43) తప్ప ఎవరూ కనీసం 20 పరుగులైనా చేయలేకపోయారు. కగిసో రబడ (4/24) బెంగళూరు పతనాన్ని శాసించాడు. మరో పేసర్ నోర్జ్‌కు రెండు వికెట్లు దక్కాయి. పొదుపుగా బౌలింగ్ చేసిన స్పిన్నర్ అక్షర్ పటేల్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications