క్రిస్ గేల్ ఓ దెయ్యం.. అతని రెండు కాళ్లు కట్టేసి బౌలింగ్ చేయాలి: అశ్విన్

దుబాయ్: యూనివర్సల్ బాస్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ బ్యాటింగ్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కింగ్స్ పంజాబ్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టేబుల్ టాపర్ అయిన ఢిల్లీ 5 వికెట్లతో ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గేల్ (23 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) తుషార్ దేశ్‌పాండే వేసిన ఓవర్‌లో వరుస బౌండరీలతో 26 పరుగులు పిండుకున్నాడు. అతనికి తోడు నికోలస్ పూరన్ సూపర్ ఫిఫ్టీతో చెలరగడంతో పంజాబ్ సునాయస విజయాన్నందుకుంది.

అశ్విన్ క్రీడా స్పూర్తి...
అయితే ఢిల్లీ బ్యాట్స్‌మెన్ విఫలమైన వేళ శిఖర్ ధావన్ అజేయ సెంచరీతో ఆకట్టుకున్నా.. ఓడిపోవడం అటు ఆటగాళ్లకు, ఇటు అభిమానులకు నిరాశను కలిగించింది. ఇక అశ్విన్ కూడా ఈ ఓటమిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ గేల్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఈ మ్యాచ్‌లో గేల్ షూస్ లేస్ కట్టి అశ్విన్ క్రీడా స్పూర్తిని చాటుకున్నాడు. సరిగ్గా అదే ఫొటో తన అధికారిక ట్విటర్‌లో పంచుకున్న ఈ టీమిండియా స్పిన్నర్.. తమ ఓటమిపై తనదైన శైలిలో స్పందించాడు. దెయ్యంలాంటి గేల్‌కు బౌలింగ్ చేయాలంటే అతని రెండు కాళ్లు కట్టేయాలని సరదాగా కామెంట్ చేశాడు.

దెయ్యం విధ్వంసమే..
‘దెయ్యం ఎప్పూడూ విధ్వంసమే సృష్టిస్తుంది. అందుకే అతని రెండు కాళ్లు కట్టేసి బౌలింగ్ చేయాలి. ఢిల్లీ క్యాపిటల్స్‌కు కఠినమైన రోజు. వెంటనే పుంజుకొని స్ట్రాంగ్ అవుతాం'అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అయితే ఈ మ్యాచ్‌లో గేల్‌ను అశ్వినే బౌల్డ్ చేయడం విశేషం. ఇప్పటివరకు ఈ ఇద్దరు 11 సార్లు తలపడగా.. యూనివర్స్ బాస్‌ను అశ్విన్ 5 సార్లు ఔట్ చేశాడు.

శిఖర్ సెంచరీ వృథా..
టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' శిఖర్ ధావన్ (61 బంతుల్లో 106 నాటౌట్) ఒక్కడే చెలరేగాడు. వీరోచిత శతకంతో ఆఖరి దాకా స్కోరుబోర్డును నడిపించాడు. తర్వాత కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 167 పరుగులు చేసి గెలిచింది. పూరన్ (28 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), గేల్ (23 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు.
KXIP vs DC: పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అయోమయం.. అది చెప్పడం మరిచిపోయాడు (వీడియో)!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications