Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కంగ్రాట్స్ నట్టూ.. ధోనీ వికెట్ తీయాలనే లక్ష్యాన్ని అందుకున్నావ్‌గా..!

IPL 2020: Ravichandran Ashwin Reacts After T Natarajan Achieves His Goal Of Dismissing MS Dhoni

దుబాయ్: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వికెట్ తీసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ టీ నటరాజన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభినందించాడు. మొత్తానికి లక్ష్యాన్ని అందుకున్నావని తన సహచర తమిళ ఆటగాడిని ప్రశంసించాడు. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ధోనీ వికెట్ తీయడమే తన లక్ష్యమని, అదే తాను సాధించే గొప్ప ఘనత అని అశ్విన్ యూట్యూబ్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటరాజన్ చెప్పుకొచ్చాడు. ఎవరి వికెట్ తీస్తే గొప్ప ఘనతగా ఫీలవుతావని అశ్విన్ అడగ్గా.. నట్టూ ఈ సమాధానమిచ్చాడు.

భారీ సిక్సర్.. ఆ వెంటనే ఔట్..

అన్నట్టుగానే మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ధోనీని అద్భుత యార్కర్‌కు బోల్తా కొట్టించాడు. అది కూడా తన స్పెల్ చివరి బంతికి అందుకున్నాడు. అయితే ఈ ఓవర్ ఐదో బంతిని ధోనీ తన ట్రేడ్ మార్క్ హెలికాప్టర్ షాట్‌తో భారీ సిక్సర్ కొట్టాడు. దాదాపు 102 మీటర్ల దూరం వెళ్లిన సిక్స్.. లార్జెస్ట్ సిక్స్ ఖాతాలో చోటు దక్కించుకుంది. ఇక ధోనీ వికెట్‌ను నట్టూ తీసిన విషయాన్ని అశ్విన్‌కు తెలియజేస్తూ ఓ అభిమాని ట్వీట్ చేయాగా.. ఈ తమిళనాడు స్పిన్నర్ స్పందించాడు. ‘వెలడన్ నటరాజన్.. గ్రేట్ మూమెంట్ ఫర్ యూ'అని ట్వీట్ చేశాడు.

రెండు వికెట్లు తీసిన నట్టూ..

రెండు వికెట్లు తీసిన నట్టూ..

ఈ మ్యాచ్‌లో నటరాజన్ రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. 41 పరుగులు ఇచ్చినా రెండు కీలక వికెట్లు తీసాడు. ముఖ్యంగా వాట్సన్‌ను ఔట్ చేసి మంచి బ్రేక్ త్రూ అందించాడు. ప్రస్తుతం లీగ్‌లోనే అత్యధిక యార్కర్లు వేసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్‌తో హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

చెన్నై ప్రతీకారం

చెన్నై ప్రతీకారం

ఈ మ్యాచ్‌లో చెన్నై 20 పరగులతో హైదరాబాద్‌ను ఓడించి ప్రతీకారం తీసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ధోనీ సేన.. షేన్ వాట్సన్(38 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లతో 42), అంబటి రాయుడు (34 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 167 రన్స్ చేసింది. చివర్లో ధోనీ(13 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 21), రవీంద్ర జడేజా(10 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 25 నాటౌట్) ధాటిగా ఆడారు. సన్‌ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, నటరాజన్ రెండేసి వికెట్లు తీశారు.

అనంతరం హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 147 పరుగులకే పరిమితమైంది. కేన్ విలియమ్సన్(39 బంతుల్లో 7 ఫోర్లు 57) మినహా అంతా విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో కరన్ శర్మ, బ్రావో రెండేసి వికెట్లు తీయగా.. సామ్ కరన్, జడేజా, ఠాకుర్ తలో వికెట్ తీశారు.

ఆ రెండు జట్లు అత్యుత్తమం.. ప్లే ఆఫ్ చేరే టీమ్స్ అవే.. ఆర్‌సీబీకీ నోచాన్స్: అగార్కర్

Story first published: Tuesday, October 13, 2020, 23:39 [IST]
Other articles published on Oct 13, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+