Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నిన్నటి హైదరాబాద్‌ మ్యాచ్‌లో ఇది గమనించారా? రషీద్ ఖాన్‌కు అండగా జట్టంతా ఏం చేసిందంటే?

IPL 2020: Rashid Khan and other SRH players wear black armbands to condole Afghanistan cricketer Najeeb Tarakai

దుబాయ్‌: కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయాన్నందుకున్న విషయం తెలిసిందే. ఓపెనర్లు బెయిర్‌స్టో (55 బంతుల్లో 97; 7 ఫోర్లు, 6 సిక్సర్లు), డేవిడ్ వార్నర్‌ (40 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్స్‌) అద్భుత భాగస్వామ్యానికి తోడుగా.. బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 69 పరుగులతో పంజాబ్‌ను చిత్తు చేసిన ఆరెంజ్ ఆర్మీ ముచ్చటగా మూడో విజయన్నందుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లంతా బ్లాక్ రిబ్బన్ ధరించి బరిలోకి దిగారు. ఈ విషయంలో సహచర ఆటగాడు రషీద్ ఖాన్‌కు ఆటగాళ్లంతా అండగా నిలిచారు.

 ఇంతకీ విషయం ఏంటంటే..

ఇంతకీ విషయం ఏంటంటే..

అఫ్గానిస్థాన్‌కు చెందిన ఓపెనర్ నజీబ్ తరకాయ్ మంగళవారం మృతి చెందిన విషయం తెలిసిందే. తన సహచర ఆటగాడి అకాల మరణానికి సంతాపం తెలిపేందుకు రషీద్ ఖాన్ బ్లాక్ రిబ్బన్‌తో బరిలోకి దిగేందుకు సిద్దమవ్వగా.. తాము కూడా ధరిస్తామని జట్టు మొత్తం అండగా నిలిచింది. ఈ కారణంగానే ఆటగాళ్లంతా బ్లాక్ రిబ్బన్స్‌తో మైదానంలో దిగారు. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు తీసుకున్న నిర్ణయంపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 రోడ్డు ప్రమాదంలో..

రోడ్డు ప్రమాదంలో..

ఇక రోడ్డు ప్రమాదంలో గతవారం గాయపడిన అఫ్ఘానిస్థాన్‌ టాపార్డర్‌ బ్యాట్స్‌మన్‌ నజీబ్‌ తరకాయ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. ఈనెల 2న ఈశాన్య నన్గహర్‌లో నజీబ్‌ రోడ్డు దాటుతుండగా కారు బలంగా ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందించినా ప్రాణాలు దక్కలేదు. నజీబ్‌ మృతికి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ), అఫ్ఘానిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (ఏసీబీ) సంతాపం వ్యక్తం చేశాయి. 2014 టీ20 వరల్డ్‌కప్‌తో జాతీయ జట్టులోకి వచ్చిన 29 ఏళ్ల నజీబ్‌ కేరీర్‌లో 12 మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. 2017లో ఐర్లాండ్‌తో ఏకైక వన్డే ఆడాడు.

 ఆల్‌రౌండ్ షో..

ఆల్‌రౌండ్ షో..

టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' బెయిర్‌స్టో (55 బంతుల్లో 97; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... వార్నర్‌ (40 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా అర్ధసెంచరీ సాధించాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 91 బంతుల్లో 160 పరుగులు జోడించారు. అనంతరం పంజాబ్‌ 16.5 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌటైంది. నికోలస్‌ పూరన్‌ (37 బంతుల్లో 77; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) మినహా అంతా విఫలమయ్యారు. 12 పరుగులకే 3 వికెట్లు తీసి రషీద్‌ ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. మరో 3.1 ఓవర్లు మిగిలి ఉండగానే ఇన్నింగ్స్‌ ముగియడం పంజాబ్‌ వైఫల్యాన్ని సూచిస్తోంది.

సన్‌రైజర్స్‌కు భారీ స్కోర్ చేసే సత్తా లేదా? ఇప్పుడేం అంటావ్ సెహ్వాగ్.. ఆడుకుంటున్న ఫ్యాన్స్!

Story first published: Saturday, October 10, 2020, 11:40 [IST]
Other articles published on Oct 10, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+