కోహ్లీ కొంచెం ఓవర్‌గా లేదు.. మరీ ఫోర్ కొట్టి సంబరాలా? నెటిజన్ల సెటైర్స్!

హైదరాబాద్: ఐపీఎల్ పదమూడో సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పంజా విసురుతుంది. ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఆరంభంలో విఫలమైనా.. రాజస్థాన్ రాయల్స్‌తో టచ్‌లోకి వచ్చిన కోహ్లీ నిలకడగా ఆడుతున్నాడు. అతనికి తోడుగా ఇతర ఆటగాళ్లు కూడా చెలరేగుతుండటంతో ఆర్‌సీబీ వరుస విజయాలతో దూసుకెళ్తుంది.
సోమవారం ఏకపక్షంగా సాగిన లీగ్ మ్యాచ్‌లో కోహ్లీసేన 82 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చిత్తు చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో క్లాసిక్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ(28 బంతుల్లో 1 ఫోర్‌తో 33)ఏబీ డివిలియర్స్(33 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 73 నాటౌట్) విధ్వంసానికి అండగా నిలిచాడు. ఈ క్రమంలో క్విక్ సింగిల్స్‌కే పరిమితమైన ఈ ఆర్‌సీబీ సారథి ఒకే ఫోర్ కొట్టి సంబరాలు చేసుకున్నాడు. దీనిపై నెటిజన్లు పెదవి విరుస్తున్నారు.
ఏమయ్యా కోహ్లీ..
ఇక వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మెన్ అయిన కోహ్లీ ఇలా ఒక ఫోర్ కొట్టి సెలెబ్రేట్ చేసుకోవడం చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. పరుగుల మిషన్‌గా ఎన్నో రికార్డులు అందుకున్న కోహ్లీ ఒక ఫోర్‌కు చిన్నపిల్లాడిలా గంతులేయడం ఏంటని విస్మయపోతున్నారు. అతని అభిమానులు కూడా కోహ్లీకి ఏమైందని వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. ఇదేం విడ్డూరమయ్యా కోహ్లీ...ఫోర్‌కు చిందులేస్తున్నావ్? అని ఒకరంటే.. అంతా 2020 మహిమా? అని మరొకరు కామెంట్ చేస్తున్నారు. ఇక ఫోర్‌కే చిందిస్తే.. డివిలియర్స్ ఏం చేయాలి.. మైదానమంతా పరుగెత్తాలా? అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
25 బంతుల తర్వాత..
అయితే కోహ్లీ సెలెబ్రేట్ చేసుకోవడానికి కూడా కారణం ఉంది. బ్యాటింగ్‌కు ప్రతికూలంగా మారిన పిచ్‌లో రన్స్ చేయడం చాలా కష్టమైంది. ఈ క్రమంలో కోహ్లీ ఏబీడీకి అండగా నిలిచాడు. స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఎక్కువగా అతనికి బ్యాటింగ్ ఇచ్చాడు. ఈ క్రమంలో ప్రసిధ్ కృష్ణ వేసిన ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతి కోహ్లీ బ్యాట్ ఎడ్జ్ తీసుకోని బౌండరీ వెళ్లింది. ఈ క్రమంలో సక్సెస్ అంటూ చేతులతో విరాట్ సెలెబ్రేట్ చేసుకున్నాడు. దీంతో నెటిజన్లు ఇది మరి ఓవరాక్షన్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
‘డివిలియర్స్ సిక్స్‌లు, ఫోర్లు మోత మోగించినా అతను సింపుల్‌సిటీతో ఉన్నాడు.. మరి కోహ్లి ఒక్క ఫోర్‌కే అంత రియాక్షన్ అవసరం లేదు' అని మరొక అభిమాని ట్రోల్ చేశాడు.

డి‘విలయం'..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 20 ఓవర్లలో 2 వికెట్లకు 194 రన్స్ చేసింది. ఏబీ డివిలియర్స్ (33 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 73 నాటౌట్) విధ్వంసానికి తోడుగా ఓపెనర్లు ఆరోన్ ఫించ్ (37 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 47), దేవదత్ పడిక్కల్ (23 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 32), కెప్టెన్ విరాట్ కోహ్లీ (28 బంతుల్లో 1 ఫోర్‌తో 33 నాటౌట్) కూడా రాణించారు. కోల్‌కతా బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, ఆండ్రూ రస్సెల్ చెరొక వికెట్ తీశారు. అనంతరం ఛేజింగ్‌లో కోల్‌కతా 20 ఓవర్లలో 112/9 స్కోరుకే పరిమితమై ఘోర ఓటమి మూటగట్టుకుంది. శుభ్‌మన్ గిల్ (25 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 34) టాప్ స్కోరర్. బెంగళూరు బౌలర్లలో క్రిస్ మోర్రిస్, వాషింగ్టన్ సుందర్ రెండేసి వికెట్లు తీయగా.. సైనీ, సిరాజ్, చాహల్, ఉడానా తలో వికెట్ పడగొట్టారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
IPL 2020 టైటిల్ ఆర్‌సీబీదే అనడానికి మూడు బలమైన కారణాలు!