IPL 2020 టైటిల్ ఆర్‌సీబీదే అనడానికి మూడు బలమైన కారణాలు!

హైదరాబాద్: వరల్డ్ క్రికెట్లో టాప్ మోస్ట్ ప్లేయర్లు అయిన విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ ఉన్నా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇప్పటి వరకు టైటిల్ గెలవలేదు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పుష్కరకాలంగా ప్రయత్నిస్తున్నా... ఇప్పటికీ ఆర్‌సీబీకి ఐపీఎల్ టైటిల్ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలింది. 2009, 2011, 2016లో ఫైనల్‌కు చేరినా.. టైటిల్‌ను ఒడిసి పట్టుకోలేకపోయింది. ఈ మూడు సీజన్లు మినహా.. లీగ్ మొత్తం ఆర్‌సీబీ పెర్ఫామెన్స్ అంతంతమాత్రంగానే ఉంది. ఓడిన ప్రతిసారి బౌలింగ్‌పై నిందలు వేస్తూ వచ్చిన బెంగళూరు ఈసారి మాత్రం సరికొత్తగా కనిపిస్తున్నది.
టైటిలే లక్ష్యంగా జట్టు రూపురేఖలు మార్చుకొని బరిలోకి దిగిన కోహ్లీ సేన.. పదమూడో సీజన్‌లో పంజా విసురుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అటు బ్యాటుతో.. ఇటు బంతితో మాయ చేస్తోంది. ఒకరు కాకపోతే మరొకరు అన్నట్టు స్టార్లు చెలరేగిపోతున్నారు. దాంతో ఆర్‌సీబీ ఎన్నడూ లేని విధంగా ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఐదు గెలిచి పాయింట్స్ టేబుల్లో టాప్-3లో ఉంది.
చాంపియన్లనే ఓడించింది..
పైగా ఈ సీజన్లో ఆర్‌సీబీ ఓడించింది కూడా మాజీ చాంపియన్లనే. నాలుగు టైటిళ్లు గెలిచిన ముంబైని సూపర్ ఓవర్లో మట్టికరిపించింది. మూడు సార్లు చాంపియన్ అయిన చెన్నైని చిత్తుచేసింది. రెండు సార్లు టైటిల్ అందుకున్న కోల్‌కతాను కోలుకోలేని దెబ్బతీసింది. ఒక్కోసారి టైటిల్ నెగ్గిన హైదరాబాద్, రాజస్థాన్‌ను ఓడించింది. ప్రస్తుతం ఆ జట్టు జోరు చూస్తుంటే ఐపీఎల్ 2020 వారిదే అనిపిస్తుంది. ఓ మూడు కారణాలు కూడా ఆ జట్టుకు టైటిల్ పక్కా అనే సంకేతాలు ఇస్తున్నాయి.

కోహ్లీ, డివిలియర్స్ సూపర్ ఫామ్
ఇక ఆర్‌సీబీకి బ్యాటింగ్‌లో ఎప్పుడూ డోకాలేదు. కాకపోతే ఆ జట్టు ఎక్కువగా విరాట్ కోహ్లీ, ఏబీడివిలియర్స్‌పై అతిగా ఆధారపడేది. కానీ ఈ సీజన్‌లో దేవదత్ పడిక్కల్ రూపంలో ఆజట్టుకు మంచి ఓపెనర్ దొరికాడు. అలాగే ఆరోన్ ఫించ్‌తో బ్యాటింగ్ బలం రెట్టింపు అయింది. అంతకు మించి కోహ్లీ, ఏబీడీ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ఒకరు విఫలమైతే మరొకరు చెలరేగుతున్నారు. కోహ్లీ విఫలమైనా ఆ జట్టు 200 పరుగుల భారీ స్కోర్ చేసిందంటే..ఆ జట్టు బ్యాటింగ్ బలం ఎలా ఉందో అర్థం అవుతుంది. వాషింగ్టన్, సుందర్, శివం దూబే, క్రిస్ మోర్రీస్‌తో బ్యాటింగ్‌లో డెప్త్ కూడా ఉంది. వారి టాపార్డ్‌లో ఏ ఇద్దరు చెలరేగినా ఆ జట్టుకు తిరుగుండదు. మంచి ఆరంభం లభిస్తే భారీ స్కోర్‌లు నమోదు చేస్తుంది. తదుపరి మ్యాచ్‌ల్లో కూడా ఇదే జోరును కొనసాగిస్తే బెంగళూరు టైటిల్ కరువు తీరినట్టే.

బౌలింగ్ కాంబినేషన్ సూపర్..
ప్రతీసీజన్‌లో బౌలింగ్ బలహీనతోనే ఓటమిపాలైన ఆర్‌సీబీ.. ఈ సీజన్‌లో మాత్రం మంచి బౌలింగ్ కాంబినేషన్‌ను ఎంచుకుంది. ఆర్‌సీబీ ఓడిన రెండు మ్యాచ్‌ల్లో తేలిపోయినా.. క్రిస్ మోరిస్ రాకతో ఇప్పుడంతా సెట్ అయింది. డెత్ ఓవర్లలో కూడా బలం పెరిగింది. అతనికి తోడుగా నవ్‌దీప్ సైనీ, ఇసురు ఉడానా చెలరేగుతున్నారు. మహ్మద్ సిరాజ్ కూడా పర్వాలేదనిపిస్తున్నాడు. ఇక స్పిన్నర్లు వాషింగ్టన్ సుంధర్, యుజ్వేంద్ర చాహల్ అయితే వారి అస్త్రాలుగా మారారు. తనదైన టెక్నిక్‌తో చాహల్ వికెట్లు తీస్తుంటే.. పవర్ ప్లే స్పిన్ స్పెషలిస్ట్‌గా సుంధర్ చెలరేగుతున్నాడు. తదుపరి మ్యాచ్‌ల్లో ఈ మ్యాజిక్ రిపీట్ అయితే కోహ్లీ సేనకు తిరుగుండదు.

మైక్ హెస్సన్, సపోర్ట్ స్టాఫ్..
మైదానంలో ఆటగాళ్లు రాణిస్తున్నారంటే అందులో సపోర్ట్ స్టాప్ పాత్ర చాలా ఉంటుంది. అసలు వారు జట్టుకు పిల్లర్స్ వంటి వారు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ సక్సెస్ సాధించడానికి.. ఈ సీజన్‌లో యువ ఆటగాళ్లతో కూడిన ఢిల్లీ చెలరేగేందుకు కారణం కూడా ఆయా జట్ల సపోర్ట్ స్టాఫే. అయితే ఈసారి ఆర్‌సీబీ తమ కోచింగ్ బృందాన్ని పూర్తిగా మార్చేసి బరిలోకి దిగడం కలిసొచ్చింది. మైక్ హెస్సెన్ హెడ్ కోచ్‌గా నియమించుకుంది. అతను న్యూజిలాండ్ జట్టుకు కూడా కోచ్‌గా పనిచేశాడు. విశ్లేషణ సామర్థ్యం కలిగినవాడు. వ్యూహాలు రచించడంలో దిట్ట. అసలు ప్రస్తుత ఆర్‌సీబీ జైత్రయాత్రకు అతనే కారణం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆటగాళ్లలో సానుకూల దృక్పథం నింపడంలో హెస్సెన్ సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా కోల్‌కతాతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో బ్యాక్ ఎండ్‌లో అతను చేస్తున్న పని స్పష్టంగా అర్థమైంది. ప్రతీ బ్యాట్స్‌మెన్‌కు తగ్గట్టు బౌలర్లతో వ్యూహం రచించాడు. తదుపరి మ్యాచ్‌ల్లో కూడా అతని వ్యూహాలు మరింత కీలకం కానున్నాయి.
IPL 2020: కుర్రాళ్లోయ్ కుర్రాళ్లు.. గెలిపించే సత్తా ఉన్నోళ్లు!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications