For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2020 ఫిక్స్ అయ్యిందా? ఢిల్లీ స్కోర్‌ ముందే ముంబైకి ఎలా తెలుసు? ఫ్యాన్స్ ఫైర్

 IPL 2020: Netizens spark match-fixing rumours After MI’s Twitter handle mistakenly tweets DC’s final score
IPL 2020 Match Fixing:Mumbai Indians Controversial Tweet Sparks Fixing Rumours, SOMETHING FISHY

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 ఫిక్స్ అయిందా? అంటే అవుననే అంటున్నారు నెటిజన్లు. ఇందుకు ఢిల్లీ క్యాపిటల్స్‌, ముంబై ఇండియన్స్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచే సాక్ష్యం అంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీపై మండిపడుతున్నారు. ఫిక్సింగ్ కాబట్టే ఢిల్లీ చేసే స్కోర్‌ను ముంబై ముందే చెప్పిందని సాక్ష్యాధారాలతో సహా ట్వీట్ చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌‌‌లో ముంబై ఇండియన్స్ 5 వికెట్లతో ఢిల్లీని ఓడించిన విషయం తెలిసిందే.

అసలు విషయం ఎంటంటే..?

అసలు విషయం ఎంటంటే..?

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగా బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 162 ప‌రుగులు చేసింది. అయితే ఢిల్లీ ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే ముంబై ఇండియన్స్ తమ అధికారిక ట్విటర్‌లో‘ప్యాటిన్సన్ కొత్త బంతిని అందుకున్నాడు. ఢిల్లీ 19.5 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసింది.'అని ట్వీట్ చేసింది. ముంబై ట్వీట్ చేసిన సమయానికి ఢిల్లీ ఒక వికెట్ కోల్పోయింది. కానీ యాదృచ్ఛిక‌మో, మరే విష‌య‌మో తెలియ‌దు కానీ.. ముంబై ఇండియ‌న్స్ చేసిన ట్వీట్‌కు అనుగుణంగానే ఢిల్లీ 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల‌కు 162 ప‌రుగులు చేసింది. దీంతో ఈ మ్యాచ్‌‌పై అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

స్కోర్లు ఫిక్స్ చేశారు..

స్కోర్లు ఫిక్స్ చేశారు..

ఇన్నింగ్స్ ముగియ‌కుండానే ముంబై ఫ్రాంచైజీ అంత క‌చ్చితంగా స్కోరును ముందుగానే ఎలా ఊహిస్తుంది, క‌చ్చితంగా ఇందులో ఏదో తేడా ఉంది, ఫిక్సింగ్ జ‌రిగే ఉంటుంది.. అని అభిమానులు సోషల్ మీడియా వేదికగా మండిప‌డుతున్నారు. స్కోర్లు ముందే ఫిక్స్ చేశారని ఆరోపిస్తున్నారు. అయితే ముంబై ఇండియ‌న్స్ ఈ ట్వీట్‌ను త‌రువాత డిలీట్ చేసింది. కానీ ఆ ట్వీట్‌‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ అప్పటికే వైరల్ అయ్యాయి. ఈ స్క్రీన్ షాట్‌ను షేర్ చేస్తూ.. ఐపీఎల్ 2020 మొత్తం ఫిక్స‌యింద‌ని, ముంబై జ‌ట్టే మ‌ళ్లీ గెలుస్తుంద‌ని అభిమానులు ఆరోపణలు గుప్పిస్తున్నారు.

అది పొరపాటే..

అయితే ప్రతీ ఓవర్‌కు ట్వీట్ చేస్తున్నప్పుడు స్కోర్లు కూడా వేస్తారని, ఆ తొందరలోనే తప్పుగా స్కోర్ వేసారని, అంతమాత్రాన ఫిక్సింగ్ అంటే ఎలానని ముంబై అభిమానులు వాదిస్తున్నారు. అది ట్విటర్ హ్యాండిల్ చూసుకునే ఉద్యోగి చేసిన తప్పిదమని, ఫిక్సింగ్ వంటిదేం లేదని ఈ ట్రోలింగ్‌ను తిప్పికొడుతున్నారు. ప్యాటిన్సన్ కొత్త బంతిని అందుకున్నాడని ట్వీట్‌లో పేర్కొన్నారని, అదే ఈ విషయంలో క్లారిటీ ఇస్తుందంటున్నారు. మొత్తానికి ఈ విషయం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అయింది. ఇక ఈ ఫిక్సింగ్ ట్రోలింగ్ పై ఇటు ముంబై ఇండియన్స్ కానీ, అటు ఢిల్లీ క్యాపిటల్స్ కానీ స్పందించలేదు. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కూడా పట్టించుకోలేదు.

చెలరేగిన డికాక్.. మురిసిన ముంబై..

చెలరేగిన డికాక్.. మురిసిన ముంబై..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 162 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ (52 బంతుల్లో 69 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (33 బంతుల్లో 42; 5 ఫోర్లు) రాణించారు. కృనాల్‌ పాండ్యా 2 వికెట్లు తీశాడు. తర్వాత ముంబై ఇండియన్స్‌ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 166 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' డికాక్‌ (36 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), సూర్యకుమార్‌ (32 బంతుల్లో 53; 6 ఫోర్లు, 1 సిక్స్‌) మెరిపించారు.

సునీల్ నరైన్ వివాదస్పద బౌలింగ్‌పై కేకేఆర్ కీలక ప్రకటన!

Story first published: Monday, October 12, 2020, 16:51 [IST]
Other articles published on Oct 12, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+