చాలా బాధగా ఉంది.. ఈ ఏడాది మాకు కలిసి రాలేదు: ధోనీ

షార్జా: వరుస పరాజయాలతో టోర్నీ ఈ స్థాయికి దిగజారిపోవడం చాలా బాధగా ఉందని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. శుక్రవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో చెన్నైపై ముంబై ఇండియన్స్ 10 వికెట్లతో ఘన విజయాన్నందుకున్న విషయం తెలిసిందే. ఈ గెలుపుతో ముంబై అగ్రస్థానంలోకి దూసుకెళ్లగా.. ధోనీసేన అట్టడుగు స్థానానికి పరిమితమైంది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన మహీ.. ఈ ఏడాది తమకు ఏది కలిసిరాలేదని, తమ వరుస వైఫల్యాలు తీవ్రంగా హర్ట్ చేశాయన్నాడు. బ్యాటింగ్ వైఫల్యంతోనే ఈ సీజన్‌లో మూల్యం చెల్లించుకున్నామని, కనీసం వచ్చే ఏడాదికైనా క్లారిటీగా ఉండటం తమకు చాలా ముఖ్యమన్నాడు. బెంచ్‌కే పరిమితమైన ఆటగాళ్లందరికి తదుపరి మ్యాచ్‌ల్లో అవకాశం కల్పిస్తామన్నాడు.

లక్ ఏమాత్రం లేదు..
‘ఈ వరుస వైఫల్యాలు బాధించాయి. ఈ ఏడాది మేం అనుకున్నదేం జరగలేదు. మాకు ఏదీ కలిసిరాలేదు. 8 లేదా 10 వికెట్ల తేడాతో ఓడామన్నది విషయం కాదు. కానీ టోర్నీలోని ఈ దశలో మేం ఏ స్థానంలో ఉన్నామన్నదే తీవ్రంగా బాధిస్తుంది. సెకండ్ మ్యాచ్ నుంచే మాకు పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారాయి. రాయుడు గాయపడ్డాడు. అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇతర బ్యాట్స్‌మెన్ సిద్దంగా లేరు. క్రికెట్‌లో టఫ్ ఫేస్‌ను ఎదుర్కొంటున్నప్పుడు కొంచెం లక్ కూడా అవసరం. కానీ అది మాకు ఏ మాత్రం లేదు. తొలుత బ్యాటింగ్ చేయాలనుకున్న మ్యాచ్‌ల్లో టాస్ గెలవలేదు. అలాంటి మ్యాచ్‌ల్లో ఎలాంటి తేమ ప్రభావం లేదు. కానీ తొలుత బ్యాటింగ్ చేసిన మ్యాచ్‌ల్లో మాత్రం ఆకస్మాత్తుగా డ్యూ ప్రభావం చూపి ఫలితాలను తారుమారు చేసింది.

బ్యాటింగ్ వైఫల్యం..
అయితే ఓడినప్పుడు 100 కారణాలు చెప్పవచ్చు. కానీ జట్టు సామర్థ్యానికి తగినట్లు ఆడితే పరిస్థితులతో సంబంధం లేకుండా ఫలితాలు రాబట్టవచ్చు. పేపర్‌పై బలమైన జట్టు, అద్భుత గణంకాలను కలిగి కూడా విజయం సాధించలేకపోయాం. ఈ ఏడాది మా బ్యాటింగ్ చాలా దారుణంగా ఉంది. అయితే ఇదంతా ఆటలో భాగమే. వరుస వైఫల్యాలు ఎదురవుతున్నా తమ ఆటగాళ్లు పోరడటానికి ప్రయత్నించారు. వారి సాయశక్తుల రాణించడానికి కృషి చేశారు.

ఓ క్లారిటీ అవసరం..
ఈ ఏడాది ఎలాగు మాకు కలిసి రాలేదు. కనీసం వచ్చే ఏడాదికైనా జట్టు విషయంలో మాకు ఓ క్లారిటి పిక్చర్ అవసరం. అయితే వేలం ఉంటుందా? ఎక్కడ జరుగుతుందనే ప్రశ్నలు అనేకం ఉన్నాయి. తదుపరి మూడు మ్యాచ్‌లను యువ ఆటగాళ్ల సత్తాను పరీక్షిస్తాం. వచ్చే ఏడాదికి సన్నహకాల్లో బాగంగా సిద్దం చేస్తాం. డెత్ ఓవర్లలో ఒత్తిడిని తట్టుకోని బౌలింగ్,బ్యాటింగ్ చేసేదేవరో గుర్తిస్తాం. ఇప్పటివరకు అవకాశాలు అందుకోని ఆటగాళ్లందరికి చాన్స్ ఇస్తాం'అని ధోనీ చెప్పుకొచ్చాడు.

ఇస్మార్ట్ ఇషాన్ కిషన్..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై ట్రెంట్ బౌల్ట్(4/18), జస్ ప్రీత్ బుమ్రా(2/25), రాహుల్ చాహర్ (2/22) నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 114 రన్స్ చేసింది. సామకరన్ (42 బంతుల్లో 4 ఫోర్, 2 సిక్స్‌లతో 52) మినహా అంతా దారుణంగా విఫలమయ్యారు. ధోనీ(16 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్స్‌తో 16), జడేజా(7), ఫాఫ్(1) తీవ్రంగా నిరాశపరిచాడు. అనంతరం చెన్నై ఓపెనర్ల సూపర్ బ్యాటింగ్‌తో 12.2 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 116 పరుగులు చేసి ఘనవిజయాన్నందుకుంది. ఇషాన్ కిషన్(37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 68 నాటౌట్), క్వింటన్ డికాక్(37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46 నాటౌట్) సూపర్ బ్యాటింగ్‌తో రాణించారు.
నీకు నచ్చకపోతే చెత్త కామెంటేటర్ అను.. కానీ బిట్స్ అండ్ పీసెస్ వద్దు: సంజయ్ మంజ్రేకర్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications