For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తలకిందులు తపస్సు చేసినా ఆర్‌సీబీ టైటిల్ గెలవదు: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్

IPL 2020: Michael Vaughan says don’t think RCB can be the champions

లండన్: ఐపీఎల్ 2020 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు లక్కీగా ప్లే ఆఫ్స్ చేరినా టైటిల్ మాత్రం గెలవదని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖెల్ వాన్ అన్నాడు. ఆ జట్టుకు వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచే సత్తా లేదని అభిప్రాయపడ్డాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో సోమవారం జరిగిన కీలక పోరులో ఆర్‌సీబీ 6 వికెట్లతో ఓడినా.. మెరుగైన రన్‌రేట్ కారణంగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.

అయితే ఈ 2020లో ఎన్నో వింతలు విశేషాలు చోటుచేసుకున్నా.. ఆర్‌సీబీకి మాత్రం ఐపీఎల్ ట్రోఫీ అందుకునే సీన్ లేదని మైఖెల్ వాన్ స్పష్టం చేశాడు. తాజాగా క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ ఆ జట్టు తలకిందులు తపస్సుచేసినా చాంపియన్ కాలేదన్నాడు. ఫస్ట్ నుంచి తాను అదే చెబుతున్నానన్నాడు.

2020లో ఎన్నో జరిగాయి.. కానీ

2020లో ఎన్నో జరిగాయి.. కానీ

‘2020లో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రపంచమే తలక్రిందులైంది. ఏం జరుగుతుందో కూడా ఊహించలేని పరిస్థితి ఉంది. కానీ ఆర్‌సీబీ మాత్రం టైటిల్ గెలవదనే అనిపిస్తుంది. విరాట్ కోహ్లీ ఎడమ చేతి బ్యాటింగ్ చేస్తే తప్పా ఆ జట్టు చాంపియన్‌గా నిలిచేలా లేదు'అని వాన్ వ్యంగ్యస్త్రాలు సంధించాడు. ఆర్‌సీబీలో ఫైర్ పవర్ ఉన్న ఆటగాళ్లు లేరని, పైగా ఆ జట్టు వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడి తీవ్ర ఒత్తిడిలో ఉందన్నాడు. ‘టీమ్స్, ఆటగాళ్లను వ్యక్తిగతంగా పరిశీలించినప్పుడు ఆర్‌సీబీ ఒత్తిడిలో ఉన్నట్లు అనిపించింది. ఆర్‌సీబీ గెలవాలంటే చేయాల్సింది ఒక్కటే.. దూకుడుగా ఆడుతూ ఆఖరి బంతి వరకు పోరాడాలి'అని వాన్ సూచించాడు.

దూకుడుగా ఉంటేనే..

దూకుడుగా ఉంటేనే..

ఇక విరాట్ కోహ్లీ ఫామ్‌పై మాట్లాడుతూ.. అతను మరిన్ని మ్యాచ్‌లు గెలిపించాల్సిన అవసరం ఉందన్నాడు. ‘ఈ 2020లో విరాట్ కోహ్లీ సాధారణ ఆటగాడిగా మారిపోయాడు. పూర్తిగా తడబడ్డాడు. అయితే అతని ప్రదర్శన మరీ దారుణంగా ఏం లేదు. 122 స్ట్రైక్‌రేట్‌తో 400 పరుగులకు పైనే చేశాడు. కానీ అతను కనీసం 140కి పైగా స్ట్రైక్ రేట్ మెయింటేన్ చేయాలి. ఆర్‌సీబీ చాలా గేమ్స్ గెలిపించాలి. గతంలో చేశాడు. కానీ అతను కూడా మనిషే. ప్రతీ ఒక్కరికి గడ్డు రోజులు ఉంటాయి. గత కొన్నేళ్లుగా అతను బాగానే రాణించాడు. కానీ ఈసారి పరిస్థితులు అనుకూలించలేదు.'అని వాన్ చెప్పుకొచ్చాడు.

విరాట్ @460

విరాట్ @460

ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 14 మ్యాచ్‌లు ఆడిన విరాట్ 122.1 స్ట్రైక్‌రేట్‌తో 460 పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్-5లో ఉన్నాడు. అయితే ఈ ఐదుగురిలో విరాట్ స్ట్రైక్‌రేట్ తక్కువు. గత సీజన్ల మాదిరి అతనిలో దూకుడు కనిపించడం లేదు. భారీ షాట్లు ఆడలేకపోతున్నాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కూడా విరాట్ విఫలమయ్యాడు. టెస్ట్ తరహా బ్యాటింగ్‌తో విసిగించాడు.

దాంతో బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. దేవ్‌దత్‌ పడిక్కల్‌ (41 బంతుల్లో 50; 5 ఫోర్లు) రాణించాడు. డివిలియర్స్‌ (21 బంతుల్లో 35; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' నోర్జే 3 వికెట్లు తీయగా...రబడ ఖాతాలో రెండు వికెట్లు పడ్డాయి. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌ 19 ఓవర్లలో 4 వికెట్లకు 154 పరుగులు చేసి గెలిచింది.

IPL 2020: క్రికెట్‌కు క్రిస్‌ గేల్ గుడ్ బై .. రిటైరవ్వద్దని ఫ్యాన్స్ రిక్వెస్ట్!

Story first published: Tuesday, November 3, 2020, 13:36 [IST]
Other articles published on Nov 3, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+