Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2020: క్రికెట్‌కు క్రిస్‌ గేల్ గుడ్ బై .. రిటైరవ్వద్దని ఫ్యాన్స్ రిక్వెస్ట్!

 Universe Boss Chris Gayle Makes A Special Request To Fans After His IPL 2020 Season Ends

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2020 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కథ ముగిసిన విషయం తెలిసిందే. వరుసగా 5 విజయాలతో ఆశలు రేకెత్తించిన రాహుల్ సేన.. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన కీలక పోరులో ప్లేఆఫ్స్‌ చేరకుండానే ఇంటిముఖం పట్టింది. అయితే ఆ జట్టు బ్యాట్స్‌మన్ క్రిస్‌ గేల్‌ సోమవారం ఓ ఆసక్తికర ట్వీట్‌‌తో అభిమానులను అయోమయానికి గురి చేశాడు.

'నా సీజన్‌ పూర్తయినా.. మీరంతా ఈ టీ20 లీగ్‌ను వీక్షిస్తూ తరించండి'అని పేర్కొంటూ ధన్యవాదాలు తెలిపాడు. దాంతో గందరగోళానికి గురైన గేల్‌ అభిమానులు.. యూనివర్స్‌ బాస్‌ రిటైర్‌ అవుతున్నట్లు భావించి అలా చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. 'అయితే, మీరు రిటైర్‌ అవుతున్నారా? దయచేసి అలా చేయొద్దు' అని ఒకరంటే.. 'మీరు ఇంకొన్ని సీజన్లు ఆడాలి' అని ఇంకొకరు కామెంట్ చేశారు. 'మీరు మళ్లీ వచ్చి మమ్మల్ని అలరించాలని, ఈ ఒక్క సీజనే పూర్తయింది' అని విజ్ఞప్తి చేస్తున్నారు. దాంతో గేల్ రిటైర్మెంట్ వ్యవహారం చర్చనీయాంశమైంది.

'Still The Boss'- Chris Gayle, The Only Cricketer To Score 1000 Sixes In T20 History | #UniverseBoss

ఈ సీజన్‌లో 7 మ్యాచ్‌లే ఆడిన యూనివర్స్ బాస్ 288 పరుగులు సాధించాడు. వయసు పెరిగినా ఇంకా తనలో పరుగులు చేసే సత్తా ఉందని నిరూపించాడు. మొత్తం మూడు హాఫ్ సెంచరీలతో పాటు రాజస్థాన్‌పై 99 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఒక్క పరుగు దూరంలో ఔటైన ఈ విండీస్ వీరుడు ఈ లీగ్‌లో ఏడో శతకాన్ని కోల్పోయాడు. అయితే, సీజన్‌ ఆరంభం నుంచీ గేల్‌ ఆడి ఉంటే పంజాబ్‌ కథ మరోలా ఉండేదని ఆ జట్టు అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Story first published: Tuesday, November 3, 2020, 12:26 [IST]
Other articles published on Nov 3, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+