MI vs RR: ముంబై vs రాజస్థాన్ భారీ హిట్టర్ల మధ్య పోరు.. గెలిచేదెవరు? తుది జట్లు ఇవే!

అబుదాబి: ఐపీఎల్ 2020లో మరో రసవత్తరపోరుకు రంగం సిద్దమైంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై రికార్డు విజయం తర్వాత వరుసగా విఫలమవుతున్న రాజస్థాన్ రాయల్స్.. మంగళవారం జరిగే లీగ్ మ్యాచ్‌లో బలమైన ముంబై ఇండియన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఐదింటిలో మూడు విజయాలతో ముంబై టేబుల్లో టాప్-2లో ఉండగా.. రెండింటిలో గెలిచి మరో రెండింటిలో ఓడిన రాజస్థాన్ ఐదో స్థానంలో ఉంది.
తొలి రెండు మ్యాచ్‌ల్లో సంచలన విజయాలతో అదరగొట్టిన రాజస్థాన్.. ఆ తర్వాత వరుసగా రెండు ఓడి ఢిలా పడింది. ఈ మ్యాచ్‌లో ఎలాగైన గెలిచి విజయాల ట్రాక్‌లో పడాలని భావిస్తోంది. మరోవైపు భీకరమైన బ్యాటింగ్ లైనప్‌తో విజయ ఉత్సాహంలో ఉన్న ముంబై తమ జైత్రయాత్రను కొనసాగించాలని ఉవ్విళ్లూరుతుంది.
ఇరు జట్లలో భారీ హిట్టర్లు ఉండడంతో అభిమానులకు కావాల్సిన మజా లభించనుంది. బలబలాల పరంగా పేపర్‌పై ముంబై ఇండియన్స్ బలంగా ఉన్నప్పటికీ రాజస్థాన్‌ను తక్కువ అంచనా వేయలేం. ఆ జట్టులో ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని శాసించే ఆటగాళ్లున్నారు. ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటి వరకు 23 సార్లు తలపడగా 11-11తో సమంగా ఉన్నాయి. ఒక్క మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. మరీ ఈ మ్యాచ్‌లో గెలుపు ఏ జట్టును వరిస్తుందో..? చూడాలి!

సంజూ శాంసన్‌పైనే అందరి చూపు..
స్టార్లు లేకున్నా డొమెస్టిక్ కుర్రాళ్లతో రాయల్స్ బలంగా ఉంది. వారి అండతోనే తొలి రెండు మ్యాచ్‌ల్లో సంచలన విజయాలను నమోదు చేసింది. కానీ తరువాతి రెండు మ్యాచ్‌ల్లో కెప్టెన్ స్మిత్‌తో సహా కుర్రాళ్లంతా విఫలమవడంతో రాజస్థాన్ వరుస పరాజయాలను చవిచూసింది. దీంతో లైనప్‌లో మార్పులు చేయాలని కెప్టెన్ స్మిత్ భావిస్తున్నాడు. అదే జరిగితే యశస్వి జైస్వాల్‌కు చాన్స్ దక్కొచ్చు. టాప్‌లో శాంసన్‌పై భారం వేసి మిడిలార్డర్‌ను బలోపేతం చేసేందుకు స్మిత్ లైనప్‌లో కిందకు రావాలని భావిస్తున్నాడు. బట్లర్ వైఫల్యం కూడా టీమ్‌కు ప్రతికూలంగా మారింది.
అతనితో పాటు స్మిత్, శాంసన్ చెలరేగాల్సింది. వీరిలో ఏ ఇద్దరి చెలరేగినా రాజస్థాన్ బ్యాటింగ్‌కు తిరుగుండదు. ఊతప్ప కూడా ఫామ్‌లోకి రావాలి. బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తుండగా.. ఇతర బౌలర్లు విఫలమవుతున్నారు. టామ్ కరన్ బ్యాటింగ్‌లో మెరిసినా.. బౌలింగ్‌లో పరుగులను నియంత్రించలేకపోతున్నాడు. జయదేవ్ ఉనాద్కట్‌ను వద్దనుకుంటే వరుణ్ ఆరోన్ లేదా కార్తీక్ త్యాగిని పరిక్షించి చూడొచ్చు.

హిట్టర్లే ప్రధాన బలం..
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో సూపర్ ఓవర్‌లో నిరాశపర్చినా.. లాస్ట్ రెండు మ్యాచ్‌ల్లో ముంబై బాగా పుంజుకుంది. ముంబై బ్యాటింగ్‌లో ఎలాంటి సమస్యల్లేవు. కెప్టెన్ రోహిత్ టచ్‌లో ఉండగా, డికాక్ గాడిలో పడ్డాడు. ఇషాన్ కిషన్ సంచలన ప్రదర్శ కనబరుస్తున్నాడు. కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా స్లాగ్ ఓవర్లలో చెలరేగుతున్నారు. లాస్ట్ మ్యాచ్‌లో కృనాల్ కూడా సత్తా చాటాడు. బౌలింగ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్‌కు తోడుగా ప్యాటిన్సన్ కూడా చెలరేగిపోతున్నాడు. ఏకైక స్పిన్నర్‌గా కృనాల్ ఫర్వాలేదనిపిస్తున్నా.. రాహుల్ చాహర్ గాడిలో పడాల్సి ఉంది. ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతున్న ముంబై.. గత మ్యాచ్‌ల ప్రదర్శననే రిపీట్ చేస్తే తిరుగుండదు. ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగే అవకాశం ఉంది.

తుది జట్లు:
ముంబై ఇండియన్స్: క్వింటన్ డికాక్(కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషాన్, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, జేమ్స్ పాటిన్సన్, ట్రెంట్ బౌల్ట్, రాహుల్ చాహర్, జస్‌ప్రీత్ బుమ్రా
రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్(కీపర్), స్టీవ్ స్మిత్(కెప్టెన్), సంజూ శాంసన్, రాబిన్ ఊతప్ప, రాహుల్ తెవాటియా, మహిపాల్ లోమ్‌రోర్, రియాన్ పరాగ్/అంకిత్ రాజ్‌పుత్, టామ్ కరన్, జోఫ్రా ఆర్చర్, శ్రేయస్ గోపాల్, జయదేవ్ ఉనాద్కత్

పిచ్ రిపోర్ట్:
బ్యాటింగ్, బౌలింగ్ అనుకూలంగా ఉండే వికెట్. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు. రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా.. స్టార్ స్పోర్ట్స్ చానెల్స్, డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
ఆ ఒక్క తప్పిదమే మా కొంప ముంచింది: విరాట్ కోహ్లీ