కేకేఆర్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న దినేశ్ కార్తీక్.. కొత్త సారథి ఎవరంటే?

దుబాయ్: క్రికెట్ అభిమానులకు బ్రేకింగ్ న్యూస్.. కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి దినేశ్ కార్తీక్ తప్పుకున్నాడు. బ్యాటింగ్‌పై మరింత ఫోకస్ పెట్టేందుకు, జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాలనే ఉద్దేశంతో డీకే ఈ నిర్ణయం తీసుకున్నాడని టీమ్ టీమ్‌మేనేజ్‌మెంట్ తమ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ ఊహించని పరిణామంతో తాము షాక్‌కు గురయ్యామని, డీకే నిర్ణయాన్ని గౌరవిస్తామని కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ తెలిపారు. ఇక కేకేఆర్‌ను ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ నడిపిస్తాడని స్పష్టం చేశారు.

షాక్ అయ్యాం..
‘జట్టు విజయాలకే ప్రాధాన్యం ఇచ్చే దినేశ్ కార్తీక్ వంటి సారథులు ఉన్నందుకు మేం చాలా అదృష్టంగా ఫీలవుతున్నాం. ఇలాంటి నిర్ణయం తీసుకోవాలంటే ఎవరికైనా చాలా ధైర్యం ఉండాలి. అయితే డీకే ఆకస్మిక నిర్ణయంతో మాత్రం ఆశ్చర్యపోయాం. అతని కోరికను మేం గౌరవిస్తాం. ఇక 2019 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ జట్టులో ఉండటం కూడా మాకు కలిసొచ్చే అంశం. ఇప్పటి వరకు అతను వైస్ కెప్టెన్‌గా సేవలందించాడు. డీకేతో కలిసి అతను చాలా అద్భుతంగా పనిచేశారు. తదుపరి మ్యాచ్‌ల్లో ఇయాన్ మోర్గాన్ జట్టును ముందుండి నడిపించనున్నాడు. ఇది కేవలం బాధ్యతలను మార్చుకోవడమే. ఈ నిర్ణయయం మాకు కలిసొస్తుందని ఆశిస్తున్నాం. ఇక గత రెండున్నరేళ్లుగా డీకే కెప్టెన్‌గా జట్టుకు సేవలు అందించాడు. అతనికి జట్టు మేనేజ్‌మెంట్ తరఫున ధన్యవాదాలు. అలాగే ఇయాన్‌కు మంచే జరగాలని కోరుకుంటున్నాం'అని వెంకీ మైసూర్ చెప్పుకొచ్చారు.

కెప్టెన్‌ను మార్చాలని ఫ్యాన్స్ డిమాండ్..
ఇక సీజన్ ఆరంభమైనప్పటి నుంచే కేకేఆర్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి దినేశ్ కార్తీక్‌ను తప్పించాలనే డిమాండ్ వ్యక్తమైంది. వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ఉండగా డీకేను సారథిగా కొనసాగించడంలో ఎలాంటి అర్థం లేదనే అభిప్రాయం వ్యక్తమైంది. దానికి తగ్గట్లు డీకే పేలవ బ్యాటింగ్, కెప్టెన్‌గా మ్యాచ్‌ను చేజార్చే నిర్ణయాలు కూడా అతని సారథ్యంపై విమర్శలు వచ్చేలా చేశాయి. గత ఏడు మ్యాచ్‌ల్లో డీకే కింగ్స్ పంజాబ్‌తో చేసిన హాఫ్ సెంచరీ మినహా అన్నింట్లో దారుణంగా విఫలమయ్యాడు. దాంతో తీవ్ర ఒత్తిడికి గురైన అతను చివరకు కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌తోనే మోర్గాన్ సారథ్య బాధ్యతలను స్వీకరించనున్నాడు.

తప్పుకున్నాడా? తప్పించారా?
అయితే డీకేనే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడని టీమ్‌మేన్‌జ్‌మెంట్ ప్రకటించడంపై అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. తప్పుకున్నాడా? లేక తప్పించారా? అని ప్రశ్నిస్తున్నారు. ఘోరంగా విఫలమైనప్పుడే డీకే ఈ నిర్ణయం తీసుకునేవాడని, కానీ వరుస విజయాలందించి జట్టును రేసులో నిలిపిన తర్వాత ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంటాడని సందేహం వ్యక్తం చేస్తున్నారు. మేనేజ్‌మెంటే వేటు వేసి ఇలా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుందని కామెంట్ చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications