Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MIvsDC trolls:డక్ కింగ్ పృథ్వీ షా..ఛీటింగ్ అంటూ ముంబై‌పై కేకేఆర్ గుస్సా..నెట్టింట పేలుతున్న మీమ్స్!

IPL 2020, MI vs DC: Twitter Reactions after Mumbai Indians beat Delhi Capitals by 57 runs

హైదరాబాద్: బ్యాటింగ్‌‌, బౌలింగ్‌‌లో నువ్వా-నేనా అన్నట్లుగా ఉన్న రెండు మేటి జట్ల పోరాటంలో ముంబై ఇండియన్స్‌‌దే పైచేయి అయ్యింది. డిఫెండింగ్‌‌ చాంపియన్‌‌ హోదాకు తగ్గట్టుగా.. స్టార్ల విలువ తెలిసేట్టుగా.. క్వాలిఫయర్​-1లో మళ్లీ చెలరేగిపోయింది. ఆల్‌‌రౌండ్‌‌ షోతో అదరగొడుతూ.. గురువారం జరిగిన క్వాలిఫయర్‌‌-1లో బలమైన ఢిల్లీపై 57 రన్స్‌‌ భారీ తేడాతో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌పై అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమదైన వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. పృథ్వీ షా డక్ కింగ్, పాపం కోల్‌కతా అనే ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.

డక్ కింగ్ పృథ్వీ షా..

ఇక 201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిట్సల్స్ ఇన్నింగ్స్ సెకండ్ బాల్‌కే పృథ్వీ షా సిల్వర్ డక్‌గా వెనుదిరిగాడు. బౌల్ట్ వేసిన బంతిని అంచనా వేయలేకపోయిన షా.. కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే అజింక్యా రహానే(0) కూడా డకౌట్‌గానే వెనుదిరిగాడు. తర్వాత బుమ్రా బౌలింగ్‌లో ధావన్ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. దాంతో షాపై నెటిజన్లు ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. డక్ కింగ్ అని, పాంటింగ్ బడితె పూజకు దొరకకుండా తప్పించుకుంటున్నాడని కామెంట్ చేస్తున్నారు. టీమిండియా సెలెక్టర్లు కూడా షాను ఎంపిక చేసినందుకు తెగ ఫీలవుతున్నారని కామెంట్ చేస్తున్నారు.

పాపం కోల్‌కతా..

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌‌ను లైట్ తీసుకున్న ముంబై.. ఆ మ్యాచ్‌కు బుమ్రా, బౌల్ట్, హార్దిక్ పాండ్యాకు విశ్రాంతినిచ్చింది. ఫలితంగా ఆ మ్యాచ్‌లో 10 వికెట్లతో చిత్తుగా ఓడింది. దాంతో మెరుగైన రన్ రేట్ కారణంగా హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరగా.. కోల్‌కతా ఇంటి దారి పట్టింది. అయితే తాజా మ్యాచ్‌లో రఫ్ఫాడించిన ముంబై సునాయస విజయాన్నందుకొని ఫైనల్ చేరింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఆటను చూసి కోల్‌కతా తెగ ఫీలవుతుందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. చీటింగ్ అంటూ కోల్‌కతా గుస్సా అవుతుందనే మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.

హేటర్స్ బర్నల్ రాసుకోండి..

ఇక ఈ అద్భుత విజయంపై ముంబై అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ శర్మను కొనియాడుతున్నారు. టైటిల్ గెలవడం ఖాయం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ముంబైని విమర్శించే అభిమానులకు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. హేటర్స్ ఈ విజయంతో మీకు ఎక్కడో కాలుతున్నట్లుంది, బర్నర్ రాసుకోండని కామెంట్ చేస్తున్నారు.

బుమ్రా బెస్ట్ స్పెల్...

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులు చేసింది. ఇషాన్‌ కిషన్‌ (30 బంతుల్లో 55 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) సూర్య కుమార్‌ యాదవ్‌ (38 బంతుల్లో 51; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా అర్ధసెంచరీలు సాధించారు. ఆఖర్లో హార్దిక్‌ పాండ్యా (14 బంతుల్లో 37 నాటౌట్‌; 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు.

వీరి ప్రతాపానికి అశ్విన్‌ (3/29) ప్రదర్శన చిన్నబోయింది. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులే చేయగలిగింది. స్టొయినిస్‌ (46 బంతుల్లో 65; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), అక్షర్‌ పటేల్‌ (33 బంతుల్లో 42; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. బుమ్రా (4/14) పొట్టి ఫార్మాట్‌లో ఉత్తమ గణాంకాలు నమోదు చేశాడు.

హ్యాపీ బర్త్ డే పిచ్చి పిల్లా.. ప్రేయసికి కేఎల్ రాహుల్ విషెస్!

Story first published: Friday, November 6, 2020, 13:58 [IST]
Other articles published on Nov 6, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+