ప్రేయర్ ఆంటీ సర్‌ప్రైజ్..
ఐపీఎల్‌లో ముంబై మ్యాచ్ ఉన్న ప్రతీసారి స్టాండ్స్‌లో ఓ మధ్యవయస్కురాలైన మహిళ చేతిలో పుస్తకం పట్టుకోని దేవుణ్ణి ప్రార్ధిస్తుంది. ఆమె ముంబై అభిమానులందరికీ సుపరిచతమే. ముద్దుగా ఆమెను ‘ప్రేయర్ ఆంటీ'అని పిలుస్తుంటారు. అయితే కోవిడ్-19 నేపథ్యంలో ఈ సీజన్‌లో మ్యాచ్‌లకు హాజరు కానీ ఆమె ఉన్నట్లుండి మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌కు హాజరై సర్‌ప్రైజ్ ఇచ్చింది. మళ్లీ చేతిలో పుస్తకం పట్టుకొని మ్యాచ్ ముగిసేవరకు ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉంది.
2017లో తొలిసారి..
2017 ఐపీఎల్ సీజన్ ఫైనల్లో తొలిసారి ఆమె అందరి దృష్టి ఆకర్షించింది. పుణె సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో ఆ జట్టు విజయానికి ఆఖరి 5 బంతుల్లో 7 పరుగులు కావాలి. ఈ థ్రిల్లింగ్‌ను చూడలేకపోయిన ప్రేయర్ ఆంటీ కళ్లను మూసుకొని దేవుణ్ణి ప్రార్థించింది. ఈ సీన్‌ను టీవీ కెమెరాలు పదే పదే చూపించడంతో ఆమె పాపులర్ అయింది. ఆ మ్యాచ్‌లో ముంబై అద్భుత విజయాన్నందుకోవడంతో ప్రేయర్ ఆంటీ రాత్రికి రాత్రే ఓ స్టార్ అయింది. అభిమానుల మదిలో అలా నిలిచిపోయింది. అప్పటి నుంచి ప్రతీ సీజన్‌లో ఆమె మ్యాచ్‌క హాజరవుతూ జట్టుకు మద్దతు తెలిపింది.

ప్రపంచానికి పరిచయం చేసిన అభిషేక్
ఆ మ్యాచ్ అనంతరం ప్రేయర్ ఆంటీ పాపులర్ కావడంతో బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ఆమెను ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆమెకు సంబంధించిన వివరాలను ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. ఆమె ఎవరో కాదని ముంబై ఇండియన్స్ ఓనర్ నీతూ అంబాని తల్లి అని తెలియజేశాడు. టీమ్‌కు లక్కీ చామ్‌గా మారిన ఆమె పేరు పూర్ణిమా దాలాల్. ప్రముఖ వ్యాపార వేత్త ముఖేల్ అంబానీ అత్త. ఇక తమ కూతురి టీమ్ విజయం కోసం దుబాయ్‌కు వచ్చిన ఆమెకు అభిమానులు థ్యాంక్స్ చెబుతున్నారు. ఫైనల్లో కూడా ఆమె అవసరం జట్టుకు ఉందని కామెంట్ చేస్తున్నారు.

మ్యాచ్ జరుగుతుండగానే..
ఇక మ్యాచ్ జరుగుతుండగానే ఆమె ప్రార్థనలను టీవీలో చూసిన ముంబై అభిమానులు విజయం పక్కా అనే ధీమా వ్యక్తం చేశారు. ప్రేయర్ ఆంటీ వచ్చేసింది.. ముంబై విజయం ఖాయమని కామెంట్ చేశారు. ఢిల్లీ మీకు కష్టమే.. అక్కడ ప్రేయర్ ఆంటీ ఉందని ఇంకొందరూ ట్వీట్లు చేశారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (30 బంతుల్లో 55 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) సూర్య కుమార్ యాదవ్ (38 బంతుల్లో 51; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా అర్ధసెంచరీలు సాధించారు. ఆఖర్లో హార్దిక్ పాండ్యా (14 బంతుల్లో 37 నాటౌట్; 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. వీరి ప్రతాపానికి అశ్విన్ (3/29) ప్రదర్శన చిన్నబోయింది. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులే చేయగలిగింది.
MI vs DC: ఇందుకే కదా రోహిత్ శర్మను బెస్ట్ కెప్టెన్ అనేది (వీడియో)


Click it and Unblock the Notifications
