For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

MI vs DC: ఇందుకే కదా రోహిత్ శర్మ‌ను బెస్ట్ కెప్టెన్ అనేది (వీడియో)

IPL 2020, MI vs DC: Rohit Sharma’s wonderful gesture for Rahul Chahar after the youngster had a rough day in Qualifier 1

దుబాయ్: ఐపీఎల్ 2020 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఫైనల్‌కు చేరింది. గురువారం ఏకపక్షంగా సాగిన ఎలిమినేటర్ 1 మ్యాచ్‌లో 57 పరుగులతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది. అయితే ఈ మ్యాచ్‌‌లో బ్యాటింగ్‌లో విఫలమైనా రోహిత్ తన సూపర్ కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. పరిస్థితులకు తగ్గట్లు బౌలర్లను ఊపయోగిస్తూ ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బతీశాడు. ఆటగాళ్లు విఫలమైనా రోహిత్ వారిని ఎలా ప్రోత్సహిస్తాడనే విషయం ఈ మ్యాచ్‌లో స్పష్టమైంది. దానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. తనను ఎందుకు బెస్ట్ కెప్టెన్ అంటారో తెలిసేలా ఉన్న ఈ వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

ఇంతకీ విషయం ఏంటంటే..?

ముంబై ఇండియన్స్ స్పిన్నర్ రాహుల్ చాహర్ ఈ టోర్నీ ఆసాంతం రాణించాడు. ప్రతీ మ్యాచ్‌లో వికెట్ తీస్తూ జట్టు విజయాల్లో తనవంతు పాత్ర పోషించాడు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్ మాత్రం అతనికి కాల రాత్రిని మిగిల్చింది. ఈ మ్యాచ్‌లో రెండు ఓవర్లు వేసిన చాహర్‌ను మార్కస్ స్టోయినిస్ చితక్కొట్టాడు. 9వ ఓవర్‌లో రెండు సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 19 పరుగులు సమర్పించుకున్న చాహర్.. 13వ ఓవర్‌లో రెండు ఫోర్లు, సిక్స్‌తో 16 పరుగులు ఇచ్చుకున్నాడు. తమ బౌలింగ్ విభాగం అంతా చెలరేగిన వేళ చాహర్ దారుణంగా విఫలమయ్యాడు.

తడబడినా అందుకున్నాడు..

తడబడినా అందుకున్నాడు..

ఇక ఫీల్డింగ్‌లో కూడా చాహర్ తడబడ్డాడు. ఢిల్లీ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో డీప్ మిడ్ వికెట్ మీదుగా అక్షర్ పటేల్ భారీ షాట్ ఆడగా.. రాహుల్ చాహర్ ఈ క్యాచ్ అందుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. నాలుగు సార్లు బంతి చేజారినా ఎట్టకేలకు అందుకొని ఊపిరి పీల్చుకున్నాడు. ఇక రాహుల్ చాహర్ పరిస్థితిని చూసిన రోహిత్ నవ్వు ఆపుకోలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో అక్షర్‌కు సానుకూల అంశం ఏదైనా ఉందంటే ఈ ఒక్క క్యాచ్ మాత్రమే. అయితే రాహుల్ చాహర్ విఫలమైనా రోహిత్ అతనికి గౌరవమిచ్చాడు. ఆటలో ఇవన్నీ సహజమని ఈ యువ క్రికెటర్‌కు భరోసా కల్పించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లే క్రమంలో రాహుల్ చాహర్‌ను ముందుండి నడవాలని సూచించాడు. దాంతో ‘నువ్వు విఫలమైనా మేమంతా నీ వెనుకే ఉన్నాం'అని చెప్పకనే చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

ఫ్యాన్స్ ఫిదా..

ఫ్యాన్స్ ఫిదా..

ఇక రోహిత్ చర్యపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హిట్ మ్యాన్ విఫలమైనా కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడని, అతను జట్టులో ఉంటే వచ్చే ఏనర్జీనే వేరని కామెంట్ చేస్తున్నారు. మరికొందరేమో ఇందుకే కదా రోహిత్‌ను బెస్ట్ కెప్టెన్ అనేదని కొనియాడుతున్నారు. ఈ తరహా వ్యక్తిత్వంతోనే రోహిత్ నాలుగు టైటిళ్లు అందించాడని ప్రశంసిస్తున్నారు. అందుకే రోహిత్‌కు తామంత అభిమానులం అయ్యామని మరికొందరూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ సీజన్‌లో రాహుల్ చాహర్ 15 మ్యాచ్‌ల్లో 8.16 ఎకానమీతో 15 వికెట్లు తీశాడు.

బూమ్ బూమ్ బుమ్రా..

బూమ్ బూమ్ బుమ్రా..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులు చేసింది. ఇషాన్‌ కిషన్‌ (30 బంతుల్లో 55 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) సూర్య కుమార్‌ యాదవ్‌ (38 బంతుల్లో 51; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా అర్ధసెంచరీలు సాధించారు. ఆఖర్లో హార్దిక్‌ పాండ్యా (14 బంతుల్లో 37 నాటౌట్‌; 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు.

వీరి ప్రతాపానికి అశ్విన్‌ (3/29) ప్రదర్శన చిన్నబోయింది. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులే చేయగలిగింది. స్టొయినిస్‌ (46 బంతుల్లో 65; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), అక్షర్‌ పటేల్‌ (33 బంతుల్లో 42; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. బుమ్రా (4/14) పొట్టి ఫార్మాట్‌లో ఉత్తమ గణాంకాలు నమోదు చేశాడు.

Story first published: Friday, November 6, 2020, 9:52 [IST]
Other articles published on Nov 6, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+