న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌తో టీ20 ప్రపంచకప్‌కు ఎసరు.. ఆసీస్ ఆటగాళ్లకు సీఏ కీలక సూచన!

IPL 2020 looks likely with increasing doubts over T20 World Cup

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 సీజన్ జరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) బాస్ సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలు.. మెగా టోర్నీ నిర్వహణపై క్రికెట్ ఆస్ట్రేలియా చేతులెత్తేయడం చూస్తే క్యాష్ రిచ్ లీగ్‌కు మార్గం సుగుమమైనట్లేననిపిస్తోంది. అంతేకాకుండా ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఇంగ్లండ్ టూర్ అనంతరం ఐపీఎల్ కోసం సిద్దంగా ఉండాలని ఆ దేశ క్రికెట్ బోర్డు తెలపడం కూడా ఈ వాదనకు బలం చేకూరుస్తోంది.

క్రికెట్ ఆస్ట్రేలియా సూచన

క్రికెట్ ఆస్ట్రేలియా సూచన

టీ20 ప్రపంచకప్ వాయిదా ప్రకటన కోసం ఎదురు చూస్తున్న బీసీసీఐ.. ఆ విండోలో ఐపీఎల్ నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఐపీఎల్ ఎక్కడా, ఎప్పుడు జరిగినా.. రెడీగా ఉండాలని క్రికెట్ ఆస్ట్రేలియా తమ ఆటగాళ్లకు సూచించినట్లు తెలుస్తోంది. ఇక భారత్‌లో జరిగే పరిస్థితి లేకుంటే తాము ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని యూఏఈ, శ్రీలంక క్రికెట్ బోర్డులు ముందుకువచ్చిన విషయం తెలిసిందే.

న్యూజిలాండ్ కూడా రెడీగా ఉందని వార్తలు వచ్చినా అవి ఒట్టి పుకార్లేనని తేలిపోయింది.‘ఐపీఎల్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు న్యూజిలాండ్ సిద్దంగా ఉందని వచ్చిన వార్తలన్నీ పుకార్లే. ఈ లీగ్ నిర్వహణపై మేం ఎలాంటి ఆసక్తి కనబర్చలేదు. ఎవరిని సంప్రదించలేదు.'అని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధికార ప్రతినిధి రిచర్డ్ బూక్ తెలిపారు.

ఐపీఎల్ జరగం పక్కా..

ఐపీఎల్ జరగం పక్కా..

ఇక కరోనా కారణంగా నిరవధికంగా వాయిదాపడిన ఐపీఎల్ 2020 సీజన్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్వహిస్తామని గంగూలీ బుధవారం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. భారత్‌లో నిర్వహించడమే తమ తొలి ప్రాధాన్యత అన్న దాదా.. ఐపీఎల్ లేకుండా 2020 ముగియదని స్పష్టం చేశాడు. ‘ఎట్టి పరిస్థితుల్లో ఐపీఎల్‌ నిర్వహించాలనే అనుకుంటున్నాం. క్రికెట్‌ రిస్టార్ట్ కావాల్సిందే. ప్రస్తుతానికి ఖాళీనే. మార్చిలోనే దేశవాళీ షెడ్యూలును పూర్తిచేశాం. ఆ తర్వాత నిర్వహించాల్సిన ఐపీఎల్ కరోనా వల్ల వాయిదా పడింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌పై స్పష్టతవస్తే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం' అని ఇండియాటుడే ఇంటర్వ్యూలో దాదా చెప్పుకొచ్చాడు.

ఇప్పుడే ఏం చెప్పలేం..

ఇప్పుడే ఏం చెప్పలేం..

‘ఐపీఎల్ లీగ్‌లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ పెద్ద జట్లు. అయితే ఆ నగరాల్లో ప్రస్తుతం కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో గుండెమీద చేయి వేసి ఈ నగరాల్లో క్రికెట్‌ జరుగుతుందని చెప్పలేం. మేం అహ్మదాబాద్‌ వెళ్లి కొత్త స్టేడియం చూద్దామనే ఆసక్తితో ఉన్నాం. మేం అక్కడికి చేరుగలమో లేదో తెలియదు. భారత్‌లో ఐపీఎల్‌ నిర్వహిస్తామని ఇప్పుడే స్పష్టతనివ్వడం కుదరదు' అని దాదా తెలిపాడు.

ఐసీసీకి ఇది తగదు..

ఐసీసీకి ఇది తగదు..

ఇక ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు ఒత్తిడికి గురవుతున్నారన్న బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధూమల్ తెలిపాడు. ఇక ఆతిథ్య దేశమే చేతులెత్తేసినప్పుడు టీ20 ప్రపంచకప్ వాయిదా నిర్ణయాన్నిప్రకటించకపోవడం ఐసీసీకి తగదన్నాడు. ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటే ప్రపంచ క్రికెట్ అంతమంచిదన్నాడు.

ఎవడ్రా అక్కడ మ్యాచ్ పెట్టింది.. ఇంగ్లండ్-వెస్టిండీస్ తొలి టెస్ట్‌పై పేలుతున్నజోకులు, మీమ్స్.!

Story first published: Thursday, July 9, 2020, 15:20 [IST]
Other articles published on Jul 9, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X