For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KXIP vs SRH trolls: మనోళ్లు కూడా అస్సాం ట్రైన్ ఎక్కేసారుగా.. నెట్టింట పేలుతున్న జోక్స్

IPL 2020, KXIP vs SRH: Twitter reactions and Funny Mems on Kings XI Punjab defeating Sunrisers Hyderabad

హైదరాబాద్: ఐపీఎల్ 2020లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పోరాటం ముగిసింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో శనివారం జరిగిన చావో రేవో మ్యాచ్‌లో వార్నర్ సేన 12 పరుగులతో ఓటమిపాలైంది. దాంతో ప్లే ఆఫ్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించింది. అద్భుతాలు జరిగితే తప్పా ఆరెంజ్ ఆర్మీకి అవకాశం లేదు. అయితే సులువుగా గెలిచే మ్యాచ్‌లో ఓడటాన్ని హైదరాబాద్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం హైదరాబాద్ ఓటమిపై ఫన్నీ మీమ్స్, కామెంట్స్‌‌ను ట్రెండ్ చేస్తున్నారు. కామిక్ వీడియోలతో నవ్వులు పూయిస్తున్నారు.

అస్సాం ట్రైన్ ఎక్కేసాం కదా..

చెన్నై సూపర్ కింగ్స్ తరహాలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకుందని, అస్సాం ట్రైన్ ఎక్కేసిందని జోకులు పేల్చుతున్నారు. రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ ‘వెంకీ' సినిమాలో కామెడీ సీన్‌ను స్పూఫ్ చేశారు. ట్రైన్‌లో కామెడియన్ బ్రహ్నానందంతో రవితేజ జరిపే సంభాషణను ఫన్నీగా హైదరాబాద్, చెన్నై కన్వర్జేషన్‌గా మార్చారు. ప్రస్తుతం ఈ స్పూఫ్ వీడియో నవ్వులు పూయిస్తుంది.

ముంచేసారు కదరా..

ఇక 127 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ ఓ దశలో 100/3తో పటిష్టస్థితిలో నిలిచింది. మరో 24 బంతుల్లో 27 పరుగులు చేస్తే చాలు... కానీ ఇలాంటి స్థితి నుంచి కూడా హైదరాబాద్‌ పరాజయాన్ని వెతుక్కుంటూ వెళ్లింది. 23 బంతుల్లో మిగిలిన 7 వికెట్లు చేజార్చుకొని కుప్పకూలింది. అయితే గెలిపిస్తారనుకున్న మ్యాచ్‌లో మిడిలార్డర్, లోయరార్డర్ బ్యాట్స్‌మెన్ ముంచేశారని, కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ను తడిబట్టేసుకునేలా చేశారని కామెంట్ చేస్తున్నారు. తడిబట్ట వేసుకొని కూర్చున్న వార్నర్ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.

కుంబ్లే నీవు ఎవరి కోచ్..

ఇక ఈ మ్యాచ్‌కు ముందు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కోచ్ అనిల్ కుంబ్లే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టిప్స్ ఇస్తూ కనిపించాడు. ఈ ఫొటోపై అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘కుంబ్లే.. నువ్వు పంజాబ్ కోచ్‌వా లేక హైదరాబాద్ కోచ్‌వా?'అని ఒకరంటే.. రాహుల్‌కు వెన్నుపోటు పొడిచేందుకే కుంబ్లే ఉన్నాడనే మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.

పండుగ పంజాబ్‌దే..

ఇక దసరా ముందు రోజు జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఓడిపోవడంతో పండుగ పంజాబ్‌దేనని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 126 పరుగులే చేయగలిగింది. నికోలస్‌ పూరన్‌ (28 బంతుల్లో 32 నాటౌట్‌; 2 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. రషీద్‌ ఖాన్‌ (2/14) కింగ్స్‌ ఎలెవన్‌ బ్యాట్స్‌మెన్‌ పని పట్టగా... హోల్డర్, సందీప్‌ కూడా చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 19.5 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌటైంది. డేవిడ్‌ వార్నర్‌ (20 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే దూకుడుగా ఆడాడు. 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' క్రిస్‌ జోర్డాన్‌ (3/17), అర్ష్‌దీప్‌ సింగ్‌ (3/23) పంజాబ్‌ గెలుపులో కీలక పాత్ర పోషించారు.

KXIP vs SRH: ఈ ఓటమిని మరిచిపోవడం మంచింది: డేవిడ్ వార్నర్

Story first published: Sunday, October 25, 2020, 9:10 [IST]
Other articles published on Oct 25, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+