
దుబాయ్: కింగ్స్ఎలెవన్ పంజాబ్‌తో గెలిచే మ్యాచ్‌లో ఓడటం బాధించిందని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అన్నాడు. కానీ ఈ మ్యాచ్‌ను ఎంత త్వరగా మరిచిపోతే అంత మంచిదన్నాడు. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 12 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ను ఓడించింది. 127 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన ఆరెంజ్ ఆర్మీ ఓ దశలో 100/3తో పటిష్టస్థితిలో నిలిచింది.
మరో 24 బంతుల్లో 27 పరుగులు చేస్తే చాలు... కానీ ఇలాంటి స్థితి నుంచి కూడా హైదరాబాద్ పరాజయాన్ని వెతుక్కుంటూ వెళ్లింది. 23 బంతుల్లో మిగిలిన 7 వికెట్లు చేజార్చుకొని కుప్పకూలింది. కట్టుదిట్టమైన బౌలింగ్, చక్కటి ఫీల్డింగ్‌కు తోడు ఓటమిని అంగీకరించని తత్వం, పట్టుదలతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అనూహ్య విజయాన్ని అందుకుంది.
అయితే ఈ మ్యాచ్ అనంతరం ఈ ఓటమిపై స్పందించిన హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బౌలర్లు అద్భుతంగా రాణించినా.. శుభారంభం దక్కినా గెలవలేకపోయామన్నాడు.'ఈ అనూహ్య ఓటమి తీవ్రంగా హర్ట్ చేసింది. మా బౌలర్లు పంజాబ్‌ను అద్భుతంగా కట్టడి చేశారు. మాకు దక్కిన శుభారంభంతో మాదే విజయం అనుకున్నాం. కానీ నెమ్మదైన ఈ వికెట్‌పై స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం చాలా కష్టమైంది.
ఒత్తిడి లేకుండా.. స్వింగ్‌ను తిరస్కరించి ఆడాలనుకున్న మా ప్రణాళికలు ఫలించలేదు. పంజాబ్ బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేశారు. మొదట్లో వికెట్లు రాకున్నా.. చివర్లో చెలరేగి ఫలితం రాబట్టారు. మా బౌలర్లు కూడా ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించారు. వారి ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నా. ఈ మ్యాచ్‌ను మరిచిపోయి ముందుకువెళ్లడమే మేం చేయాల్సింది'అని వార్నర్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 126 పరుగులే చేయగలిగింది. నికోలస్ పూరన్ (28 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రషీద్ ఖాన్ (2/14) కింగ్స్ ఎలెవన్ బ్యాట్స్‌మెన్ పని పట్టగా... హోల్డర్, సందీప్ కూడా చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 19.5 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌటైంది. డేవిడ్ వార్నర్ (20 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే దూకుడుగా ఆడాడు. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' క్రిస్ జోర్డాన్ (3/17), అర్ష్‌దీప్ సింగ్ (3/23) పంజాబ్ గెలుపులో కీలక పాత్ర పోషించారు.