KXIP vs SRH: మ్యాచ్ టర్నింగ్ పాయింట్.. హైదరాబాద్ ఓటమికి కారణాలు ఇవే!

దుబాయ్: ఐపీఎల్-2020లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అనూహ్య ఫలితం ఎదురైంది. గెలవాల్సిన స్థితిలో ఉండి కూడా హైదరాబాద్ జట్టు చేజేతులా ఓటమిని ఆహ్వానించింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ ఓడింది. 127 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆరెంజ్ ఆర్మీ.. ఓ దశలో 100/3 స్కోర్‌తో విజయం దిశగా దూసుకెళ్లింది. మరో 24 బంతుల్లో 27 పరుగులు చేస్తే చాలు... కానీ ఇలాంటి స్థితి నుంచి కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ పరాజయాన్ని వెతుక్కుంటూ వెళ్లింది. 23 బంతుల్లో మిగిలిన 7 వికెట్లు చేజార్చుకొని కుప్పకూలింది.
కట్టుదిట్టమైన బౌలింగ్, చక్కటి ఫీల్డింగ్‌కు తోడు ఓటమిని అంగీకరించని తత్వం, పట్టుదలతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అనూహ్య విజయాన్ని అందుకుంది. ఈ సీజన్‌లో అనేక మ్యాచ్‌లలో చివరి క్షణం వరకు తీవ్ర ఉత్కంఠను అనుభవించిన రాహుల్ సేన కీలక సమయంలో ఒత్తిడిని తట్టుకొని సగర్వంగా నిలబడింది. ఓటమి ఖాయమైన మ్యాచ్‌ను గెలుచుకొని సత్తా చాటింది. తాజా ఫలితం సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను బాగా దెబ్బ తీసింది. మనీష్ పాండే వికెట్ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ కాగా.. హైదరాబాద్ మూడు తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది.
స్టన్నింగ్ క్యాచ్‌తో మ్యాచ్ టర్నింగ్..
హైదరాబాద్ ఇన్నింగ్స్ 17వ ఓవర్ తొలి బంతికి క్రిస్ జోర్డాన్ బౌలింగ్‌లో మనీష్ పాండే ఔటవ్వడంతో ఆరెంజ్ ఆర్మీ పతనం మొదలైంది. సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ సుచిత్ స్టన్నింగ్ క్యాచ్‌తో మ్యాచ్ పంజాబ్ వైపు టర్న్ అయింది. పాండే లాంగాన్ భారీ షాట్ ఆడగా.. బంతి సిక్సర్‌గా దూసుకెళ్లింది. అంతా సిక్స్ అని భావించారు. కానీ ఆ దిశలో ఫీల్డింగ్ చేస్తున్న సూచిత్ సూపర్ రన్నింగ్‌తో గాల్లో ఎగిరి బంతిని అద్భుతంగా అందుకున్నాడు. దాంతో పాండే నిరాశగా వెనుదిరిగాడు. తర్వాతి ఓవర్లో శంకర్ వెనుదిరగ్గా, 19వ ఓవర్లో రెండు, 20వ ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ ఓటమికి తలవంచింది.

నిర్లక్ష్యంగా వికెట్లు చేజార్చుకోవడం..
పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసిన హైదరాబాద్ అద్భుత విజయాన్నందుకుంది. అయితే ఈ స్థితిలో స్ట్రైక్ రొటేట్ చేయాల్సిన బ్యాట్స్‌మెన్ అనవసర షాట్లకు యత్నించి మూల్యం చెల్లించుకున్నారు. ముఖ్యంగా బ్యాటింగ్‌కు ప్రతికూలంగా మారిన పిచ్‌పై బాధ్యత మరిచి గతి తప్పారు. క్విక్ సింగిల్స్, డబుల్సతో గెలిచే టార్గెట్‌ను.. భారీ షాట్లకు పోయి చేధించలేకపోయారు. దాంతో గెలిచే మ్యాచ్‌లో హైదరాబాద్‌కు ఓటమి తప్పలేదు. నిదానంగా ఆడుతూ.. స్ట్రైక్ రొటేట్ చేస్తే ఫలితం మరోలా ఉండేది.

భారత ఆటగాళ్ల చెత్త బ్యాటింగ్..
డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో సూపర్ బ్యాటింగ్‌తో హైదరాబాద్ మంచి ఆరంభం అందుకున్నా.. మిడిలార్డర్, లోయారార్డర్ వైఫల్యంతో విజయాన్నందుకోలేకపోయింది. ముఖ్యంగా ఈ జట్టులో భారత ఆటగాళ్లు కనీసం బాధ్యత లేకుండా ఆడారు. చెత్త బ్యాటింగ్‌తో విసుగు తెప్పించారు. గత మ్యాచ్ గెలిపించిన మనీష్ పాండే, విజయ్ శంకర్ పూర్తిగా తేలిపోయారు. అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉన్నా.. క్రిజులో నిలదొక్కుకున్న తర్వాత కూడా నిర్లక్ష్యమైన ఆటతీరుతో పెవిలియన్ చేరారు. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు క్రీజులో నిలిచినా హైదరాబాద్ గెలిచేది.

బెడిసి కొట్టిన ప్రయోగాలు..
చావో రేవో మ్యాచ్‌లో అనవసర ప్రయోగాలకు పోయిన హైదరాబాద్.. అవి బెడిసికొట్టడంతో ఓటమిపాలైంది. మంచి ఆరంభం లభించిందన్న ఆనందంలో... త్వరగా ముగించాలనే ఆతృతతో ఫినిషర్ అబ్డుల్ సమద్‌ను ముందుకు పంపించి మూల్యం చెల్లించుకుంది. అంతేకాకుండా ఇతర బ్యాటింగ్ ఆర్డర్ మార్పులు కూడా జట్టు విజయవకాశాలను దెబ్బతీశాయి. ఎలాంటి మార్పుల్లేకుండా ఎప్పటిలానే ఆడితే హైదరాబాద్‌కు ఈ పరిస్థితి వచ్చేది కాదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
KXIP vs SRH: ఈ ఓటమిని మరిచిపోవడం మంచింది: డేవిడ్ వార్నర్