మన్‌దీప్ తండ్రికి అంకితం..
అయితే అద్భుత విజయాన్ని పంజాబ్ టీమ్ మన్‌దీప్ సింగ్ తండ్రికి అంకితమిచ్చింది. శుక్రవారం ఆయన మరణించారు. అయినా జట్టు కోసం మన్‌దీప్ మ్యాచ్ ఆడాడు. తండ్రి కడచూపునకు కూడా నోచుకోలేకపోయాడు. అతనికి సంఘీభావంగా జట్టులోని ఆటగాళ్లంతా బ్లాక్ రిబ్బన్స్‌తో బరిలోకి దిగారు. విజయానంతరం సంబరాలు చేసుకోకుండా ఆకాశం వైపు చూపిస్తూ మన్‌దీప్ తండ్రికి ఘనంగా నివాళులర్పించారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇక కింగ్స్ పంజాబ్ ఫ్రాంచైజీ కూడా ఈ విజయాన్ని మన్‌దీప్ తండ్రికి అంకితమిస్తున్నట్లు ట్విటర్ వేదికగా ప్రకటించింది.
మన్‌దీప్‌పై ప్రశంసలు..
ఇక తండ్రి మరణించినా.. వెళ్లకుండా జట్టు కోసం ఆడిన మన్‌దీప్ సింగ్‌పై యావత్ క్రికెట్ ప్రపంచం ప్రశంసల జల్లు కురిపించింది. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నుంచి సామన్య అభిమాని వరకు మన్‌దీప్ అంకితభావాన్ని మెచ్చుకున్నారు. మయాంక్ అగర్వాల్ గాయం కారణంగా అవకాశాన్ని అందుకున్న మన్‌దీప్ రాణించలేకపోయాడు. 17 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.

పంజాబ్‌దే పండుగు..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 126 పరుగులే చేయగలిగింది. నికోలస్ పూరన్ (28 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రషీద్ ఖాన్ (2/14) కింగ్స్ ఎలెవన్ బ్యాట్స్‌మెన్ పని పట్టగా... హోల్డర్, సందీప్ కూడా చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 19.5 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌటైంది. డేవిడ్ వార్నర్ (20 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే దూకుడుగా ఆడాడు. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' క్రిస్ జోర్డాన్ (3/17), అర్ష్‌దీప్ సింగ్ (3/23) పంజాబ్ గెలుపులో కీలక పాత్ర పోషించారు.

నితీష్ రాణా కూడా..
ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాట్స్‌మెన్ నితీష్ రాణా తనకు పిల్లనిచ్చిన మామ అకాల మరణానికి హాఫ్ సెంచరీతో నివాళులర్పించాడు. హాఫ్ సెంచరీ పూర్తయిన వెంటనే తన మామ సురిందర్ పేరు రాసి ఉన్న జెర్సీని చూపించి సంతాపం ప్రకటించారు. నితీష్ మామ కూడా శుక్రవారమే మరణించారు.


Click it and Unblock the Notifications

డబుల్ హ్యాపీ.. మా విజయంలో వారి పాత్ర కీలకం: కేఎల్ రాహుల్










