Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KXIP vs KKR: గేల్ రాకతో పంజాబ్ జిగేల్‌మంటుందా? కోల్‌కతా జోరుకు బ్రేక్‌లు వేస్తుందా?

https://telugu.mykhel.com/cricket/ipl-2020-commentary-box-was-divided-over-rishabh-pant-s-run-out-against-rr-030803.html

అబుదాబి: వీకెండ్‌‌ వచ్చేసింది. క్రికెట్‌‌ ఫ్యాన్స్‌‌ కోసం ఐపీఎల్‌‌లో మరో డబుల్‌‌ హెడర్‌‌ సిద్ధమైంది. శనివారం మధ్యాహ్నం జరిగే ఫస్ట్‌‌ మ్యాచ్‌‌లో కోల్‌‌కతా నైట్‌‌రైడర్స్‌‌ వరుస ఓటములతో కష్టాల్లో ఉన్న కింగ్స్‌‌ ఎలెవెన్‌‌ పంజాబ్‌‌కు సవాల్‌‌ విసరనుంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం అట్టడుగు స్థానంలో ఉన్న పంజాబ్‌‌ ప్లే ఆఫ్‌‌ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాలి. మరోవైపు స్టార్లతో నిండి ఉన్న కోల్‌కతా ఐదింటిలో మూడు గెలిచి నాలుగో స్థానంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. దీంతో ఈ పోరు రసవత్తరంగా మారనుంది. గేల్ అందుబాటులోకి వస్తున్న ఈ మ్యాచ్‌లో పంజాబ్ జిగేల్‌మంటుందా? లేక కోల్‌కతా జోరుకు కొట్టుకుపోతుందా? చూడాలి!

పంజాబ్‌కు చావో రేవో..

పంజాబ్‌కు చావో రేవో..

కింగ్స్ పంజాబ్ జట్టు ఆడిన గత 6 మ్యాచ్‌ల్లో 5 ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగుస్థానంలో ఉంది. ఈ ఐదు మ్యాచ్‌ల్లో పంజాబ్ ప్రదర్శన మరి అధ్వాన్నంగా ఏం లేదు. చెన్నై, హైదరాబాద్ మినహా మిగతా మూడు మ్యాచ్‌ల్లో గెలుపు ముంగిట చేతులెత్తేసింది. ఆల్‌రౌండర్లు రాణించలేకపోవడం, బౌలింగ్ వైఫల్యం ఆ జట్టును వెంటాడుతుంది. అయితే సన్‌‌రైజర్స్‌ హైదరాబాద్‌తో గత మ్యాచ్‌‌లో 69 రన్స్‌‌ తేడాతో ఓడి మరింత డీలా పడిన పంజాబ్‌‌ విజయం సాధించడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా యంగ్‌‌స్టర్స్‌‌, సీనియర్స్‌‌తో నిండిన కేకేఆర్‌‌పై గెలవాలంటే పంజాబ్‌‌ ప్లేయర్లు ప్రాణం పెట్టి ఆడాల్సిందే.

మరోవైపు పంజాబ్‌‌ బ్యాటింగ్‌‌ అంతా కెప్టెన్‌‌ కేఎల్‌‌ రాహుల్‌‌, మయాంక్‌‌ అగర్వాల్‌‌పై ఆధారపడి ఉంది. వీరికి తోడు నికోలస్‌‌ పూరన్‌‌ చెలరేగుతున్నాడు. ఫుడ్‌‌ పాయిజన్‌‌ వల్ల ఇబ్బంది పడుతున్న క్రిస్‌‌ గేల్‌‌ కోలుకుంటే అతను ఈ మ్యాచ్‌‌లో బరిలో దిగే చాన్సుంది. బ్యాటింగ్‌‌ లైనప్‌‌ బాగానే ఉన్నా బౌలింగ్‌‌ పంజాబ్​లో తడబడుతోంది. ముఖ్యంగా డెత్‌‌ ఓవర్లలో అంతా ఫెయిలవుతున్నారు. మహ్మది షమీ అండగా ఇతర బౌలర్లు రాణించలేకపోతున్నారు. పంజాబ్‌‌ గెలవాలంటే ఈ ప్రాబ్లమ్‌‌ ను అధిగమించి తీరాలి.

కార్తీక్‌ బ్యాటింగ్‌కు పరీక్ష..

కార్తీక్‌ బ్యాటింగ్‌కు పరీక్ష..

నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కుతున్న కేకేఆర్‌‌ లీగ్‌‌లో బలమైన పోటీదారుగా మారుతోంది. కెప్టెన్‌గా అడపాదడపా విజయాలందిస్తున్న కార్తీక్.. వ్యక్తిగతంగా రాణించలేకపోతున్నాడు. ఈ కారణంగానే తన కెప్టెన్సీపై కూడా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. గత ఐదు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా అతను గాడినపడాల్సిన అవసరం ఉంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో బౌలర్ల ప్రదర్శనతో గట్టెక్కిన కేకేఆర్.. బ్యాటింగ్‌లో విఫలమైంది. రాహుల్ త్రిపాఠి ఓపెనర్‌గా పంపించడం కలిసొచ్చి విజయాన్నందుకుంది.శుభ్‌మన్ గిల్, ఇయాన్ మోర్గాన్, నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠి ఫామ్‌లో ఉన్నారు. డీకే తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చాల్సి ఉంది. విధ్వంసకర వీరుడు ఆండ్రీ రస్సెల్ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. వీరు రాణిస్తే కేకేఆర్ బ్యాటింగ్‌కు తిరుగుండదు. గత మ్యాచ్‌తో సునీల్ నరైన్‌ టచ్‌లోకి వచ్చాడు.ఇక కమిన్స్, నాగర్ కోటి, శివమ్ మావి, వరుణ్‌లతో బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగవచ్చు.

తుది జట్లు:

తుది జట్లు:

కింగ్స్ పంజాబ్: కేఎల్ రాహుల్(కెప్టెన్), క్రిస్ గేల్/గ్లేన్ మ్యాక్స్‌వెల్, మయాంక్ అగర్వాల్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్(కీపర్), నికోలస్ పూరన్, మన్‌దీప్ సింగ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ, షెల్డన్ కాట్రెల్, అర్ష్ దీప్ సింగ్

కోల్‌కతా నైట్‌రైడర్స్: సునీల్ నరైన్, శుబ్‌మన్ గిల్, నితీష్ రాణా, దినేశ్ కార్తీక్ (కెప్టెన్, కీపర్), ఇయాన్ మోర్గాన్, ఆండ్రీ రస్సెల్, రాహుల్ త్రిపాఠి, పాట్ కమిన్స్, కమలేష్ నాగర్‌కోటి, శివం మావి, వరుణ్ చక్రవర్తి

పిచ్ రిపోర్ట్:

పిచ్ రిపోర్ట్:

బ్యాటింగ్, బౌలింగ్ అనుకూలంగా ఉండే వికెట్. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవచ్చు. ఈ మైదానంలో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. సాయంత్ర 3.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా.. స్టార్ స్పోర్ట్స్ చానెల్స్‌, డిస్నీ హాట్‌స్టార్‌‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

ముఖాముఖి..

ముఖాముఖి..

ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటి వరకు 25 సార్లు తలపడగా 17-8తో కేకేఆర్ లీడ్‌లో ఉంది. ఇదే ఆధిపత్యాన్ని కొనసాగించాలని కేకేఆర్ భావిస్తుండగా.. లెక్క సరిచేయాలనే పట్టుదలతో పంజాబ్ ఉంది. 2014లో ఇరు జట్ల మధ్య అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ గెలిచింది.

RR vs DC: రిషభ్ పంత్ నిర్లక్ష్యపు రనౌట్.. కామెంటేటర్ల మధ్య వాగ్వాదం!

Story first published: Saturday, October 10, 2020, 12:40 [IST]
Other articles published on Oct 10, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+