పంత్ అలసత్వమే..
ఈ రనౌట్‌లో పంత్ తప్పు ఏ మాత్రం లేదని, స్టోయినిస్ పిలవడంతోనే అతను రన్‌కు ప్రయత్నించాడని మురళీ కార్తీక్ వెనుకెసుకొచ్చాడు. అయితే ఈ వ్యాఖ్యలను తప్పుబట్టిన పీటర్సన్.. ముమ్మాటికీ పంత్ నిర్లక్ష్యం, అలసత్వమే ఈ రనౌట్‌కు కారణమన్నాడు. ఎవరి వికెట్‌కు వారే బాధ్యులని, ఇన్నింగ్స్ ముగిసే వరకు అలానే ఆడాలన్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం అక్కడేం జరిగిందో తనకు తెలియదని, కానీ వికెట్ కోల్పోవడం పంత్ అలసత్వమే కారణమని పీటర్సన్ అన్నాడు. ఈ వ్యాఖ్యలకు సహచర కామెంటేటర్, న్యూజిలాండ్ మాజీ పేసర్ సైమన్ డౌల్ కూడా మద్దతు తెలిపాడు.

నిద్రలో నుంచి లేచినట్లే..
ఇక ఢిల్లీ ఇన్నింగ్స్ సందర్భంగా రాహుల్ తెవాటియా వేసిన 10 ఓవర్ తొలి బంతిని స్టోయినిస్ సిల్లీ మిడాన్‌లోకి ఆడగా.. పంత్ పరుగు కోసం పరుగెత్తాడు. అయితే అక్కడే ఉన్న సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ మనన్ వోహ్రా చాకచక్యంగా బంతిని అందించడంతో పంత్ రనౌట్‌గా వెనుదిరిగాల్సింది. నిజానికి స్టోయినిస్ కూడా సింగిల్ కోసం పిలవలేదు. ఫీల్డర్‌ను చూసుకోకుండా పంతే పరుగెత్తి మూల్యం చెల్లించుకున్నాడు. క్లిష్ట స్థితిలో రాణించాల్సిన బాధ్యతను మరిచి నిర్లక్ష్యంగా వికెట్ చేజార్చుకున్నాడు. పంత్ బేసిక్స్ మిస్సయ్యాడనే కామెంటేటర్ల మాటలు వినిపించాయి.

పంత్ ఔటైనా.. ఢిల్లీదే విజయం..
రిషభ్ పంత్ నిర్లక్ష్యపు రనౌట్.. ఢిల్లీ ఫలితంపై ప్రభావం చూపలేదు. ఆల్‌రౌండ్ షో అదరగొట్టడంతో 46 పరుగులతో అద్భుత విజయాన్నందుకొని టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులు చేసింది. షిమ్రాన్ హెట్‌మైర్ (24 బంతుల్లో 45; 1 ఫోర్, 5 సిక్సర్లు), స్టొయినిస్ (30 బంతుల్లో 39; 4 సిక్సర్లు) మెరిపించారు. ఆర్చర్ 3 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ 19.4 ఓవర్లలో 138 పరుగులే చేసి ఆలౌటైంది. రాహుల్ తేవటియా (29 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), యశస్వి జైస్వాల్ (36 బంతుల్లో 34; 1 ఫోర్, 2 సిక్స్‌లు) మెరుగనిపించారు. ఢిల్లీ బౌలర్ రబడ 3 వికెట్లు తీశాడు. కీలకమైన 2 వికెట్లు తీసిన అశ్విన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది.


Click it and Unblock the Notifications

RR vs DC: రాజస్థాన్ రాయల్స్‌ను ముంచిన మూడు తప్పిదాలు!










