KXIP vs CSK: కింగ్స్ పంజాబ్ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలివే!

దుబాయ్: మూడు వరుస పరాజయాల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ గెలుపు బాటపట్టింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతూ.. ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో పంజాబ్‌ను చిత్తు చేసింది. ఓపెనర్లు షేన్ వాట్సన్(53బంతుల్లో 11 ఫోర్లు 3 సిక్స్‌లతో 83 నాటౌట్), ఫాఫ్ డూప్లెసిస్(53 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 87 నాటౌట్) రికార్డు భాగస్వామ్యంతో దంచికొట్టారు. ఇది పంజాబ్‌కు హ్యాట్రిక్ పరాజయం కావడంతో పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పడిపోయింది. బ్యాటింగ్‌లో లభించిన మంచి ఆరంభాన్ని భారీ స్కోర్‌గా మలచకపోవడం, బౌలర్లు తేలిపోవడం, పంజాబ్ ఓటమికి ప్రధాన కారణాలు. టీమ్ కాంబినేషన్ సెట్ కాకపోవడం కూడా పంజాబ్ విజయావకాశాలను దెబ్బతీసింది. ముఖ్యంగా మూడు వ్యూహాత్మక తప్పిదాలతో పంజాబ్ మూల్యం చెల్లించుకుంది.

చేతులెత్తేసిన పంజాబ్..
సీఎస్‌కే, పంజాబ్ రెండు జట్లు పాయింట్ల పట్టికలో అట్టుడుగు స్థానం కోసం పోటీపడ్డాయి. రెండు వరుస పరాజయాల తర్వాత బరిలోకి దిగిన పంజాబ్ ఆత్మవిశ్వాసం లోపించింది. పైగా చెన్నై ఓపెనర్లు అద్బుతంగా ఆడటంతో ముందే చేతులెత్తేసింది. పోరాడే ప్రయత్నం కూడా చేయలేకపోయింది. సాధారణ స్కోర్‌తో కష్టమనే భావన పంజాబ్ ఆటగాళ్లలో కనిపించింది. ఈ కారణంగానే తొలిసారి పంజాబ్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది. పవర్ ప్లే ముగిసిన వెంటనే ఓటమి ఖాయమనే భావనకు రావడం కూడా పంజాబ్‌ను దెబ్బతీసింది. ఇలా కాకుండా కొంచెం పోరాట పటిమ కనబర్చి ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని వీడిదీసుంటే పంజాబ్ పోటీలో నిలిచేది. మ్యాచ్ ఏకపక్షంగా కాకుండా కొంత రసవత్తరంగా సాగేది.

ఐదుగురు బౌలర్లతో కాకుండా..
ఈ సీజన్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ బ్యాటింగ్ అద్భుతంగా ఉంది. వారి టాపార్డర్ ఫుల్ ఫామ్‌లో ఉంది. అందుకే ఆ జట్టు అలవోకగా భారీ స్కోర్‌లు చేస్తుంది. కానీ బౌలింగ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోతుంది. భారీ స్కోర్‌లను కాపాడుకోలేకపోతుంది. మహ్మద్ షమీ, రవిబిష్ణోయ్ మినహా ఇతర బౌలర్లు విఫలమవుతున్నారు. ఈ క్రమంలో అదనపు బౌలర్‌తో పంజాబ్ బరిలోకి దిగుతుందని అంతా భావించగా.. రాహుల్ మాత్రం మరో బౌలింగ్ ఆల్‌రౌండర్‌కే మొగ్గుచూపాడు. నలుగు బౌలర్లు, ఓ ఆల్‌రౌండర్ ఫార్ములానే కొనసాగించడం పంజాబ్ ఓటమికి కారణమైంది. ఈ మ్యాచ్‌లో తీసుకొచ్చిన హర్‌ప్రీత్ బ్రార్ నాలుగు ఓవర్లలో 41 పరుగులు సమర్పించుకున్నాడు. తదుపరి మ్యాచ్‌కైనా పంజాబ్ తప్పులను సవరించుకోకుంటే మూల్యం చెల్లించుకోవాల్సిందే.

పంజాబ్‌పైనే రెండో సారి..
తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 178 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్(52 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 63), నికోలస్ పూరన్(17 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లతో 33) రాణించారు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 17.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 181 పరుగులు చేసి 16 బంతులు ఉండగానే సునాయస విజయాన్నందుకుంది. విజయంలో కీలక పాత్ర పోషించిన షేన్ వాట్సన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది. ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 10 వికెట్ల విజయాన్ని అందుకోవడం ఇది రెండోసారి. 2013లోనూ కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పైనే చెన్నై జట్టు తొలి 10 వికెట్ల విజయాన్ని సాధించడం విశేషం. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో 12 సార్లు 10 వికెట్ల తేడాతో విజయాలు నమోదయ్యాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+

Click it and Unblock the Notifications